హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs ENG : హార్దిక్ పాండ్యా అదుర్స్.. ఇంగ్లండ్ బెదుర్స్.. ఫస్ట్ టీ20లో టీమిండియా బంపర్ విక్టరీ..

IND vs ENG : హార్దిక్ పాండ్యా అదుర్స్.. ఇంగ్లండ్ బెదుర్స్.. ఫస్ట్ టీ20లో టీమిండియా బంపర్ విక్టరీ..

Team India ( PC : BCCI)

Team India ( PC : BCCI)

IND vs ENG : ఐపీఎల్ లో తన ఆల్ రౌండ్ షోతో గుజరాత్ ను విజేతగా నిలబెట్టిన హార్దిక్ పాండ్యా.. అంతర్జాతీయ క్రికెట్ లో కూడా దుమ్మురేపుతున్నాడు. ఇంగ్లండ్ తో జరిగిన తొలి టీ20 మొదట బ్యాటింగ్ లో చెలరేగిన పాండ్యా.. ఆ తర్వాత బౌలింగ్ లో దుమ్మురేపి టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు.

ఇంకా చదవండి ...

  కీలకమైన ఐదో టెస్ట్ లో ఓడిపోయి సిరీస్ సమం చేసుకున్న టీమిండియా(Team India).. ధనాధన్ సిరీస్(IND vs ENG T20I Series) లో మాత్రం అదిరిపోయే ఆరంభం చేసింది. మూడు టీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా సౌతాంప్టన్ లో ఇంగ్లండ్ తో జరిగిన ఫస్ట్ టీ20 మ్యాచులో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. హార్దిక్ పాండ్యా (Hardik Pandya)ఆల్ రౌండ్ షోతో 50 పరుగుల తేడాతో గెలిచి శుభారంభం చేసింది. 199 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. హార్దిక్ దెబ్బకి 19.3 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. ఇన్‌ఫామ్‌ బ్యాట్స్‌మన్‌.. కొత్త కెప్టెన్‌ జాస్‌ బట్లర్‌ (Jos Buttler).. భువనేశ్వర్‌ బౌలింగ్‌లో గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత హారీ బ్రూక్‌ 28, మొయిన్‌ అలీ 36 పరుగులు చేసినప్పటికి ఇంగ్లండ్‌ను ఓటమి నుంచి కాపాడలేకపోయారు. హార్దిక్ పాండ్యా నాలుగు వికెట్లతో దుమ్మురేపాడు. హార్దిక్‌ పాండ్యాతో పాటు అర్షదీప్, చాహల్ చెరో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. చివర్లో జోర్డాన్‌ 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన ప్రయోజనం లేకపోయింది.

  ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో టీమిండియా1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఇరుజట్ల మధ్య రెండో టి20 శనివారం(జూలై 9న) జరగనుంది. ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకున్న హార్దిక్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అంతకుముందు.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 198పరుగులు చేసింది. క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు వచ్చీ రాగానే బ్యాట్ ఝలిపించడంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది.

  హార్దిక్‌ పాండ్యా(33 బంతుల్లో 51 పరుగులు, 6 ఫోర్లు, 1 సిక్సర్‌), దీపక్‌ హుడా(17 బంతుల్లో 33 పరుగులు, 3 ఫోర్లు, 2 సిక్సర్లు‌), సూర్యకుమార్‌ యాదవ్‌(19 బంతుల్లో 39 పరుగులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అంతకముందు రోహిత్‌ శర్మ 14 బంతుల్లో 24 పరుగులు చేశాడు.తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు శుభారంభం దక్కింది. కరోనా నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి చేరిన కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడైన ఆటతో ఇన్నింగ్స్ ఆరంభించాడు.

  అయితే, మొయిన్ అలీ బౌలింగ్ లో రోహిత్ (24పరుగులు 14బంతుల్లో 5ఫోర్లు) కీపర్ క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా.. తన ఫామ్ కొనసాగించాడు. మొయిన్ అలీ వేసిన అయిదో ఓవర్లో బ్యాక్ టూ బ్యాక్ సిక్సులు కొట్టి జోరుకొచ్చాడు. అయితే, అదే ఓవర్లో ఇషాన్ కిషన్ (8పరుగులు 10బంతుల్లో) స్వీప్ షాట్ ఆడాలని చూసి క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాత దీపక్ హుడాతో కలిసిన సూర్యకుమార్ యాదవ్ కూడా తన బ్యాట్ కు పని చెప్పడంతో స్కోరుబోర్డు పరుగులెట్టింది. అయితే, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని జోర్డాన్ విడదీశాడు.

  91పరుగుల వద్ద దీపక్ హుడా (33పరుగులు 17బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా వచ్చి తన ఐపీఎల్ ఫామ్ ను ఇక్కడ కూడా కంటిన్యూ చేశాడు. మరోవైపు.. సూర్యకుమార్ యాదవ్ కూడా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఇక ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని మరోసారి జోర్డాన్ విడగొట్టాడు. సూర్యకుమార్ (39పరుగులు 19బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సులు) ఫుష్ షాట్ ఆడాలని ప్రయత్నించగా గ్లావ్స్ కు తాకి కీపర్ బట్లర్ చేతిలోకి బాల్ వెళ్లగా.. అంపైర్ నాటౌట్ ఇచ్చాడు కానీ ఇంగ్లాండ్ రివ్యూ తీసుకోవడంతో ఔటయ్యాడు.

  ఇది కూడా చదవండి : ధోనిని మొదట్లో అంతగా పట్టించుకోని సాక్షి.. ఆ తర్వాత ప్రేమకు ఎలా ఒప్పుకుందో తెలుసా..?

  అయితే.. దినేష్ కార్తీక్‌కు బదులు అక్షర్ పటేల్ వచ్చాడు. ఇక అక్షర్‌తో కలిసి హార్దిక్ పాండ్యా స్కోరు బోర్డును పరుగులెత్తించాడు.ఈ ఇద్దరూ అడపాదడపా ఫోర్లు బాదుతూ రన్ రేట్ పడిపోకుండా చూశారు. ఈ క్రమంలో స్పిన్నర్ పార్కిన్సన్ బౌలింగ్లో అక్షర్ (17పరుగులు 12బంతుల్లో 3ఫోర్లు) క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాత సిక్స్ కొట్టి హార్దిక్ పాండ్యా టీ20ల్లో తన తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 30బంతుల్లో 50పరుగులు చేశాడు.

  ఆఖర్లో టోప్లే బౌలింగ్లో (51పరుగులు 33బంతుల్లో 6ఫోర్లు 1సిక్సర్) ఔటయ్యాడు. ఇక 18ఓవర్లో టోప్లే 4పరుగులే ఇవ్వగా, 19ఓవర్లో జోర్డాన్ 5పరుగులే ఇవ్వడంతో స్కోరు బోర్డు కాస్త మందగించింది. ఇక చివరి ఓవర్లో దినేష్ కార్తీక్ (11పరుగులు 7బంతుల్లో 2ఫోర్లు) రెండు ఫోర్లు బాది క్యాచ్ ఔట్ అయ్యాడు. తర్వాత హర్షల్ పటేల్ కూడా రనట్ అయ్యాడు. దీంతో ఇండియా 198పరుగులు చేయగలిగింది.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, Dinesh Karthik, Hardik Pandya, IND VS ENG, India vs england, Rohit sharma

  ఉత్తమ కథలు