IND VS ENG 5TH TEST LIVE SCORES TEAM INDIA CAPTAIN JASPRIT BUMRAH TAKES 3 WICKETS AND ENGLAND IN BIG TROUBLE IN BIRMINGHAM TEST SJN
IND vs ENG : రోజంతా వర్షం.. మధ్యలో ఆట.. అయినా అదరగొట్టిన టీమిండియా.. కష్టాల్లో ఇంగ్లండ్
PC : BCCI
IND vs ENG : ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇంగ్లండ్ (England), భారత్ (India) మధ్య జరుగుతోన్న ఐదో టెస్టుకు వరుణుడు అడ్డు తగులుతూనే ఉన్నాడు. శుక్రవారం ఈ టెస్టు ఆరంభం కాగా. .తొలి రోజు దాదాపు 17 ఓవర్ల ఆట వర్షార్పణం అయ్యింది. ఇక రెండో రోజు అయితే మరీ దారుణం.
IND vs ENG : ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇంగ్లండ్ (England), భారత్ (India) మధ్య జరుగుతోన్న ఐదో టెస్టుకు వరుణుడు అడ్డు తగులుతూనే ఉన్నాడు. శుక్రవారం ఈ టెస్టు ఆరంభం కాగా. .తొలి రోజు దాదాపు 17 ఓవర్ల ఆట వర్షార్పణం అయ్యింది. ఇక రెండో రోజు అయితే మరీ దారుణం. తొలి రెండు సెషన్లకు వాన అడ్డు తగిలింది. దాంతో తొలి రెండు సెషన్లలో కేవలం 27 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. వాన తగ్గడంతో టీ విరామం తర్వాత మళ్లీ ఆట ఆరంభమైంది. ఓవరాల్ గా శనివారం రోజు కేవలం 38.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్ లో 27 ఓవర్లలో 5 వికెట్లకు 84 పరుగులు చేసింది.
అంతకుముందు ఓవర్ నైట స్కోరు 7 వికెట్లకు 338 పరుగులతో భారత్ శనివారం ఆటను కొనసాగించింది. ఓవర్ నైట్ స్కోరుకు మరో 78 పరుగులు జోడించిన భారత్ మిగిలిన మూడు వికెట్లను కోల్పోయింది. భారత్ 84.5 ఓవర్లలో 416 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా (104) రాణించాడు. 10వ నంబర్ లో బ్యాటింగ్ కు వచ్చిన తాత్కాలిక కెప్టెన్ జస్ ప్రీత్ బుమ్రా (16 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టి20 తరహాలో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో బ్రాడ్ వేసిన 84వ ఓవర్ లో ఏకంగా 35 పరుగులు సాధించాడు. ఇందులో బుమ్రా బ్యాట్ నుంచి 29 పరుగులు రావడం విశేషం.
అనంతరం ఇంగ్లండ్ బ్యాటింగ్ కు దిగగా బుమ్రా రెచ్చిపోయాడు. అలెక్స్ లీ (6), జాక్ క్రాలీ (9), ఒలీ పోప్ (10) వికెట్లను తీసి భారత్ కు శుభారంభం చేశాడు. అనంతరం వర్షం ఆటకు పలుమార్పు అడ్డు తగిలింది. టీ తర్వాత మ్యాచ్ ఆరంభం కాగా మొహమ్మద్ సిరాజ్ భారత్ కు బిగ్ బ్రేక్ ను అందించాడు. ఫామ్ లో ఉన్న రూట్ (31) సిరాజ్ బౌలింగ్ లో కీపర్ పంత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాసేపటికే నైట్ వాచ్ మన్ జాక్ లీచ్ (0) డకౌట్ అయ్యాడు.. అనంతరం ఇంగ్లండ్ మరో వికెట్ పడకుండా రోజును ముగించింది. ప్రస్తుతం క్రీజులో జానీ బెయిర్ స్టో (12 బ్యాటింగ్), కెప్టెన్ బెన్ స్టోక్స్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ మరో 332 పరుగులు వెనుకబడి ఉంది. బుమ్రా 3 వికెట్లు తీయగా.. షమీ, సిరాజ్ తలా ఒక్కో వికెట్ తీశారు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.