Home /News /sports /

IND VS ENG 5TH TEST LIVE SCORES WATCH JOE ROOTS STUNNING CATCH END VIRAT KOHLIS INNINGS SJN

Virat Kohli : బ్యాడ్ లక్ అంటే ఇదే.. పాపం కోహ్లీకి ఏదీ కలిసి రావడం లేదు.. (వీడియో)

PC : TWITTER

PC : TWITTER

Virat Kohli : టీమిండియా (Team India)లో విరాట్ కోహ్లీ (Virat Kohli)కి బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఒకప్పుడు స్లార్ ప్లేయర్ గా వెలుగొందిన కోహ్లీ.. ఇప్పుడు పేలవ ఫామ్ తో జట్టులో తన స్థానాన్ని సైతం ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు. ఇక ప్రస్తుతం ఇంగ్లండ్ (England)తో జరుగుతోన్న ఐదో టెస్టు మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలోనూ పెద్దగా రాణించలేకపోయాడు.

ఇంకా చదవండి ...
Virat Kohli : టీమిండియా (Team India)లో విరాట్ కోహ్లీ (Virat Kohli)కి బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఒకప్పుడు స్లార్ ప్లేయర్ గా వెలుగొందిన కోహ్లీ.. ఇప్పుడు పేలవ ఫామ్ తో జట్టులో తన స్థానాన్ని సైతం ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు. ఇక ప్రస్తుతం ఇంగ్లండ్ (England)తో జరుగుతోన్న ఐదో టెస్టు మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలోనూ పెద్దగా రాణించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్ లో (11) పరుగులు చేసిన కోహ్లీ.. రెండో ఇన్నింగ్స్ లో (20) పరుగులు చేశాడు. రెండు సందర్భాల్లోనూ కోహ్లీని బ్యాడ్ లక్ వెంటాడింది. తొలి ఇన్నింగ్స్ లో పాట్స్ వేసిన బంతిని వదిలేసే ప్రయత్నంలో బ్యాట్ ను పైకి ఎత్తగా బంతి బ్యాట్ కు ఎడ్జ్ తీసుకుని వికెట్లకు తాకింది.

ఇది కూడా చదవండి : మొన్న రోహిత్ ను వడ పావ్ అన్నావ్.. ఇప్పుడేమో ఏకంగా కోహ్లీని అంత మాట అంటావా?

ఇక రెండో ఇన్నింగ్స్ లో కోహ్లీ క్రీజులో ఉన్నంతసేపూ కూడా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. అయితే బెన్ స్టోక్స్ వేసిన బంతి ఎక్స్ ట్రా బౌన్స్ అవ్వడంతో.. కోహ్లీ గ్లౌవ్ ను తాకుతూ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. కీపర్ బిల్లింగ్ సైతం బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. దాంతో బంతి అతడి గ్లౌవ్స్ లో పడి బౌన్స్ అయింది. క్యాచ్ డ్రాప్ అనుకునే సమయంలో బంతి నేరుగా మొదటి స్లిప్ లో ఉన్న జో రూట్ కుడి వైపు వెళ్లింది. అప్రమత్తంగా ఉన్న రూట్ ఒంటి చేత్తో క్యాచ్ ను అందుకున్నాడు. దాంతో కోహ్లీ పెవిలియన్ కు చేరాల్సి వచ్చింది. అసలే పూర్ ఫామ్ లో ఉన్న కోహ్లీకి లక్ కూడా లేదంటూ  అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జో రూట్ సమయస్ఫూర్తిని అందరూ మెచ్చుకుంటున్నారు.



ఆతిథ్య ఇంగ్లండ్ కు భారీ టార్గెట్ సెట్ చేసే దిశగా టీమిండియా ఇన్నింగ్స్ సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యం కలిపి ప్రస్తుతం 257 పరుగుల ఆధిక్యంలో ఉంది టీమిండియా. ప్రస్తుతం క్రీజులో పుజారా (50 నాటౌట్ ), రిషబ్ పంత్ (30 నాటౌట్) ఉన్నారు. గిల్ (4), విహారీ(11), కోహ్లీ (20) మరోసారి నిరాశపర్చారు. జేమ్స్ అండర్సన్, బ్రాడ్, స్టోక్స్ తలా ఓ వికెట్ తీశారు. ఇదే జోరు రేపు కూడా టీమిండియా కొనసాగిస్తే.. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్ సెట్ చేసే అవకాశం ఉంది. 75 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా టీమిండియా ఇన్నింగ్స్ ను పుజారా, పంత్ ఆదుకున్నారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఈ క్రమంలో పుజారా తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: India vs england, Jasprit Bumrah, Mohammed Shami, Mohammed Siraj, Ravindra Jadeja, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు