Home /News /sports /

IND VS ENG 5TH TEST LIVE SCORES TEAM INDIA ALL OUT FOR 245 IN 2ND INNINGS AND PUT 378 TARGET FOR ENGLAND SJN

IND vs ENG : రెండో ఇన్నింగ్స్ లో ఆలౌటైన భారత్.. ఇంగ్లండ్ లక్ష్యం ఎంతంటే?

PC : TWITTER

PC : TWITTER

IND vs ENG : ఇంగ్లండ్ (England)తో జరుగుతోన్న ఐదో టెస్టులో భారత్ (India) ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్ ను ఉంచింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 81.5 ఓవర్లలో 245 పరుగులలకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ను కలుపుకోవడంతో ఇంగ్లండ్ ముందు భారత్ 378 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 

ఇంకా చదవండి ...
IND vs ENG : ఇంగ్లండ్ (England)తో జరుగుతోన్న ఐదో టెస్టులో భారత్ (India) ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్ ను ఉంచింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 81.5 ఓవర్లలో 245 పరుగులలకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ను కలుపుకోవడంతో ఇంగ్లండ్ ముందు భారత్ 378 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.  ఓవర్ నైట్ బ్యాటర్స్ చతేశ్వర్ పుజారా (66; 8 ఫోర్లు), రిషభ్ పంత్ (57; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు.  శ్రేయస్ అయ్యర్ (19), శార్దుల్ ఠాకూర్ (4) విఫలం అయ్యారు. ప్రస్తుతం రవీంద్ర జడేజా (23 బ్యాటింగ్; 1 ఫోర్), మొహమ్మద్ షమీ (13 ; 2 ఫోర్లు) ఎక్కువ సేపు క్రీజులో నిలబడ లేకపోయారు. శుబ్ మన్ గిల్ (4), హనుమ విహారి(11), కోహ్లీ (20) మరోసారి నిరాశపర్చారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 4 వికెట్లు తీశాడు. మ్యాథ్యూ పాట్స్, స్టువర్ట్ బ్రాడ్ చెరో రెండు వికెట్లు తీశారు.

ఐదో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు 284 పరుగులకు ఆలౌట్ అయింది. బెయిర్ స్టో (Jonny Bairstow) (106) సెంచరీతో ఇంగ్లండ్ ఫాలో ఆన్ ను తప్పించుకుంది. టీమిండియాకు 132 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో సిరాజ్4, బుమ్రా 3, షమీ 2 వికెట్లు తీయగా.. శార్దూల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. బెయిర్ స్టోతో పాటు బిల్లింగ్స్ (36), జో రూట్ (31), బెన్ స్టోక్స్ (25) పరుగులు ఫర్వాలేదన్పించారు.ఇక, మూడో రోజు ఆటలో ఇంగ్లండ్‌కు బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ శుభారంభం అందించారు. స్టోక్స్ ఇచ్చిన సునాయస క్యాచ్‌లను భారత ఆటగాళ్లు నేలపాలు చేశారు. అయినా అతను ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదు.



శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత సామ్ బిల్లింగ్స్ క్రీజులోకి రాగా.. బెయిర్ స్టో ధాటిగా ఆడాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన బెయిర్ స్టో.. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఫోర్ బాది 119 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.మొదటి 64 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేసిన బెయిర్‌స్టో, ఆ తర్వాత 54 బంతుల్లో 84 పరుగులు చేయడం విశేషం. ఈ ఏడాదిలో జానీ బెయిర్‌స్టోకి ఇది ఐదో సెంచరీ కాగా.. వరుసగా మూడోది. ఇక సూపర్ డెలివరీతో బెయిర్ స్టోను షమీ ఔట్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.క్రీజులో సెట్ అయిన సామ్ బిల్లింగ్స్‌ను సిరాజ్ ఔట్ చేయగా.. ఆ తర్వాత వచ్చిన స్టువర్ట్ బ్రాడ్(1), మాథ్యూ పోట్స్‌లను కూడా అతనే పెవిలియన్ చేర్చాడు. అంతకు ముందు రిషబ్ పంత్, రవీంద్ర జడేజాల సూపర్ సెంచరీలతో టీమిండియా 416 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. జేమ్స్ అండర్సన్ ఐదు వికెట్లు పడగొట్టాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: India vs england, Jasprit Bumrah, Mohammed Shami, Mohammed Siraj, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Shreyas Iyer, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు