హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs ENG : మరోసారి మెరిసిన రిషభ్ పంత్.. లంచ్ విరామానికి భారీ ఆధిక్యంలో టీమిండియా

IND vs ENG : మరోసారి మెరిసిన రిషభ్ పంత్.. లంచ్ విరామానికి భారీ ఆధిక్యంలో టీమిండియా

PC : BCCI

PC : BCCI

IND vs ENG : ఇంగ్లండ్ (England)తో జరుగుతోన్న చివరిదైన ఐదో టెస్టులో భారత్ (India) పటిష్ట స్థితిలో నిలిచింది. ఓవర్ నైట్ స్కోరు 3 వికెట్లకు 125 పరుగులతో సోమవారం ఆటను కొనసాగించిన భారత్ లంచ్ విరామానికి 73 ఓవర్లలో 7 వికెట్లకు 229 పరుగులు చేసింది.

ఇంకా చదవండి ...

IND vs ENG : ఇంగ్లండ్ (England)తో జరుగుతోన్న చివరిదైన ఐదో టెస్టులో భారత్ (India) పటిష్ట స్థితిలో నిలిచింది. ఓవర్ నైట్ స్కోరు 3 వికెట్లకు 125 పరుగులతో సోమవారం ఆటను కొనసాగించిన భారత్ లంచ్ విరామానికి 73 ఓవర్లలో 7 వికెట్లకు 229 పరుగులు చేసింది. తొలి సెషనల్ లో 28 ఓవర్ల ఆట జరగ్గా భారత్ 4 వికెట్లు నష్టపోయి 104 పరుగులు చేసింది. ఓవర్ నైట్ బ్యాటర్స్ చతేశ్వర్ పుజారా (66; 8 ఫోర్లు), రిషభ్ పంత్ (57; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. శ్రేయస్ అయ్యర్ (19), శార్దుల్ ఠాకూర్ (4) విఫలం అయ్యారు. ప్రస్తుతం రవీంద్ర జడేజా (17 బ్యాటింగ్; 1 ఫోర్), మొహమ్మద్ షమీ (13 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ఓవరాల్ గా భారత్ 361 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. శుబ్ మన్ గిల్ (4), హనుమ విహారి(11), కోహ్లీ (20) మరోసారి నిరాశపర్చారు.

ఐదో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు 284 పరుగులకు ఆలౌట్ అయింది. బెయిర్ స్టో (Jonny Bairstow) (106) సెంచరీతో ఇంగ్లండ్ ఫాలో ఆన్ ను తప్పించుకుంది. టీమిండియాకు 132 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో సిరాజ్4, బుమ్రా 3, షమీ 2 వికెట్లు తీయగా.. శార్దూల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. బెయిర్ స్టోతో పాటు బిల్లింగ్స్ (36), జో రూట్ (31), బెన్ స్టోక్స్ (25) పరుగులు ఫర్వాలేదన్పించారు.ఇక, మూడో రోజు ఆటలో ఇంగ్లండ్‌కు బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ శుభారంభం అందించారు. స్టోక్స్ ఇచ్చిన సునాయస క్యాచ్‌లను భారత ఆటగాళ్లు నేలపాలు చేశారు. అయినా అతను ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదు.

శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత సామ్ బిల్లింగ్స్ క్రీజులోకి రాగా.. బెయిర్ స్టో ధాటిగా ఆడాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన బెయిర్ స్టో.. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఫోర్ బాది 119 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.మొదటి 64 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేసిన బెయిర్‌స్టో, ఆ తర్వాత 54 బంతుల్లో 84 పరుగులు చేయడం విశేషం. ఈ ఏడాదిలో జానీ బెయిర్‌స్టోకి ఇది ఐదో సెంచరీ కాగా.. వరుసగా మూడోది. ఇక సూపర్ డెలివరీతో బెయిర్ స్టోను షమీ ఔట్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.క్రీజులో సెట్ అయిన సామ్ బిల్లింగ్స్‌ను సిరాజ్ ఔట్ చేయగా.. ఆ తర్వాత వచ్చిన స్టువర్ట్ బ్రాడ్(1), మాథ్యూ పోట్స్‌లను కూడా అతనే పెవిలియన్ చేర్చాడు. అంతకు ముందు రిషబ్ పంత్, రవీంద్ర జడేజాల సూపర్ సెంచరీలతో టీమిండియా 416 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. జేమ్స్ అండర్సన్ ఐదు వికెట్లు పడగొట్టాడు.

First published:

Tags: Cheteswar Pujara, India vs england, Jasprit Bumrah, Mohammed Shami, Mohammed Siraj, Ravindra Jadeja, Rishabh Pant, Shreyas Iyer, Team India, Virat kohli