IND VS ENG 5TH TEST LIVE SCORES ENGLAND BATTER JONNY BAIRSTOW FIGHTING INNINGS HELPS ENGLAND TO REACH 200 BEFORE LUNCH SJN
IND vs ENG : దంచి కొడుతున్న బెయిర్ స్టో.. లంచ్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు ఎంతంటే?
PC : ECB
IND vs ENG : మెల్లగా ఆడితే వికెట్లు పడతాయి అని అనుకున్నాడో ఏమో కానీ.. మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ (England) ప్లేయర్ జానీ బెయిర్ స్టో (jonny bairstow) రెచ్చిపోతున్నాడు. మూడో రోజు ఆరంభం నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు.
IND vs ENG : మెల్లగా ఆడితే వికెట్లు పడతాయి అని అనుకున్నాడో ఏమో కానీ.. మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ (England) ప్లేయర్ జానీ బెయిర్ స్టో (jonny bairstow) రెచ్చిపోతున్నాడు. మూడో రోజు ఆరంభం నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. బెయిర్ స్టో వన్డే తరహా ఆటను మొదలు పెట్టడంతో ఇంగ్లండ్ స్కోరు బోర్డు వేగంగా ముందుకు కదులుతోంది. ఓవర్ నైట్ స్కోరు 5 వికెట్లకు 84 పరుగులతో ఆదివారం ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ లంచ్ విరామానికి 45.3 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు చేసింది. 28.3 ఓవర్ల తొలి సెషన్ లో 116 పరుగులు జోడించింది. బెయిర్ స్టో (113 బంతుల్లో 91 బ్యాటింగ్; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజులో ఉన్నాడు. అతడితో పాటు స్యామ్ బిల్లింగ్స్ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
దూకుడుగా మూడో రోజు ఆటను ఇంగ్లండ్ ఆరంభించింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ (25) ఇచ్చిన సులభమైన క్యాచ్ ను శార్దుల్ ఠాకూర్ మిస్ చేశాడు. అనంతరం బెన్ స్టోక్స్ ఒకటి రెండు ఫోర్లు బాాదాడు. కానీ, శార్దుల్ బౌలింగ్ లో బుమ్రా పట్టిన సూపర్ క్యాచ్ కు పెవిలియన్ కు చేరుకున్నాడు. ఇక ఇక్కడి నుంచి బెయిర్ స్టో విధ్వంసం మొదలైంది. అప్పటి వరకు టెస్టు ఆట ఆడుతున్న అతడు.. ఒక్కసారిగా గేర్లు మార్చి బ్యాటింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో అతడు కొన్ని చూడచక్కటి బౌండరీలను బాదాడు. ఈ క్రమంలో సెంచరీకి చేరువైన క్రమంలో వర్షం అంతరాయం కలిగించింది. దాంతో అరగంట ముందుగానే అంపైర్లు లంచ్ విరామాన్ని ప్రకటించారు.
ఇంగ్లండ్ బ్యాటింగ్ కు దిగగా బుమ్రా రెచ్చిపోయాడు. అలెక్స్ లీ (6), జాక్ క్రాలీ (9), ఒలీ పోప్ (10) వికెట్లను తీసి భారత్ కు శుభారంభం చేశాడు. అనంతరం వర్షం ఆటకు పలుమార్పు అడ్డు తగిలింది. టీ తర్వాత మ్యాచ్ ఆరంభం కాగా మొహమ్మద్ సిరాజ్ భారత్ కు బిగ్ బ్రేక్ ను అందించాడు. ఫామ్ లో ఉన్న రూట్ (31) సిరాజ్ బౌలింగ్ లో కీపర్ పంత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాసేపటికే నైట్ వాచ్ మన్ జాక్ లీచ్ (0) డకౌట్ అయ్యాడు.. అనంతరం ఇంగ్లండ్ మరో వికెట్ పడకుండా రోజును ముగించింది. ప్రస్తుతం క్రీజులో జానీ బెయిర్ స్టో (12 బ్యాటింగ్), కెప్టెన్ బెన్ స్టోక్స్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ మరో 332 పరుగులు వెనుకబడి ఉంది. బుమ్రా 3 వికెట్లు తీయగా.. షమీ, సిరాజ్ తలా ఒక్కో వికెట్ తీశారు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.