IND vs ENG : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేసేది ఎవరంటే..?

England Vs India (Image: BCCI)

IND vs ENG : భారత్-ఇంగ్లండ్ మధ్య జరగనున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు రంగం సిద్దమైంది. నాటింగ్‌హమ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం వేదికగా ప్రారంభం కానున్న ఫస్ట్ టెస్ట్‌తో నెలన్నరపాటు సాగే ఈ మెగా సిరీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • Share this:
    భారత్-ఇంగ్లండ్ మధ్య జరగనున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు రంగం సిద్దమైంది. నాటింగ్‌హమ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం వేదికగా ప్రారంభం కానున్న ఫస్ట్ టెస్ట్‌తో నెలన్నరపాటు సాగే ఈ మెగా సిరీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్ టీమ్.ఈ సిరీస్‌తో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌‌షిప్ రెండో ఎడిషన్‌కు తెరలేవనుంది. దాంతో ఇరు జట్లు బోణీ కొట్టాలని భావిస్తున్నాయి. ఇక న్యూజిలాండ్ చేతిలో డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడిన భారత్.. మళ్లీ సత్తాచాటేందుకు సిద్దమవుతుండగా.. అదే టీమ్ చేతిలో సొంతగడ్డపై ఓడిన ఇంగ్లండ్ గాడిన పడాలని భావిస్తోంది.ఇక కివీస్ తో జరిగిన WTC ఫైనల్లో వాతావరణం భారత్ పతనాన్ని శాసించింది. వర్షం కారణంగా మూడున్నర రోజుల ఆట తుడిచిపెట్టుకుపోగా.. రిజర్వ్‌డేతో కలుపుకొని రెండున్నర రోజుల ఆటే సాధ్యమైంది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ మాదిరే ఈ సిరీస్‌లోనూ వాతావారణం కీలక పాత్ర పోషించనుంది. ఫస్ట్ టెస్ట్‌కు వర్షం ముప్పు ఏం లేకపోయినప్పటికీ.. మైదానాన్ని మేఘాలు కమ్ముకొని చల్లని గాలులు వీచే అవకాశం ఉంది. ఇదే జరిగితే పేసర్ల రాజ్యం నడవనుంది. ముఖ్యంగా స్వింగ్ బౌలర్లు కింగ్ అవ్వనున్నారు. అప్పుడు ఇంగ్లండ్ కు అడ్వాండేజ్ కానుంది.

    టీమిండియా బౌలింగ్ లైనప్ కూడా పటిష్టంగానే ఉంది. బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌, శార్దూల్ ఠాకూర్‌లతో కూడిన పేస్ బౌలింగ్‌తోపాటు జడేజాకు ఫస్ట్ టెస్ట్ లో చోటు కల్పించాడు కోహ్లీ. అశ్విన్ కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఇక, రోహిత్ శర్మ తో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు కేఎల్ రాహుల్.

    భారత్ తుది జట్టు : రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రిషభ్ పంత్, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా

    ఇంగ్లండ్ తుది జట్టు : రోరీ బర్న్స్, డొమినిక్ సిబ్లీ, జాక్ క్రాలీ, జోరూట్(కెప్టెన్), జానీ బెయిర్ స్టో , డానియెల్ లారెన్స్, జోస్ బట్లర్(కీపర్), సామ్ కరన్, ఓలీ రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్
    Published by:Sridhar Reddy
    First published: