యాభై ఏళ్ల తర్వాత ఓవల్‌లో భారత్‌కు టెస్టు విజయం దక్కింది. ఆఖరి రోజు అద్భుతంగా బౌలింగ్ చేసిన టీమ్ ఇండియా (Team India) నాలుగో టెస్టులో 157 పరుగుల తేడాతో ఆతిథ్యఇంగ్లండ్ను ఓడించింది. 368 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 77/0తో అయిదో రోజు, సోమవారం బరిలోకి దిగినఇంగ్లండ్.. 210 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఐదు టెస్ట్ ల మ్యాచ్ సిరీస్ లో 2-1 తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది కోహ్లీసేన. అయితే, నాలుగో టెస్ట్ .. ఫోర్త్ డే సందర్భంగా టీమిండియాలో కరోనా కలకలం చెలరేగిన సంగతి తెలిసిందే. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri)తో పాటు మరికొంతమంది టీమ్ సభ్యులు పాల్గొన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే రవిశాస్త్రి కరోనా వైరస్ బారిన పడగా అతనికి సన్నిహితంగా ఉన్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌లు సైతం పాజిటీవ్ తేలారు. సన్నిహితంగా ఉన్న ఫిజియో నితిన్ పటేల్‌తో పాటు దాంతో వీరిని ఐసోలేషన్‌కు తరలించారు.
అయితే, జట్టులో కరోనా కలకలానికి హెడ్ కోచ్ రవిశాస్త్రి 'స్టార్ గేజర్' పుస్తకావిష్కరణ కార్యక్రమమే కారణమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్ ప్రారంభానికి ముందు ఈ బుక్ లాంచింగ్ కార్యక్రమం జరగ్గా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli), కోచ్ రవిశాస్త్రితో పాటు మరికొంతమంది టీమ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వల్లే కరోనా స్ప్రెడ్ అయినట్లు తెలుస్తోంది.
కరోనా ఎఫెక్ట్ తో టీమిండియా కోచింగ్ స్టాఫ్ సెప్టెంబర్ 10(శుక్రవారం) నుంచి ప్రారంభమయ్యే చివరి టెస్ట్‌కు దూరమయ్యారు. ఆటగాళ్లందరికి నెగటీవ్ వచ్చినప్పటికీ బబుల్ నిబంధనలకు విరుద్దంగా బుక్ లాంచింగ్ ఫంక్షన్‌కు హాజరవ్వడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి వెళ్లడం, కరోనా వైరస్ బారిన పడటంపై సమగ్ర దర్యాప్తు జరపనుందని బోర్డుకు సంబంధించిన ఓ అధికారి మీడియాకు తెలిపారు.
ఈ కార్యక్రమానికి హాజరుకావడంపై కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు కోచ్ రవిశాస్త్రిలను వివరణ కోరనుందని చెప్పారు. టీమ్ మేనేజర్ గిరీష్ పాత్రపై కూడా దర్యాప్తు జరపనుంది. బయో బబుల్ నిబంధనలకు విరుద్దంగా బుక్ లాంచింగ్ ఎలా అనుమతించారని ప్రశ్నించనుంది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే బీసీసీఐ పెద్దల దగ్గరకు వెళ్లాయి.
ఇది కూడా చదవండి : అంతలా ప్రేమించాడు..? ఇప్పుడు విడాకులు తీసుకోవడానికి కారణం ఇదేనా..?
రిషభ్ పంత్ కరోనా బారిన పడిన తర్వాత ఆటగాళ్లనుద్దేశించి బోర్డు సెక్రటరీ జైషా లెటర్ రాశాడు. అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. అయినా అతని హెచ్చిరికలను బేఖాతరు చేసిన ఆటగాళ్లు.. ప్రైవేట్ ఫంక్షన్‌కు హజరవ్వడం బీసీసీఐ పెద్దలకు ఆగ్రహాన్ని తెప్పించిందంట. ఫోర్త్ టెస్ట్ ఆడే ఏ ఆటగాడికి కరోనా రాకపోవడంతో మ్యాచ్ సజావుగా జరిగింది. లేకపోతే అసలకే ఎసరు వచ్చే అవకాశం ఉందని క్రీడా పండితులు హెచ్చరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Corona effect, Cricket, India vs england, Ravi Shastri, Virat kohli