Rohit Sharma - Dinesh Karthik : " పెళ్లికి ముందు రోహిత్ శర్మ ఆ సినిమా చూసి ఏడ్చేవాడు " ..

Rohit Sharma

Rohit Sharma - Dinesh Karthik : క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించక ముందే కామెంటేటర్‌గా అవతారం ఎత్తిన దినేశ్ కార్తీక్(Dinesh Karthik), తనదైన స్టైల్‌లో అభిమానులను అలరిస్తున్నాడు. తొలి టెస్టు సమయంలో విరాట్ కోహ్లీ (Virat Kohli)ని ఇంటర్వ్యూ చేసి, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను బయటకి తీసుకొచ్చిన కార్తీక్, ఇప్పుడు రోహిత్ శర్మ (Rohit Sharma)తో ఇంటర్వ్యూ చేశాడు.

  • Share this:
    క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించక ముందే కామెంటేటర్‌గా అవతారం ఎత్తిన దినేశ్ కార్తీక్(Dinesh Karthik), తనదైన స్టైల్‌లో అభిమానులను అలరిస్తున్నాడు. తొలి టెస్టు సమయంలో విరాట్ కోహ్లీ (Virat Kohli)ని ఇంటర్వ్యూ చేసి, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను బయటకి తీసుకొచ్చిన కార్తీక్, ఇప్పుడు రోహిత్ శర్మ (Rohit Sharma)తో ఇంటర్వ్యూ చేశాడు. లార్డ్స్ మైదానంలో జరిగే రెండో టెస్టు సమయంలో రోహిత్ శర్మతో దినేశ్ కార్తీక్ చేసిన ఇంటర్వ్యూ టెలికాస్ట్ కానుంది. అయితే ఈ ఇంటర్వ్యూకి సంబంధించి ఓ చిన్న క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు దినేశ్ కార్తీక్.అందులో.. రోహిత్​ పెళ్లి తర్వాత ఎలా మారిపోయాడనే విషయాన్ని కార్తిక్ తెలియజేసే ప్రయత్నం చేశాడు​.రితిక సజ్దేతో వివాహానికి ముందు రోహిత్​ శర్మ 'సూర్యవంశం' సినిమా చూసిన ఏడ్చేసేవాడు. కానీ పెళ్లి తర్వాత.. రోహిత్​ పూర్తిగా మారిపోయాడు. గేమ్​ ఆఫ్​ థ్రోన్స్​, బ్రేకింగ్​ బ్యాడ్​ వంటి ఇంగ్లీష్​ వెబ్​ సిరీస్​లు చూసేస్తున్నాడని దినేశ్ కార్తీక్ చెప్పగా.. రోహిత్​ శర్మ నవ్వుతూ బదులిచ్చాచ్చాడు. "ఎవరు చెప్పారు నీకు ఇది? నిజమే.. చాలా మారింది" అంటూ రోహిత్ ముసి ముసి నవ్వులు నవ్వుకున్నాడు​. దీనికి సంబంధించిన వీడియోను డీకే.. రోహిత్ శర్మ ఇంటర్వ్యూకు సంబంధించిన స్నీక్ పిక్ ఇది.. సెకండ్ టెస్ట్ సందర్భంగా మీ ముందుకు పూర్తి ఇంటర్వ్యూ వస్తుంది. సారీ రోహిత్ నీ సీక్రెట్స్ అన్ని చెప్పేస్తున్నా'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

    ఇది కూడా చదవండి : ఈ క్రికెటర్లు చాలా హాట్ గురూ! ఈ జనరేషన్ లో టాప్-10 హ్యాండ్సమ్ క్రికెటర్లు వీరే..

    ఇక, వర్షం కారణంగా తొలి టెస్ట్‌లో విజయానికి దూరమైన టీమిండియా.. ఇంగ్లండ్‌తో కీలకమైన రెండో టెస్ట్‌కు రెడీ అయ్యింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టులో ఓ మార్పు చోటు చేసుకోగా.. ఇంగ్లండ్ టీమ్‌లో మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. శార్దూల్ ఠాకూర్ స్థానంలో ఇషాంత్ శర్మ జట్టులోకి రాగా.. వరుసగా విఫలమవుతున్న జాక్‌ క్రాలీ, డేనియల్ లారెన్స్ స్థానంలో హసీబ్ హమీద్, మొయిన్ అలీ ఇంగ్లండ్ జట్టులోకి వచ్చారు. గాయంతో సిరీస్ మొత్తానికి దూరమయిన సీనియర్ పేసర్ స్టువర్ట్‌ బ్రాడ్‌ బదులు మార్క్ వుడ్ బరిలోకి దిగాడు.


    మరోవైపు.. ఈ మ్యాచ్ కూడా వరుణుడు అడ్డంకిగా మారాడు. ఇప్పటికే పలుమార్లు ఇబ్బంది పెట్టాడు. వరుణుడి కారణంగా నాటింగ్‌హామ్‌ టెస్టులో గెలిచే అవకాశాన్ని కోల్పోయిన కోహ్లీసేన.. మలి టెస్టులో ఇంగ్లండ్‌పై పంజా విసరాలని చూస్తోంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ సత్తాచాటేందుకు భారత్ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతోంది. అయితే బ్యాటింగ్‌ వైఫల్యం టీమిండియాను వేధిస్తోంది. ఇక, రెండో టెస్ట్ లో కూడా వరుణుడు ఇదే విధంగా అంతరాయం కలిగిస్తే టీమిండియాకు నష్టం జరిగే అవకాశముందని భారత ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
    Published by:Sridhar Reddy
    First published: