IND VS ENG 5TH TEST LIVE SCORES TEAM INDIA STAR VIRAT KOHLI AND ENGLAND BATTER JONNY BAIRSTOW FEISTY SLEDGE IN EDGBASTON TEST SJN
IND vs ENG : లేపి మరీ తన్నించుకోవడం అంటే ఇదే కోహ్లీ.. అతడితో గొడవ నీకు అవసరమా?
PC : TWITTER
IND vs ENG : న్యూజిలాండ్ ()తో ఇటీవలె ముగిసిన మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో ఇంగ్లండ్ (England) బ్యాటర్ జానీ బెయిర్ స్టో (Jonny Bairstow) ఏ విధంగా ఆడాడో మనకు తెలిసిన విషయమే. రెండు సెంచరీలతో పాటు ఒక అర్ధ సెంచరీ చేసి చివరి రెండు టెస్టుల్లో ఇంగ్లండ్ విజయానికి బెయిర్ స్టో కీలకంగా నిలిచాడన్న సంగతి మనందరికీ తెలిసిందే.
IND vs ENG : న్యూజిలాండ్ ()తో ఇటీవలె ముగిసిన మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో ఇంగ్లండ్ (England) బ్యాటర్ జానీ బెయిర్ స్టో (Jonny Bairstow) ఏ విధంగా ఆడాడో మనకు తెలిసిన విషయమే. రెండు సెంచరీలతో పాటు ఒక అర్ధ సెంచరీ చేసి చివరి రెండు టెస్టుల్లో ఇంగ్లండ్ విజయానికి బెయిర్ స్టో కీలకంగా నిలిచాడన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక భారత్ తో ఆరంభమైన ఐదో టెస్టులో బెయిర్ స్టో చాలా భిన్నంగా ఆడాడు. రెండో రోజు డిఫెన్స్ కే ఎక్కువ ప్రధాన్యం ఇచ్చాడు. ఇక మూడో రోజు ఆరంభంలో కూడా అసలైన టెస్టు ఆటనే ఆడాడు. కానీ, మన కింగ్ కోహ్లీ (Virat Kohli) అతడితో అనవసరంగా గొడవ పెట్టుకున్నాడు. ఏకాగ్రతను చెడగొట్టాలనే క్రమంలో స్లెడ్జింగ్ కు దిగిన కోహ్లీకి బెయిర్ స్టో బుద్దొచ్చేలా చేశాడు.
మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తోండగా.. 32వ ఓవర్ ను షమీ వేస్తున్నాడు. తొలి బంతి అనంతరం ఏమైందో తెలియదు కానీ.. బెయిర్ స్టోతో కోహ్లీ గొడవకు దిగాడు. ఆ సమయానికి బెయిర్ స్టో 61 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేసి ఉన్నాడు. ఇక కోహ్లీ గొడవకు దిగడంతో.. బెయిర్ స్టో తన బ్యాట్ కు పని చెప్పాడు. అక్కడి నుంచి కేవలం 52 బంతుల్లో 78 పరుగులు చేసి కోహ్లీకి అదిరిపోయే సమాధనం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ గొడవతో మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారిపోయింది.
ఓవర్ నైట్ స్కోరు 5 వికెట్లకు 84 పరుగులతో ఆదివారం ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ లంచ్ విరామానికి 45.3 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు చేసింది. 28.3 ఓవర్ల తొలి సెషన్ లో 116 పరుగులు జోడించింది. బెయిర్ స్టో (113 బంతుల్లో 91 బ్యాటింగ్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజులో ఉన్నాడు. అతడితో పాటు స్యామ్ బిల్లింగ్స్ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. దూకుడుగా మూడో రోజు ఆటను ఇంగ్లండ్ ఆరంభించింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ (25) ఇచ్చిన సులభమైన క్యాచ్ ను శార్దుల్ ఠాకూర్ మిస్ చేశాడు. అనంతరం బెన్ స్టోక్స్ ఒకటి రెండు ఫోర్లు బాాదాడు. కానీ, శార్దుల్ బౌలింగ్ లో బుమ్రా పట్టిన సూపర్ క్యాచ్ కు పెవిలియన్ కు చేరుకున్నాడు. ఇక ఇక్కడి నుంచి బెయిర్ స్టో విధ్వంసం మొదలైంది. అప్పటి వరకు టెస్టు ఆట ఆడుతున్న అతడు.. ఒక్కసారిగా గేర్లు మార్చి బ్యాటింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో అతడు కొన్ని చూడచక్కటి బౌండరీలను బాదాడు. ఈ క్రమంలో సెంచరీకి చేరువైన క్రమంలో వర్షం అంతరాయం కలిగించింది. దాంతో అరగంట ముందుగానే అంపైర్లు లంచ్ విరామాన్ని ప్రకటించారు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.