Ind Vs Eng : జోరు చూపిన రాహుల్, జడేజా.. ఆఖర్లో బుమ్రా మెరుపులు.. టీమిండియాదే పై చేయి..

Photo Credit : Twitter

Ind Vs Eng : ఇంగ్లండ్ తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ లో టీమిండియా పట్టు బిగిస్తోంది. మొదటి ఇన్నింగ్స్ లో 95 పరుగుల కీలక ఆధిక్యాన్ని దక్కించుకుంది కోహ్లీసేన. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 278 పరుగులకి ఆలౌట్ అయ్యింది.

  • Share this:
    ఇంగ్లండ్ తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ లో టీమిండియా పట్టు బిగిస్తోంది. మొదటి ఇన్నింగ్స్ లో 95 పరుగుల కీలక ఆధిక్యాన్ని దక్కించుకుంది కోహ్లీసేన. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 278 పరుగులకి ఆలౌట్ అయ్యింది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీలతో అదరగొట్టగా ఆఖర్లో బుమ్రా మెరుపులు మెరిపించాడు. ఓవర్‌నైట్ స్కోర్ 125/4 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకి మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. అయితే బ్రేక్ తర్వాత ఆటను ప్రారంభించిన టీమిండియా త్వరగానే పంత్ వికెట్ కోల్పోయింది. 20 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్, రాబిన్‌సన్ ఓవర్‌లో బెయిర్ స్టోకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. రవీంద్ర జడేజాతో కలిసి ఆరో వికెట్‌కి 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కెఎల్ రాహుల్ సెంచరీ ముగింట పెవిలియన్ చేరాడు. 214 బంతుల్లో 12 ఫోర్లతో 84 పరుగులు చేసిన కేఎల్ రాహుల్, అండర్సన్ బౌలింగ్‌లో బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రాహుల్ వికెట్ తీసిన అండర్సన్, టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా అనిల్ కుంబ్లేని అధిగమించాడు. ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్ మాత్రం అండర్సన్ కంటే ముందున్నారు.

    ఇది కూడా చదవండి : మరోసారి భారతీయుల మనసు గెల్చిన మీరాబాయి.. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..

    ఆ తర్వాత 6 బంతులు ఆడిన శార్దూల్ ఠాకూర్ కూడా పరుగులేమీ చేయకుండానే అండర్సన్ బౌలింగ్‌లోనే జో రూట్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 205 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది టీమిండియా. శార్దూల్ ఠాకూర్ అవుటైన తర్వాత దూకుడు పెంచిన రవీంద్ర జడేజా 81 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జడేజాకి ఇది టెస్టుల్లో 16వ హాఫ్ సెంచరీ.. 86 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 56 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, రాబిన్‌సన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి, స్టువర్ట్ బ్రాడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 20 బంతుల్లో 13 పరుగులు చేసిన మహ్మద్ షమీని రాబిన్‌సన్ క్లీన్‌బౌల్డ్ చేయగా... బుమ్రా, సిరాజ్ కూడా బౌండరీలు బాదడంతో టీమిండియా స్కోరు 260+ పరుగులు దాటింది.


    బుమ్రా 33 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేయగా సిరాజ్ 8 బంతుల్లో 7 పరుగులు చేశాడు. బుమ్రాకి టెస్టుల్లో ఇదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. సిరాజ్, బుమ్రా కలిసి 10వ వికెట్‌కి 33 పరుగుల భాగస్వామ్యం నమోదుచేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్‌కి నాలుగు వికెట్లు దక్కగా, ఓల్లీ రాబిన్‌సన్ ఐదు వికెట్లు తీశాడు. అంతకుముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 183 రన్స్‌ చేసింది.
    Published by:Sridhar Reddy
    First published: