IND VS ENG 5TH TEST LIVE SCORES RAIN INTERRUPTED INDIA VS ENGLAND 5TH TEST MATCH SJN
IND vs ENG : వర్షంతో నిలిచిపోయిన మ్యాచ్.. తొలి సెషన్ లో విఫలమైన టీమిండియా ఓపెనర్లు
PC : TWITTER
IND vs ENG : రీషెడ్యూల్ టెస్టుకు వరుణుడు అడ్డుగా నిలిచాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా (Team India)కు ఓపెనర్లు శుభారంభం చేయలేకపోయారు. రోహిత్ శర్మ (Rohit Sharma) కరోనా కారణంగా ఈ మ్యాచ్ కు దూరం కావడంతో అతడి స్థానంలో చతేశ్వర్ పుజారా (cheteshwar pujara) శుబ్ మన్ గిల్ (Shubman Gill)తో కలిసి ఓపెనర్ గా వచ్చాడు.
IND vs ENG : రీషెడ్యూల్ టెస్టుకు వరుణుడు అడ్డుగా నిలిచాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా (Team India)కు ఓపెనర్లు శుభారంభం చేయలేకపోయారు. రోహిత్ శర్మ (Rohit Sharma) కరోనా కారణంగా ఈ మ్యాచ్ కు దూరం కావడంతో అతడి స్థానంలో చతేశ్వర్ పుజారా (cheteshwar pujara) శుబ్ మన్ గిల్ (Shubman Gill)తో కలిసి ఓపెనర్ గా వచ్చాడు. అయితే పిచ్ పై ఉన్న పచ్చికను సమర్థవంతంగా ఉపయోగించుకున్న ఇంగ్లండ్ బౌలర జేమ్స్ అండర్సన్ భారత ప్లేయర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. మొదట్లో గిల్ కొన్ని చూడచక్కటి షాట్లు ఆడాడు. నాలుగు బౌండరీలు బాది టచ్ లో ఉన్నట్లు కనిపించాడు. అయితే అండర్సన్ అద్భుత బంతికి స్లిప్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక కౌంటీల్లో అద్భుతంగా రాణించిన పుజారా.. భారత్ తరఫున మాత్రం అదే ఫామ్ ను కొనసాగించలేకపోయాడు.
రెండు ఫోర్లు బాదిన అతడు.. అండర్సన్, బ్రాడ్ పేస్ ద్వయాన్ని ఎదర్కోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అయితే అండర్సన్ బంతికే పుజారా కూడా పెవిలియన్ కు చేరాడు. దాంతో భారత్ రెండు వికెట్లను నష్టపోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హనుమ విహారి (14 బ్యాటింగ్), విరాట్ కోహ్లీ (1 బ్యాటింగ్) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయింది. వానతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ 20.1 ఓవర్లలో 2 వికెట్లకు 53 పరుగులు మాత్రమే చేయగలిగింది.
దాంతో ఆటగాళ్లు అరగంట ముందుగానే లంచ్ కు వెళ్లారు. వర్షం తగ్గినా కూడా మైదానం అంతా చిత్తడిగా మారడంతో మ్యాచ్ ను మళ్లీ మొదలు కాలేదు. ఈ రోజు ఆటలో దాదాపు 69.5 ఓవర్ల ఆట ఇంకా మిగిలే ఉంది.
డ్రా చేసుకుంటే చాలు
ఇంగ్లండ్ పై టెస్టు సిరీస్ నెగ్గేందుకు భారత్ కు ఇది సువర్ణావకాశం. ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ ను డ్రా చేసుకుంటే చాలు భారత్ చేతికి సిరీస్ దక్కుతుంది.
బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలీ, జో రూట్, అలెక్స్ లీస్, పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, స్యామ్ బిల్లింగ్స్, మ్యాథ్యూ పాట్స్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, జేమ్స్ అండర్సన్
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.