ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్న టీమిండియా (Team India)ను కరోనా (Corona Effect) కలవరపెడుతోంది. ఇప్పటికే నాలుగో టెస్టు సమయంలో భారత హెడ్‌కోచ్ రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫిజియోథెరపిస్ట్ కరోనా బారిన పడగా... లేటెస్ట్ గా భారత బృందంలో మరో పాజిటివ్ కేసు నమోదైంది. భారత క్రికెట్ జట్టులోని సపోర్ట్ స్టాఫ్‌కు కరోనా వైరస్ సోకింది. దీంతో కోహ్లీసేన ట్రైనింగ్‌ను రద్దు చేసినట్లు బీసీసీఐ వర్గాల ద్వారా(Latest Telugu News) వెల్లడైంది. ఓల్డ్ ట్రాఫొర్డ్‌లో శుక్రవారం నుంచి ఇంగ్లండ్, ఇండియా మధ్య అయిదో టెస్టు ప్రారంభం కావాల్సి ఉంది. ఆ టెస్టు జరగడం అనుమానంగా మారింది.భారత ఆటగాళ్లు అందరూ ముందుజాగ్రత్తగా హోటల్ గదులకే పరిమితమయ్యారు. భారత బృందంలో మరో పాజిటివ్ కేసు నమోదుకావడంతో ఐదో టెస్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
శుక్రవారం ఉదయం మరో విడతగా భారత జట్టు ప్లేయర్లందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో అందరికీ నెగిటివ్ రిజల్ట్ వస్తేనే, మ్యాచ్ ప్రారంభమవుతుంది.లేదంటే ఐదో టెస్టును వాయిదా వేయడం లేదా రద్దు చేయడం జరుగుతుంది. ఇప్పటికే టీమిండియా టెస్టు సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది.
దీంతో ఐదో టెస్టు రద్దు అయితే భారత జట్టుకి టెస్టు సిరీస్ సొంతమవుతుంది. కాబట్టి ఇంగ్లాండ్ బోర్డు, ఆఖరి టెస్టును ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించడానికే ప్రాధాన్యం ఇవ్వొచ్చు. నాలుగో టెస్టు మూడో రోజు సాయంత్రం లండన్‌లో ఓ ఫైవ్ స్టార్ హోటెల్‌లో ఏర్పాటు చేసిన పార్టీకి కోచ్ రవిశాస్త్రితో పాటు టీమిండియా సభ్యులందరూ హాజరయ్యారు.
Yogesh Parmar tests positive. Hope none of the boys test positive for then the match is gone. All have tested negative but another test has been done. Fingers crossed. So both our physics positive means we might have to take a physio from England.
— Boria Majumdar (@BoriaMajumdar) September 9, 2021
ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకి, బీసీసీఐకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బయో బబుల్ నుంచి బయటికి వెళ్లిన ఈ కార్యక్రమం వల్లే టీమిండియాకి వైరస్ సోకి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అధికారులు.ఇలా చెప్పాపెట్టకుండా బయటికి ఎందుకు వెళ్లారో వివరణ ఇవ్వాల్సిందిగా ఇప్పటికే భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీలను ఆదేశాలు జారీ చేసింది బీసీసీఐ.
ఇది కూడా చదవండి : బీసీసీఐ మాస్టర్ స్కెచ్ అదుర్స్.. ధోనీ ఎంపిక వెనుక ఉన్న వ్యూహం అదేనా..?
మరోవైపు, సెప్టెంబర్ 19వ తేదీ నుంచి ఐపీఎల్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో.. ఆ టోర్నమెంట్‌పై ఎటువంటి ప్రభావం పడకూడదన్న ఉద్దేశంతో బీసీసీఐ ఉంది. దీంతో రేపటి నుంచి ప్రారంభం అయ్యే అయిదో టెస్టు చివరి వరకు స్టార్ట్ అయ్యేది డౌటే.యూకే ప్రభుత్వ రూల్స్ ప్రకారం పాజిటివ్ వచ్చిన వాళ్లు పది రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి. ఆ తర్వాత రెండు సార్లు నెగటివ్ వస్తేనే వాళ్లు బయటకు వెళ్లాలి. ప్రస్తుతం లండన్‌లోనే రవిశాస్త్రి, అరుణ్, శ్రీధర్‌లు క్వారెంటైన్‌లో ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona effect, Cricket, India vs england, Ravi Shastri, Team India, Virat kohli