Home /News /sports /

IND VS ENG 5TH TEST LIVE SCORES ENGLAND BEAT TEAM INDIA BY 7 WICKETS IN 5TH TEST SJN

IND vs ENG : రూట్, బెయిర్ స్టో ధనాధన్.. ఐదో టెస్టులో ఇంగ్లండ్ సూపర్ విక్టరీ

PC : TWITTER

PC : TWITTER

IND vs ENG : భారత్ (India)తో జరిగిన ఐదో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ (England) జట్టు ఘనవిజయం సాధించింది. మంగళవారం ముగిసిన ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు 7 వికెట్ల తేడాతో టీమిండియా (Team India)పై విజయఢంకా మోగించింది. ఫలితంగా ఐదు మ్యాచ్ ల సిరీస్ ను 2-2తొ డ్రా అయ్యింది.

ఇంకా చదవండి ...
IND vs ENG : భారత్ (India)తో జరిగిన ఐదో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ (England) జట్టు ఘనవిజయం సాధించింది. మంగళవారం ముగిసిన ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు 7 వికెట్ల తేడాతో టీమిండియా (Team India)పై విజయఢంకా మోగించింది. ఫలితంగా ఐదు మ్యాచ్ ల సిరీస్ ను 2-2తొ డ్రా అయ్యింది. 378 పరగుల లక్ష్యంతో.. ఓవర్ నైట్ స్కోరు 3 వికెట్లకు 259 పరుగులతో చివరి రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్.. 76.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 378 పరుగులు చేసి గెలుపొందింది. ఓవర్ నైట్ బ్యాటర్స్ జో రూట్ (142 నాటౌట్; 19 ఫోర్లు, 1 సిక్స్), జానీ బెయిర్ స్టో (114 నాటౌట్; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ అజేయమైన నాలుగో వికెట్ కు 269 పరుగులు జోడించి ఇంగ్లండ్ కు గ్రాండ్ విక్టరీని అందించారు.

ఇది కూడా చదవండి : బ్యాటింగ్ లేదు.. బౌలింగ్ లేదు.. అయినా టీమిండియాలో చోటు.. ఇలా అయితే ఎలాగబ్బా?

మూడో రోజు ఆటలో అలెక్స్ లీస్ (56), జాక్ క్రాలీ (46) రాణించారు. ఒలీ పోప్ (0) మాత్రం విఫలం అయ్యాడు. భారత తాత్కాలిక కెప్టెన్ జస్ ప్రీత్ బుమ్రా 2 వికెట్లు తీశాడు. ఐదో రోజు వన్డే తరహా బ్యాటింగ్ చేసిన రూట్, బెయిర్ స్టో తొలి సెషన్ లోనే జట్టు విజయానికి అవసరం అయిన 119 పరుగులను జోడించారు. ఏదైనా అద్బుతం జరుగుతుందేమో అని ఎదురు చూసిన భారత అభిమానులకు నిరాశే మిగిలింది.



అంతకుముందు భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో  81.5 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ను కలుపుకోవడంతో ఇంగ్లండ్ ముందు భారత్ 378 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.  ఓవర్ నైట్ బ్యాటర్స్ చతేశ్వర్ పుజారా (66; 8 ఫోర్లు), రిషభ్ పంత్ (57; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు.  శ్రేయస్ అయ్యర్ (19), శార్దుల్ ఠాకూర్ (4) విఫలం అయ్యారు. ప్రస్తుతం రవీంద్ర జడేజా (23 బ్యాటింగ్; 1 ఫోర్), మొహమ్మద్ షమీ (13 ; 2 ఫోర్లు) ఎక్కువ సేపు క్రీజులో నిలబడ లేకపోయారు. శుబ్ మన్ గిల్ (4), హనుమ విహారి(11), కోహ్లీ (20) మరోసారి నిరాశపర్చారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 4 వికెట్లు తీశాడు. మ్యాథ్యూ పాట్స్, స్టువర్ట్ బ్రాడ్ చెరో రెండు వికెట్లు తీశారు.



ఇక తొలి ఇన్నింగ్స్ లో రిషభ్ పంత్ (146), రవీంద్ర జడేజా (104) శతకాలతో రాణించడంతో భారత్ 416 పరుగులకు ఆలౌటైంది. అందుకు బదులుగా బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 284 పరుగులు మాత్రమే చేయగలిగింది. జానీ బెయిర్ స్టో (106) శతకం బాదాడు. స్యామ్ బిల్లింగ్స్ (36), జో రూట్ (31)లు ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లు తీశాడు. బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. మొహమ్మద్ షమీ రెండు వికెట్లు తీశాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: India vs england, Jasprit Bumrah, Mohammed Shami, Mohammed Siraj, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు