IND VS ENG 5TH TEST LIVE SCORES RISHABH PANT RAVINDRA JADEJA PARTNERSHIP HELPS INDIA TO SCORE 338 RUNS IN FIRST DAY SJN
IND vs ENG 5th Test : ఇంగ్లండ్ బౌలర్లను రఫ్పాడించిన రిషభ్ పంత్.. తొలి రోజు భారత్ ఎంత స్కోరు చేసిందంటే?
PC : BCCI
IND vs ENG 5th Test : శుబ్ మన్ గిల్ (17), చతేశ్వర్ పుజారా (13), హనుమ విహారి (20), ఎన్నో ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ (11), శ్రేయస్ అయ్యర్ (15) ఇలా భారత స్టార్ ప్లేయర్లంతా కూడా వచ్చిన వాళ్లు వచ్చినట్లు పెవిలియన్ కు చేరారు. దాంతో ఇంగ్లండ్ (Engalnd)తో ఆరంభమైన ఐదో టెస్టులో భారత్ 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
IND vs ENG 5th Test : శుబ్ మన్ గిల్ (17), చతేశ్వర్ పుజారా (13), హనుమ విహారి (20), ఎన్నో ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ (11), శ్రేయస్ అయ్యర్ (15) ఇలా భారత స్టార్ ప్లేయర్లంతా కూడా వచ్చిన వాళ్లు వచ్చినట్లు పెవిలియన్ కు చేరారు. దాంతో ఇంగ్లండ్ (Engalnd)తో ఆరంభమైన ఐదో టెస్టులో భారత్ 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో భారత్ (India) 150 పరుగుల మార్కును అయినా దాటుతుందా అనే సందేహం సగటు భారత అభిమానిలో తప్పక కలిగే ఉంటుంది. అయితే ఇక్కడే అద్భుతం జరిగింది. గత కొన్ని నెలలుగా పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న రిషభ్ పంత్ (Rishabh Pant) సూపర్ సెంచరీతో చెలరేగిపోయాడు. జేమ్స్ అండర్సన్, మ్యాథ్యూ పాట్స్ పదునైన బంతులతో భారత బ్యాటర్లను బెంబేలెత్తించిన.. వేళ క్రీజులోకి వచ్చిన పంత్.. అద్భుత ఇన్నింగ్స్ తో భారత్ ను ఆదుకున్నాడు.
వన్డే తరహాలో చెలరేగిన పంత్ కేవలం 111 బంతుల్లోనే 146 పరుగులు చేశాడు. ఇందులో 19 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండటం విశేషం. పంత్ కు రవీంద్ర జడేజా (83 బ్యాటింగ్; 10 ఫోర్లు) కూడా సాయపడటంతో భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 73 ఓవర్లలో 7 వికెట్లకు 338 పరుగులు చేసింది. వర్షం వల్ల తొలి రోజు 13 ఓవర్లు తక్కువగా వేయాల్సి వచ్చింది. పంత్, జడేజా ఆరో వికెట్ కు ఏకంగా 222 పరుగులు జోడించారు. భారీ షాట్ కు ప్రయత్నించిన పంత్ జో రూట్ బౌలింగ్ లో స్లిప్ లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు.
ఇంగ్లండ్ ను వణికించిన పంత్
కష్ట సమయంలో క్రీజులో ఉన్న పంత్ ఎదురుదాడికి దిగాడు. వన్డే ఆటతీరుతో చెలరేగిన అతడు ధనాధన్ షాట్లతో గ్రౌండ్ నలువైపులా బౌండరీలు బాదాడు. బౌలర్ ఎవరైనా సరే.. బంతి పడగానే పిచ్ పై ముందుకు వస్తూ బాల్ ను బౌండరీకి తరలించాడు. పంత్ దెబ్బకు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్ట్స్ తో పాటు ఇతర బౌలర్లకు కూడా ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆకాశమే హద్దుగా చేలరేగిన అతడు భారత్ కు గౌరవప్రదమైన స్కోరును అందించడంలో కీలక పాత్ర పోషించాడు. మరో ఎండ్ లో ఉన్న రవీంద్ర జడేజా కూడా చక్కటి ఆటతీరును ప్రదర్శించాడు. పంత్ దూకుడుగా ఆడుతుంటే జడేజా మాత్రం వికెట్ కే ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో పెద్దగా రాణించని జడేజా.. ఈ మ్యాచ్ లో మాత్రం మంచి బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. పంత్ తో జట్టును ఆదుకున్నాడు. చివర్లో పంత్.. శార్దుల్ ఠాకూర్ (1) వెంట వెంటనే అవుటైనా.. మొహమ్మద్ షమీ (0)తో కలిసి జడేజా మరో వికెట్ పడకుండా రోజును ముగించాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.