హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs ENG : టాస్ గెలిచిన ఇంగ్లండ్.. తెలుగు కుర్రాడికి నో ఛాన్స్.. ఓపెనర్ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న టీమిండియా.. తుది జట్లు ఇవే

IND vs ENG : టాస్ గెలిచిన ఇంగ్లండ్.. తెలుగు కుర్రాడికి నో ఛాన్స్.. ఓపెనర్ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న టీమిండియా.. తుది జట్లు ఇవే

PC : BCCI

PC : BCCI

IND vs ENG : గతేడాది కరోనా కారణంగా నిలిచిపోయిన చివరిదైన ఐదో టెస్టు మరికాసేపట్లో ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఇంగ్లండ్ (England) కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రెండు రోజులుగా ఎడ్జ్ బాస్టన్ లో వర్షం పడటంతో పిచ్ ను కప్పి ఉంచారు. దాంతో తొలి రోజు పిచ్ బౌలర్లకు సహకరించే అవకాశం ఉంది.

ఇంకా చదవండి ...

IND vs ENG : గతేడాది కరోనా కారణంగా నిలిచిపోయిన చివరిదైన ఐదో టెస్టు మరికాసేపట్లో ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఇంగ్లండ్ (England) కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రెండు రోజులుగా ఎడ్జ్ బాస్టన్ లో వర్షం పడటంతో పిచ్ ను కప్పి ఉంచారు. దాంతో తొలి రోజు పిచ్ బౌలర్లకు సహకరించే అవకాశం ఉంది. దాంతో టాస్ నెగ్గిన బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కరోనా కారణంగా ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్, భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఈ  మ్యాచ్ కు దూరమయ్యాడు. దాంతో జస్ ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) తాత్కాలిక కెప్టెన్ గా ఈ మ్యాచ్ లో వ్యవహరించనున్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్ లో అదరగొట్టిన శ్రీకర్ భరత్ (KS Bharath)ను తుది జట్టులోకి తీసుకోలేదు. దాంతో చతేశ్వర్ పుజారా శుబ్ మన్ గిల్ తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది.

డ్రాగా ముగించినా చాలు

ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భారత్ ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో నిలిచింది. దాంతో ఈ మ్యాచ్ ను భారత్ డ్రాగా ముగించినా చాలు ఇంగ్లండ్ లో చరిత్రకెక్కే అవకాశం ఉంటుంది. అయితే రోహిత్ శర్మ ఈ మ్యాచ్ కు దూరం కావడం భారత్ ను ఇబ్బంది పెట్టే అంశం. ఇక కెప్టెన్ గా బుమ్రా ఎంత వరకు రాణిస్తాడనేది చూడాలి. ఎందుకంటే రోహిత్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హార్దిక్ పాండ్యా మినహా తాత్కాలికంగా కెప్టెన్లుగా బాధ్యతలు చేపట్టిన వారు పెద్దగా సక్సెస్ కాలేదు. సౌతాఫ్రికా టూర్ లో కేఎల్ రాహుల్ దారణ వైఫల్యం.. మళ్లీ భారత్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్ లో పంత్ కెప్టెన్ గా రాణించలేకపోయాడు. ఐర్లాండ్ తో జరిగిన సిరీస్ ల ో మాత్రం హార్దిక్ పాండ్యా రాణించాడు. దాంతో బుమ్రా ఈ టెస్టు మ్యాచ్ లో నాయకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటాడో లేదో చూడాలి. మరోవైపు న్యూజిలాండ్ పై క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్ ఫుల్ జోష్ లో ఉంది.


తుది జట్లు:

భారత్ 

జస్‌ప్రీత్ బుమ్రా (కెప్టెన్),  శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్,రిషభ్ పంత్(కీపర్), రవీంద్ర జడేజా, హనుమ విహారి, సిరాజ్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ

ఇంగ్లండ్

బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలీ, జో రూట్, అలెక్స్ లీస్, పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, స్యామ్ బిల్లింగ్స్, మ్యాథ్యూ పాట్స్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, జేమ్స్ అండర్సన్

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Cheteswar Pujara, India vs england, Jasprit Bumrah, Mohammed Shami, Mohammed Siraj, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు