క్వారంటైన్.. శ్రీలంక టూర్.. కరోనా ఎఫెక్ట్.. ఇంగ్లండ్ టూర్.. క్వారంటైన్.. టీమిండియా ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) గత 65 రోజుల షెడ్యూల్. ఈ 65 రోజుల్లో తన భార్యకు దూరంగా ఉన్నాడు ఈ యంగ్ బ్యాట్స్ మన్. ఈ ఐపీఎల్ స్టార్ ఎట్టకేలకు తన సతీమణి దేవిషా శెట్టిని కలుసుకున్నాడు. దాదాపు 65 రోజుల తర్వాత భార్యను కలవడంతో సూర్య ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం ముంబై బ్యాట్స్‌మన్ తన భార్యతో కలిసి లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. ఈ సందర్భంగా వారిద్దరూ డ్యాన్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. ఆ వీడియోను సూర్యకుమార్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం భారత్ ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. గతనెల శ్రీలంక పర్యటనకు ఎంపికైన సూర్యకుమార్ యాదవ్.. మే నెలలోనే ముంబైలోని ఓ స్టార్ హోటల్లో రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉన్నాడు. లంక పర్యటనలో పలువురు భారత ఆటగాళ్లు కరోనా బారిన పడడంతో మరోసారి క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాడు. దీంతో చివరి రెండు టీ20లకు అతడు దూరమయ్యాడు. ఆ తర్వాత లంక పర్యటనలోనే ఉన్న సూర్య.. ఇంగ్లండ్‌లో పలువురు ఆటగాళ్లు గాయాలబారిన పడటంతో వారికి రీప్లేస్‌మెంట్‌గా అక్కడికి వెళ్లాడు. అక్కడ కూడా మరోసారి క్వారంటైన్ పూర్తిచేశాడు. ఈ క్రమంలోనే దేవిషాకు రెండు నెలల పాటు దూరంగా ఉన్నాడు.
ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ సతీమణి దేవిషా శెట్టి కూడా లండన్‌కు చేరుకోని, తన క్వారంటైన్ గడువును పూర్తి చేసుకుంది. తాజాగా తన భర్తను కలుసుకుంది. దీంతో యువ జంట లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ నూతనోత్సాహంలో మునిగితేలారు. సూర్యకుమార్ 3-4 ఏళ్లుగా ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నా టీమిండియాకు ఇటీవలే ఎంపికయ్యాడు. తొలుత స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఎంపికైన సూర్య గతనెల శ్రీలంకలో తొలి అంతర్జాతీయ పర్యటనకు వెళ్లాడు. ఇప్పుడు శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్ స్థానాల్లో పృథ్వీ షాతో కలిసి అనూహ్యంగా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాడు. శ్రీలంక పర్యటనలో రెచ్చిపోయి ఆడిన సూర్య ఇంగ్లండ్ తన ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు.
View this post on Instagram
రెండో టెస్ట్ తర్వాత మూడో మ్యాచ్ కు దాదాపు పది రోజుల గ్యాప్ రావడంతో టీమిండియా ఆటగాళ్లు తమ కుటుంబాలతో సరదాగా గడుపుతున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మ తో లంచ్ కి వెళ్లి ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే.
View this post on Instagram
View this post on Instagram
ఇక, టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన భార్య, వ్యాఖ్యాత సంజన గణేషన్‌తో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఏడాది మార్చిలో బుమ్రా, సంజనాలు ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజా పర్యటనలో సంజనా గణేశన్‌తో దిగిన పోటోలను బుమ్రా తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. మరోవైపు, రోహిత్ శర్మ కూడా తన భార్య రితికా శర్మతో కలిసి ఇంగ్లండ్ లో సరదాగా గడుపుతున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anushka Sharma, Cricket, India vs england, Jasprit Bumrah, Rohit sharma, Sanjana Ganesan, Virat kohli