IND VS ENG 5TH TEST LIVE SCORES TEAM INDIA PLAYER VIRAT KOHLIS TROLLING VIDEOS GOES VIRAL ON SOCIAL MEDIA TWITTER SJN
Virat Kohli : కింగ్ కోహ్లీపై ఫన్నీ ట్రోల్స్.. వీటిని చూస్తే మీరు పడీ పడీ నవ్వాల్సిందే (వీడియో)
PC : TWITTER
Virat Kohli : విరాట్ కోహ్లీ (Virat Kohli) గత కొన్నేళ్లుగా ఫామ్ లో లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. క్రికెట్ లో సెంచరీ చేసి మూడేళ్ల కావొస్తుంది. ఎప్పుడో 2019లో బంగ్లాదేశ్ (Bangladesh)పైన చివరిసారిగా సెంచరీ చేసిన కోహ్లీ మళ్లీ మూడెంకల మార్కును దాటింది లేదు.
Virat Kohli : విరాట్ కోహ్లీ (Virat Kohli) గత కొన్నేళ్లుగా ఫామ్ లో లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. క్రికెట్ లో సెంచరీ చేసి మూడేళ్ల కావొస్తుంది. ఎప్పుడో 2019లో బంగ్లాదేశ్ (Bangladesh)పైన చివరిసారిగా సెంచరీ చేసిన కోహ్లీ మళ్లీ మూడెంకల మార్కును దాటింది లేదు. ఇక ఈ ఏడాది అయితే కోహ్లీ ఆటతీరు మరింత దారుణంగా తయారైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో కేవలం రెండు అర్ధ శతకాలే బాదిన కోహ్లీ 300 మార్కును కూడా దాటలేకపోయాడు. ఇక ఇంగ్లండ్ (England) పర్యటనలో అయినా కోహ్లీ ఫామ్ లోకి వస్తాడనుకుంటే.. తొలి టెస్టులో అతడి బ్యాటింగ్ చూసిన తర్వాత అది కష్టమనే చెప్పాలి.
ఇంగ్లండ్ తో ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరుగుతోన్న ఐదో టెస్టులో కోహ్లీ తొలి ఇన్నింగ్స్ లో 11 పరుగులు.. రెండో ఇన్నింగ్స్ లో 20 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లీ బ్యాటింగ్ లో విఫలం అయినా కూడా ఫీల్డింగ్ లో మాత్రం దూకుడుగా ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్ లో జాక్ లీచ్ క్యాచ్ ను డ్రాప్ చేయడం మినహా ఫీల్డింగ్ లో ఫర్వాలేదనిపిస్తున్నాడు. ప్రత్యర్థి వికెట్ తీసిన ప్రతిసారి కూడా టీిమిండియా ప్లేయర్స్ లో విరాట్ కోహ్లీనే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఇదే ఇప్పుడు ట్రోలర్స్ కు ఇంధనంగా మారింది. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు విరాట్ కోహ్లీ.. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు విరాట్ కోహ్లీ అంటూ ట్విట్టర్ లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. దీనికి విపరీతమైన రెస్పాన్స్ వుస్తుంది. దానిని మీరు కూడా చూసేయండి మరీ. ఇక మరో వీడియోలో అయితే ఎడ్జ్ బాస్టన్ టెస్టులో కోహ్లీ సహకారం అంటూ మరో వీడియోను పెట్టారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక టెస్టు విషయానిక భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో 81.5 ఓవర్లలో 245 పరుగులలకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ను కలుపుకోవడంతో ఇంగ్లండ్ ముందు భారత్ 378 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓవర్ నైట్ బ్యాటర్స్ చతేశ్వర్ పుజారా (66; 8 ఫోర్లు), రిషభ్ పంత్ (57; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 4 వికెట్లు తీశాడు. మ్యాథ్యూ పాట్స్, స్టువర్ట్ బ్రాడ్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో 57 ఓవర్లలో 3 వికెట్లకు 259 పరుగులు చేసింది. మ్యాచ్ లో ఇంగ్లండ్ విజయం సాధించాలంటే మరో 119 పరుగులు చేస్తే చాలు. ప్రస్తుతం క్రీజులో బెయిర్ స్టో (72 బ్యాటింగ్), జో రూట్ (76 బ్యాటింగ్) ఉన్నారు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.