ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ (India Vs England) మధ్య శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన ఆఖరి టెస్ట్ రద్దయింది. భారత జట్టులో కరోనా కలకలం (Corona Effect) రేగడంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డుల పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే..ఐదో టెస్టు ప్రారంభ సమయానికి కొన్ని గంటల ముందు సోషల్ మీడియాలో హై డ్రామా నడిచింది. కొందరు వాయిదా పడిదంటే, మరికొందరు రద్దు అయిందని..ఇంకొందరైతే టీమిండియా, ఇంగ్లాండ్‌కి మ్యాచ్‌ని ఇచ్చేసి తిరుగు పయనమైందని నానా రకాల వార్తలు వండేశారు. దీంతో సిరీస్ 2-2 తో సమం అయిందని టీమిండియా (Team India Latest Telugu News) ఫ్యాన్స్ నిరాశపడ్డారు. ఐపీఎల్ కోసమే బీసీసీఐ ఇలా చేసిందంటూ ఫైరయ్యారు.ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా ఈ విధంగానే వెబ్సైట్లో ప్రకటన విడుదల చేసింది. అయితే సోషల్ మీడియాలో ఇంత జరుగుతున్నా, ఏమీ కానట్టు సైలెంట్‌గా ఉండిపోయిన బీసీసీఐ... హై డ్రామా అంతా ముగిశాక అధికారిక ప్రకటన విడుదల చేసింది.
" బీసీసీఐ, ఈసీబీ (ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు) కలిసి సంయుక్తంగా మాంచెస్టర్‌లో జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్‌ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. భారత బృందంలో కరోనా కేసులు వెలుగుచూడడం వల్ల మ్యాచ్‌ను ఎలాగైనా నిర్వహించాలని పలు దఫాలుగా చర్చలు నిర్వహించినా... దారి దొరక్కపోవడంతో రద్దు చేయాలని నిర్ణయానికి వచ్చాం.ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, బీసీసీఐ మధ్య ఉన్న బలమైన అనుబంధం కారణంగా... భారత క్రికెట్ బోర్డు, ఇంగ్లాండ్ జట్టుకే ఈ టెస్టు మ్యాచ్‌ను రీ షెడ్యూల్ చేసే అవకాశాన్ని ఇచ్చింది.
Update: The BCCI and ECB held several rounds of discussion to find a way to play the match, however, the outbreak of Covid-19 in the Indian team contingent forced the decision of calling off the Old Trafford Test.
Details: https://t.co/5EiVOPPOBB
— BCCI (@BCCI) September 10, 2021
ఇరుజట్లకీ అనువైన సమయంలో ఐదో టెస్టును నిర్వహిస్తాం భారత క్రికెట్ బోర్డు ఎప్పుడూ ఆటగాళ్ల సంక్షేమం విషయంలో రాజీ పడదు. ఈ కష్టకాలంలో భారత క్రికెట్ బోర్డుకి అండగా నిలిచిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు... ఐదో టెస్టును నిర్వహించలేకపోతున్నందుకు క్రికెట్ అభిమానులకు క్షమాపణలు తెలియచేస్తున్నాం." అంటూ మీడియాకి తెలియచేశాడు బీసీసీఐ సెక్రటరీ జైషా.
అయితే, బీసీసీఐ ప్రకటన ఒకలా ఉంటే.. ఈసీబీ మాత్రం మరోలా స్పందించింది. " రీషెడ్యూల్ చేసే టెస్టు మ్యాచ్‌కి ఈ సిరీస్‌లో సంబంధం లేదు... అది ఏకైక టెస్టు మ్యాచ్‌గా ఉంటుంది. ఈ టెస్టు సిరీస్ ఇక్కడితో ముగిసింది. అయితే టెస్టు సిరీస్ రిజల్ట్ ఏంటనేది ఐసీసీ నిర్ణయిస్తుంది. ఐసీసీ తీసుకునే నిర్ణయం ఇరు జట్లకీ సానుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నాం" అంటూ ప్రకటన చేసింది.
మాంచెస్టర్లోనే ఇండియా, ఇంగ్లాండ్ మధ్య టెస్టు మ్యాచ్ జరుగుతుందని ఈసీబీ తెలిపింది. అది కేవలం నేటి మ్యాచ్ రద్దు కావడంతో నిరాశకు గురైన క్రికెట్ ఫ్యాన్స్ కోసమే నిర్వహిస్తామని ప్రకటిచింది.
ఇది కూడా చదవండి : దాదా బయోపిక్ కు రంగం సిద్ధం.. హీరో, ప్రొడ్యూసర్ ఎవరంటే..!
మరోవైపు ఐసీసీ తీసుకునే నిర్ణయంపైనే ఈ టెస్టు సిరీస్ ఫలితం ఆధారపడి ఉంది. సాధారణంగా అయితే టెస్టు సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న భారత్‌కే సిరీస్ విజయం దక్కాలి.అయితే ఇంగ్లాండ్ ఆడడానికి సిద్ధంగా ఉన్నా, భారత బృందంలో కరోనా కేసుల కారణంగా ఆట సాధ్యం కాకపోవడంతో మ్యాచ్ రద్దు చేయాల్సి వచ్చింది. కాబట్టి ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Corona effect, Cricket, India vs england, Ravi Shastri, Sports