Viral Video : కోహ్లీకి కోపం వస్తే ఇలానే ఉంటుంది.. ఔటైన కోపంలో విరాట్ ఏం చేశాడంటే..

విరాట్ కోహ్లీ

Viral Video : భారత్-ఇంగ్లాండ్ (India Vs England) జట్ల మధ్య.. ఓవల్ వేదికగా సాగుతోన్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పోరాడుతోంది. ఫస్ట్ సెషన్ లో ఇంగ్లండ్ సత్తా చాటినప్పటికీ.. సెకండ్ సెషన్ లో పంత్ (Rishabh Pant), శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) రాణిస్తున్నారు.

 • Share this:
  భారత్-ఇంగ్లాండ్ (India Vs England) జట్ల మధ్య.. ఓవల్ వేదికగా సాగుతోన్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పోరాడుతోంది. ఫస్ట్ సెషన్ లో ఇంగ్లండ్ సత్తా చాటినప్పటికీ.. సెకండ్ సెషన్ లో పంత్ (Rishabh Pant), శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) రాణిస్తున్నారు. మార్నింగ్ సెషన్ లో టీమిండియా (Team India) వేగంగా మూడు వికెట్లు కోల్పోయింది. లంచ్ విరామానికి ఆరు వికెట్లు కోల్పోయి 329 పరుగులు చేసింది టీమిండియా. ఇక, ఓవర్‌నైట్ స్కోరు 270/3తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 296 పరుగుల వద్ద వరుసగా రవీంద్ర జడేజా (17), అజింక్య రహానే (0) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే కెప్టెన్ కోహ్లీ (Virat Kohli)అవుటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ కరువు తీరుస్తాడనుకున్న వేళ 44 పరుగుల వద్ద మొయిన్ అలీ బౌలింగ్ లో స్లిప్స్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రవీంద్ర జడేజా, అజింక్య రహానే ఇద్దరూ క్రిస్ వోక్స్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగారు. రహానే తన చెత్త ఫామ్ ను కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు.

  ఓవర్ నైట్ స్కోర్ 22 పరుగులతో విరాట్ కోహ్లీ, తొమ్మిది పరుగులతో రవీంద్ర జడేజా నాలుగో రోజు తొలి సెషన్ ఆరంభించారు. ఎక్కువ సేపు నిలవలేకపోయారు. తొలుత రవీంద్ర జడేజా అవుట్ అయ్యాడు. ఓవర్ నైట్ స్కోరుకు ఎనిమిది పరుగులు మాత్రమే జోడించి.. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. మిడిల్ వికెట్ మీద పిచ్ అయిన బంతిని ఫ్లిక్ చేయబోయి గురి తప్పాడు. అది కాస్త నేరుగా ప్యాడ్స్‌ను తాకింది. ఇంగ్లాండ్ ప్లేయర్లు అప్పీల్ చేయడం.. అంపైర్ వేలు పైకెత్తడం చకచకా జరిగిపోయాయి. మిడ్ వికెట్ మీద పడిన బంతి స్వింగ్ అయి.. ఆఫ్ స్టంప్ మీదికి దూసుకెళ్తోన్నట్లు రీప్లేలో స్పష్టమైంది. అప్పటికి జట్టు స్కోరు 296 పరుగులు.


  రవీంద్ర జడేజా అవుట్ అయిన తరువాత అజింక్యా రహానె క్రీజ్‌లోకి వచ్చాడు. ఎక్కవ సేపు నిలవలేకపోయాడు. ఎనిమిది బంతులను ఎదుర్కొన్న తరువాత పెవిలియన్ దారి పట్టాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. లెగ్ స్టంప్ మీద పడిన బంతిని మిడ్ వికెట్ మీదుగా ఆడబోయి గురి తప్పాడు. అది నేరుగా ప్యాడ్స్‌ను తాకింది. దీన్ని క్లీన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. రహానె రూపంలో 296 పరుగుల వద్దే అయిదో వికెట్‌ను కోల్పోయింది భారత్.


  జట్టు స్కోరు 312 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను కోల్పోయింది టీమిండియా. క్రీజ్‌లో కుదురుకుని అద్భుతమైన షాట్లను ఆడుతూ కనిపించిన కేప్టెన్ విరాట్ కోహ్లీ స్పిన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. తన తొలి ఓవర్‌లోనే కోహ్లీని పెవిలియన్ దారి పట్టించాడు స్పిన్నర్ మొయిన్ అలీ. 44 పరుగుల వద్ద మొయిన్ అలీ బౌలింగ్‌లో ఓవర్టన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడతను. ఆఫ్ స్టంప్ లైన్ మీద పడిన బంతిని పుష్ చేయబోయాడు కోహ్లీ. టైమింగ్ మిస్ అయింది. ఎడ్జ్ తీసుకుని గాల్లోకి ఎగిరిన బంతిని ఓవర్టన్ అందుకున్నాడు.

  ఇది కూడా చదవండి : ఇదే కదా టీమిండియా ఫ్యాన్స్ కు కావాల్సింది..! రోహిత్ సెంచరీకి.. కోహ్లీ రియాక్షన్ చూశారా..!

  ఇక, ఔటై అయి.. డ్రెస్సింగ్ రూమ్ కు చేరుకునే సమయంలో విరాట్ కోహ్లీ తనపై తానే ఆగ్రహాన్ని వ్యక్తం చేసుకున్నట్టు కనిపించింది. తీవ్ర అసహనంతో కనిపించాడతను. బలంగా గోడను బాదుకుంటూ.. హెల్మెట్ ను పక్కకు విసిరాడు కోహ్లీ. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

  విరాట్ కోహ్లీ.. ఈ సిరీస్‌లో స్పిన్నర్‌కు వికెట్‌ను పారేసుకోవడం ఇదే తొలిసారి. ఇప్పటిదాకా తొమ్మిది ఇన్నింగులను ఆడిన కోహ్లీని ఫాస్ట్ బౌలర్లే బలి తీసుకుంటూ వచ్చారు. ఈ సారి మొయిన్ అలీ ఆ డ్యూటీని తీసుకున్నాడు. ఈ సిరస్‌లో పడుతూ లేస్తూ సాగుతోంది. టీమిండియా కేప్టెన్ బ్యాటింగ్. 44, 13, 0, 42, 20, 7, 55, 50, 44 ఇలా సాగుతోంది అతని ఇన్నింగ్. మూడుసార్లు 40 ప్లస్, రెండు సార్లు 50 ప్లస్ స్కోర్ సాధించాడు.
  Published by:Sridhar Reddy
  First published: