Home /News /sports /

IND VS ENG 5TH TEST LIVE SCORES FANS SLAMS VIRENDER SEHWAG AFTER HIS DISGUSTING COMMENTS OVER VIRAT KOHLI SJN

IND vs ENG : మొన్న రోహిత్ ను వడ పావ్ అన్నావ్.. ఇప్పుడేమో ఏకంగా కోహ్లీని అంత మాట అంటావా?

Virat Kohli

Virat Kohli

IND vs ENG : భారత్ (India), ఇంగ్లండ్ (England) మధ్య ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల ఆట ముగిసే సమయానికి భారత్ 257 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. అయితే భారత ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)పై మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.

ఇంకా చదవండి ...
IND vs ENG : భారత్ (India), ఇంగ్లండ్ (England) మధ్య ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల ఆట ముగిసే సమయానికి భారత్ 257 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. అయితే భారత ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)పై మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న ఈ టెస్టు మ్యాచ్ హిందీ కామెంట్రీ సభ్యుడిగా వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నాడు. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ఆడే సమయంలో సెహ్వాగ్ కోహ్లీపై నోరు జారాడు. మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో స్టువర్ట్ బ్రాడ్ (1) రిషభ్ పంత్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. మైదానంలో దూకుడుగా కనిపించే కోహ్లీ.. బ్రాడ్ వికెట్ ను డ్యాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు.

ఇది కూడా చదవండి : లేపి మరీ తన్నించుకోవడం అంటే ఇదే కోహ్లీ.. అతడితో గొడవ నీకు అవసరమా?

ఇక హిందీ కామెంటరీ బాక్స్ ఉన్న సెహ్వాగ్.. ’చమియా నాచ్ రహీ హై‘ అంటూ కోహ్లీని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశాడు. చమియా అంటే అందమైన అమ్మాయి డ్యాన్స్ చేయడం అని అర్థం. సెహ్వాగ్ ఆ కామెంట్ చేయడంతో కోహ్లీ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. సెహ్వాగ్ ను వెంటనే కామెంటరీ ప్యానెల్ నుంచి తొలగించాల్సిందిగా సోనీ నెట్ వర్క్ కు సూచిస్తున్నారు. సెహ్వాగ్ నోరు జారడం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో రోహిత్ శర్మను వడ పావ్ అంటూ సంబోధించి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఆ తర్వాత అతడి అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు చేయడంతో సారీ కూడా చెప్పాడు.









ఇక ఈ మ్యాచ్ లో భారత్ స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులకు ఆలౌటైన భారత్.. ఇంగ్లండ్ ను 258 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించి మూడో రోజు ఆట ముగిసే సమయానికి 45 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఫలితంగా 257 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. ఇక విరాట్ కోహ్లీ (20) మరోసారి విఫలం అయ్యాడు. అతడితో పాటు శుబ్ మన్ గిల్ (4), హనుమ విహారి (11) కూడా నిరాశ పరిచారు. ప్రస్తుతం చతేశ్వర్ పుజారా (50 బ్యాటింగ్; 5 ఫోర్లు), రిషభ్ పంత్ (30 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నారు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Cheteswar Pujara, India vs england, Jasprit Bumrah, Mohammed Shami, Mohammed Siraj, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli, Virender Sehwag

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు