IND vs ENG : టీమిండియా సిరీస్ ముందు ఇంగ్లండ్ కు భారీ షాక్.. క్రికెట్ కు విరామం ప్రకటించిన బెన్ స్టోక్స్..

బెన్ స్టోక్స్ (ఫైల్ ఫోటో)

IND vs ENG : టీమిండియాతో ఐదు టెస్టుల సిరీస్ కు సన్నద్ధమవుతున్న ఇంగ్లండ్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. అనేక సిరీస్ లలో ఇంగ్లండ్ విజయాల్లో కీ రోల్ ప్లే చేసిన స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ (Ben Stokes) కొన్నాళ్లు ఆటకు విరామం పలకాలని నిర్ణయించుకున్నాడు.

  • Share this:
    టీమిండియాతో ఐదు టెస్టుల సిరీస్ కు సన్నద్ధమవుతున్న ఇంగ్లండ్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. అనేక సిరీస్ లలో ఇంగ్లండ్ విజయాల్లో కీ రోల్ ప్లే చేసిన స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ (Ben Stokes) కొన్నాళ్లు ఆటకు విరామం పలకాలని నిర్ణయించుకున్నాడు. క్రికెట్ నుంచి నిరవధిక విరామం ప్రకటించాడు. అన్ని ఫార్మాట్లకు కొన్నాళ్లు పాటు గుడ్ బై చెబుతున్నట్టు వెల్లడించాడు. వ్యక్తిగత కారణాలతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.కొన్నాళ్ల పాటు ఏ ఫార్మాట్లోనూ ఆడకూడదని స్టోక్స్ నిర్ణయం తీసుకున్నట్టు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వెల్లడించింది.తన మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, ఎడమచేతి చూపుడు వేలుకు తగిలిన గాయం నుంచి కోలుకోవడంపైనా దృష్టి సారించేందుకు ఈ విరామాన్ని ఉపయోగించుకోవాలని స్టోక్స్ భావిస్తున్నాడని ఈసీబీ పేర్కొంది. స్టోక్స్ నిర్ణయానికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు బోర్డు వెల్లడించింది. తన మనోభావాలను నిర్భయంగా వెల్లడించాడని, తాము అతడికి అండగా నిలుస్తామని ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ ఆష్లే గైల్స్ తెలిపారు.

    ఆగస్టు 4 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్ జరగనుంది. సుదీర్ఘమైన ఈ సిరీస్ లో స్టోక్స్ వంటి ప్రపంచస్థాయి ఆల్ రౌండర్ సేవలు కోల్పోవడం ఇంగ్లండ్ జట్టుకు పెద్ద లోటు అని చెప్పాలి. అయితే, స్టోక్స్ స్థానాన్ని సోమర్సెట్ ఆల్ రౌండర్ క్రెగ్ ఒవర్టన్ తో భర్తీ చేయనున్నారు. ఇక, ఈ సిరీస్ తో పాటు ఐపీఎల్ కూడా దూరం కానున్నాడు బెన్ స్టోక్స్.


    ఈ ఏడాది తొలి విడత ఐపీఎల్ సీజన్ లో బెన్ స్టోక్స్ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లకు దూరమయ్యాడు. అయితే, గాయం నుంచి కోలుకున్న బెన్ స్టోక్స్ హండ్రెడ్ లీగ్ ఆడుతున్నాడు. అయితే, ఇప్పుడు ఈ ఆల్ రౌండర్ నిర్ణయం క్రికెట్ ఫ్యాన్స్ ను అయోమయంలో పడేసింది. గతంలోనూ మ్యాక్స్ వెల్ లాంటి క్రికెటర్ కూడా మానసిక కారణాలతో కొన్ని నెలల పాటు క్రికెట్ కు దూరం ఉన్న సంగతి తెలిసిందే.
    Published by:Sridhar Reddy
    First published: