Sourav Ganguly : రంగంలోకి దాదా.. త్వరలోనే ఇంగ్లండ్ కు పయనం.. ఎందుకో తెలుసా..?

సౌరవ్ గంగూలీ

Sourav Ganguly : భారత్ తప్పిదాన్ని ఈసీబీ ఎత్తిచూపుతోంది. రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ ఆ పబ్లిక్ ఈవెంట్‌కి కనీసం ఈసీబీ నుంచి పర్మీషన్ కూడా తీసుకోలేదట.

 • Share this:
  ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ (India Vs England) మధ్య శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన ఆఖరి టెస్ట్ రద్దయింది. భారత జట్టులో కరోనా కలకలం (Corona Effect) రేగడంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డుల పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే..ఐదో టెస్టు ప్రారంభ సమయానికి కొన్ని గంటల ముందు సోషల్ మీడియాలో హై డ్రామా నడిచింది. కొందరు వాయిదా పడిదంటే, మరికొందరు రద్దు అయిందని..ఇంకొందరైతే టీమిండియా, ఇంగ్లాండ్‌కి మ్యాచ్‌ని ఇచ్చేసి తిరుగు పయనమైందని నానా రకాల వార్తలు వండేశారు. దీంతో సిరీస్ 2-2 తో సమం అయిందని టీమిండియా (Team India Latest Telugu News) ఫ్యాన్స్ నిరాశపడ్డారు. ఐపీఎల్(IPL News) కోసమే బీసీసీఐ ఇలా చేసిందంటూ ఫైరయ్యారు.ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా ఈ విధంగానే వెబ్‌సైట్‌లో ప్రకటన విడుదల చేసింది. అయితే సోషల్ మీడియాలో ఇంత జరుగుతున్నా, ఏమీ కానట్టు సైలెంట్‌గా ఉండిపోయిన బీసీసీఐ... హై డ్రామా అంతా ముగిశాక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌ను నిలిపివేసినా భవిష్యత్‌లో తిరిగి నిర్వహించడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆసక్తి చూపుతోంది.

  మరోవైపు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా ఇదో టెస్ట్ మ్యాచ్ జరగాలని కోరుకుంటోంది. వచ్చే ఏడాది ఐపీఎల్ 2022 ముగిసిన తర్వాత భారత్​తో 3 వన్డేలు, 3 టీ20లు ఇంగ్లీష్ జట్టు ఆడనుంది. ఆ సమయంలో ఈ టెస్ట్ మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి.

  ఐదో టెస్టుకు ముందు రోజు గురువారం సాయంత్రం టీమిండియా జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్‌‌‌‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే అతడితో పలువురు భారత ఆటగాళ్లు ప్రైమరీ కాంటాక్ట్‌లుగా ఉన్నారని తెలిసింది.

  దీంతో ఆటగాళ్లందరికీ ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయగా.. నెగెటివ్‌గా తేలింది. అయినా భారత జట్టు ముందు జాగ్రత్త చర్యగా చివరి టెస్టులో ఆడలేమని బీసీసీఐకి లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఈసీబీ, బీసీసీఐ బోర్డుల పెద్దలు చర్చించి మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇక ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఐదో మ్యాచ్‌పై స్పష్టత లేకపోవడంతో సిరీస్‌ ఫలితం కూడా తేలాల్సి ఉంది.

  ఐదో టెస్ట్ మ్యాచ్‌ రద్దవడంతో ఈసీబీకి సుమారు రూ.300 కోట్లు నష్టం వచ్చే అవకాశముందని నివేదికలు తెలియజేస్తున్నాయ్. దీంతో భవిష్యత్‌లో ఈ మ్యాచ్ తిరిగి నిర్వహించడానికి బీసీసీఐ ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు ఈసీబీతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే ఇదే విషయంపై ఈసీబీ ప్రతినిధులతో మాట్లాడేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) త్వరలో ఇంగ్లండ్‌కు వెళ్లనున్నాడని తెలిసింది.

  ఇది కూడా చదవండి : తన ప్రేయసి కారణంగానే ఇషాన్ కిషన్ టీ-20 వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించాడా..?

  సెప్టెంబర్‌ 22న లేదా 23న గంగూలీ అక్కడికి వెళ్లి ఈసీబీతో పాటు మ్యాచ్‌ ప్రసార హక్కుదారులతో చర్చలు జరుపుతాడని సమాచారం. ఆ సమావేశం తర్వాత ఐదో టెస్ట్ ఎప్పుడు జరగనుందనేది తేలనుంది. దాదాపుగా వచ్చే ఏడాదే మ్యాచ్ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు, బయోబబుల్ రూల్స్ బ్రేక్ చేసినా.. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, కోహ్లీలపై ఈసీబీ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

  ఇది కూడా చదవండి : " పెళ్లై ఓ బిడ్డకు తల్లివి.. ఇంత ఎక్స్‌పోజింగ్‌ అవసరమా ".. షమీ భార్యపై దారుణమైన ట్రోలింగ్..

  టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి గత వారం హాజరవగా.. అతనితో పాటు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా వెళ్లాడు. అక్కడే రవిశాస్త్రికి కరోనా సోకగా.. అతని నుంచి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌లకు కూడా వైరస్ సోకింది. అనంతరం ఫిజియో యోగేశ్ పర్మార్‌‌‌‌ కరోనా వచ్చింది. దీంతో భారత్ తప్పిదాన్ని ఈసీబీ ఎత్తిచూపుతోంది. రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ ఆ పబ్లిక్ ఈవెంట్‌కి కనీసం ఈసీబీ నుంచి పర్మీషన్ కూడా తీసుకోలేదట. మరోవైపు, ఈ ఘటనపై బీసీసీఐ విచారణకు ఆదేశించింది.
  Published by:Sridhar Reddy
  First published: