IND VS ENG 5TH TEST LIVE SCORES I ONLY FOCUS ON HIS BATTING THATS WHERE I EXCEL THE 1S AND 2S YOU SEE ITS ALL ME SANJANA GANESAN ON BUMRAH BATTING VIDEO GOES VIRAL SJN
IND vs ENG : ’మా ఆయనకు బ్యాటింగ్ నేర్పింది నేనే.. అందుకే అలా కుమ్మేశాడు‘.. మురిసిపోయిన స్టార్ బౌలర్ భార్య
PC : BCCI
IND vs ENG : ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇంగ్లండ్ (England)తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు పటిష్ట స్థితికి చేరుకుంది. తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులు చేసిన టీమిండియా (Team India) రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ సగం వికెట్లను కూల్చేసింది.
IND vs ENG : ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇంగ్లండ్ (England)తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు పటిష్ట స్థితికి చేరుకుంది. తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులు చేసిన టీమిండియా (Team India) రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ సగం వికెట్లను కూల్చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 5 వికెట్లకు 84 పరుగులు మాత్రమే చేసింది. మరో మూడు రోజుల ఆట మిగిలే ఉండటంతో ఈ మ్యాచ్ లో భారత్ ఓడే అవకాశాలు దాదాపుగా లేనట్లే. అయితే రెండో రోజు ఆటలో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) సెంచరీతో పాటు కెప్టెన్ జస్ ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) మెరుపులు మెరిపించడం హైలైట్ గా నిలిచింది. స్టువర్ట్ బ్రాడ్ వేసిన 84వ ఓవర్ లో బుమ్రా దంచి కొట్టాడు. ఆ ఓవర్ లో బ్రాడ్ ఏకంగా 35 పరుగులు సమర్పించుకున్నాడు. దీంట్లో బుమ్రా తన బ్యాట్ నుంచి 29 పరుగులు సాధించి ప్రపంచ రికార్డును కూడా సాధించాడు.
ఈ క్రమంలో బుమ్రాకు సంబంధించిన ప్రపంచ రికార్డుపై ఐసీసీ ఒక పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ లో బుమ్రా భార్య సంజన గణేశన్ ఆసక్తికర వ్యాఖ్య చేసింది. బుమ్రా అలా బ్యాటింగ్ చేయడానికి కారణం తానే అంటూ సంజన గణేశన్ క్రెడిట్ ను తీసుకుంది. ’నేను బుమ్రా బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టా. అందులో నేను సక్సెస్ సాధించా. బుమ్రా కొట్టిన పరుగులన్నీ కూడా నావే‘ అంటూ సంజన భర్త ఘనత గురించి వివరిస్తూ మురిసిపోయింది.
బ్యాటింగ్ లో అదరగొట్టిన తర్వాత బౌలింగ్ లోనూ బుమ్రా చెలరేగిపోయాడు. అలెక్స్ లీ (6), జాక్ క్రాలీ (9), ఒలీ పోప్ (10) వికెట్లను తీసి భారత్ కు శుభారంభం చేశాడు. అనంతరం వర్షం ఆటకు పలుమార్పు అడ్డు తగిలింది. టీ తర్వాత మ్యాచ్ ఆరంభం కాగా మొహమ్మద్ సిరాజ్ భారత్ కు బిగ్ బ్రేక్ ను అందించాడు. ఫామ్ లో ఉన్న రూట్ (31) సిరాజ్ బౌలింగ్ లో కీపర్ పంత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాసేపటికే నైట్ వాచ్ మన్ జాక్ లీచ్ (0) డకౌట్ అయ్యాడు.. అనంతరం ఇంగ్లండ్ మరో వికెట్ పడకుండా రోజును ముగించింది. ప్రస్తుతం క్రీజులో జానీ బెయిర్ స్టో (12 బ్యాటింగ్), కెప్టెన్ బెన్ స్టోక్స్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ మరో 332 పరుగులు వెనుకబడి ఉంది. బుమ్రా 3 వికెట్లు తీయగా.. షమీ, సిరాజ్ తలా ఒక్కో వికెట్ తీశారు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.