ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్ (India Vs England)లో టీమిండియా (Team India) 157 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో భారత్ చెలరేగితే.. ఇంగ్లండ్ విఫలమైంది. దీంతో ఐదు టెస్ట్ ల సిరీస్ లో టీమిండియా 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే, ఈ గ్రాండ్ విక్టరీ తర్వాత టీమిండియా ఆటగాళ్లు, ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు తమదైన స్టైల్ లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ (Mohammed Kaif) సెలబ్రేషన్స్ మాత్రం డిఫరెంట్ గా జరుపుకున్నాడు. ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు సోమవారం ముగిసింది. ఈ మ్యాచ్‌కు హిందీ కామెంటేటర్‌గా భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ వ్యవహరించాడు. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో కైఫ్ మాట్లాడుతూ.. టీమిండియా ఓవల్ టెస్టు నెగ్గితే తాను కచ్చితంగా నాగిని డ్యాన్స్ వేస్తానంటూ చెప్పుకొచ్చాడు.
నిజామా అని సహచరులు అడగ్గా.. కావాలంటే మ్యాచ్ అయ్యాక చూడండి అని సమాధానం ఇచ్చాడు. 368 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఐదవ రోజు 210 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో భారత్ 157 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మహ్మద్ కైఫ్ తాను ఇచ్చిన మాట ప్రకారం నాగిని డ్యాన్స్ నేర్చుకొని మరి కొన్ని స్టెప్పులు వేశాడు. దానికి సంబంధించిన గ్లింప్స్‌ను కైఫ్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. " టీమిండియా గెలిచిందిగా.. సంబురాలు మామూలుగా ఉండవు. నచ్చిన విధంగా సెలబ్రేట్ చేసుకుంటాం. అది ఎంత వికారంగా ఉన్నా పర్వాలేదు" అంటూ కైఫ్ క్యాప్షన్‌ను జోడించాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియలో వైరలవుతోంది. ఎప్పుడూ కామ్‌గా కనిపించే కైఫ్.. ఇలా నాగిని డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
भाई लोग आप की फरमाइश पे |
Anything for an India victory, no matter how awkward :) pic.twitter.com/aSgGA1pUQE
— Mohammad Kaif (@MohammadKaif) September 7, 2021
మరోవైపు దుబాయ్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండోదశ కోసం మహ్మద్ కైఫ్ దుబాయ్ చేరుకున్నాడు. అక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఏర్పాటు చేసిన క్యాంప్‌లో మంగళవారం చేరాడు. మరికొన్ని రోజుల పాటు దుబాయ్ హోటల్ క్వారంటైన్లో గడపనున్నాడు కైఫ్. అనంతరం ఢిల్లీ ఆటగాళ్ల ఆటను పరిశీలించనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్ గా చేస్తున్నాడు కైఫ్. ఇక, ఐదో టెస్ట్ ఈ నెల 10 నుంచి మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ను 3-1 తో దక్కించుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, IND VS ENG, India vs england, Viral Video