IND VS ENG 5TH TEST LIVE SCORES MOHAMMED SIRAJ DISMISS JOE ROOT WITH UNPLAYABLE DELIVERY SJN
IND vs ENG : సిరాజ్ దెబ్బకు రూట్ ఫ్యూజులు ఎగిరిపోయాయిగా.. పాపం ఎలా ఆడాలో తెలియక చివరకు..
PC : TWITTER
IND vs ENG : ఇంగ్లండ్ (England)తో జరుగుతోన్న చివరిదైన ఐదో టెస్టుకు వర్షం అడ్డు తగులుతూనే ఉంది. రెండో రోజు ఆట అయితే వర్షం వల్ల కేవలం 38.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అయినా కూడా భారత్ (India) రెండో రోజు సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
IND vs ENG : ఇంగ్లండ్ (England)తో జరుగుతోన్న చివరిదైన ఐదో టెస్టుకు వర్షం అడ్డు తగులుతూనే ఉంది. రెండో రోజు ఆట అయితే వర్షం వల్ల కేవలం 38.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అయినా కూడా భారత్ (India) రెండో రోజు సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇక ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా తాత్కాలిక సారథి జస్ ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) మూడు వికెట్లతో చెలరేగితే.. హైదరాబాద్ కుర్రాడు మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీలు చెరో వికెట్ తో చెలరేగిపోయారు. ఇక సిరాజ్ కీలకమైన జో రూట్ (31) వికెట్ ను తీశాడు. దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లకు 84 పరుగులు మాత్రమే చేసింది.
సూపర్ ఫామ్ లో ఉన్న జో రూట్ వికెట్ ను అద్బుత బంతితో సిరాజ్ సాధించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో ఇన్నింగ్స్ 23వ ఓవర్ ను వేయడానికి సిరాజ్ వచ్చాడు. ఆ ఓవర్ ఆఖరి బంతిని ఆడలేని విధంగా వేసి రూట్ ను పెవిలియన్ కు చేర్చాడు. సిరాజ్ షార్ట్ పిచ్ బాల్ ను వేయగా.. రూట్ అది బౌన్సర్ అనుకున్నాడు. అయితే బంతి సరిగ్గా అతడి బ్యాట్ కింది నుంచి వేగంగా వెళ్లిపోయింది. ఆ సమయంలో బంతి రూట్ బ్యాట్ కు బాటమ్ ఎడ్జ్ ను తీసుకుంటూ కీపర్ పంత్ చేతుల్లోకి వెళ్లిపోయింది.
Inspired bowling change results in a massive wicket for #TeamIndia ????@mdsirajofficial makes an instant impact as he sends @root66 packing!
అంతకుముందు ఓవర్ నైట స్కోరు 7 వికెట్లకు 338 పరుగులతో భారత్ శనివారం ఆటను కొనసాగించింది. ఓవర్ నైట్ స్కోరుకు మరో 78 పరుగులు జోడించిన భారత్ మిగిలిన మూడు వికెట్లను కోల్పోయింది. భారత్ 84.5 ఓవర్లలో 416 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా (104) రాణించాడు. 10వ నంబర్ లో బ్యాటింగ్ కు వచ్చిన తాత్కాలిక కెప్టెన్ జస్ ప్రీత్ బుమ్రా (16 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టి20 తరహాలో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో బ్రాడ్ వేసిన 84వ ఓవర్ లో ఏకంగా 35 పరుగులు సాధించాడు. ఇందులో బుమ్రా బ్యాట్ నుంచి 29 పరుగులు రావడం విశేషం. ప్రస్తుతం క్రీజులో జానీ బెయిర్ స్టో (12 బ్యాటింగ్), కెప్టెన్ బెన్ స్టోక్స్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ మరో 332 పరుగులు వెనుకబడి ఉంది. బుమ్రా 3 వికెట్లు తీయగా.. షమీ, సిరాజ్ తలా ఒక్కో వికెట్ తీశారు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.