IND VS ENG 5TH TEST LIVE SCORE UPDATES ENGLAND ALL OUT FOR 284 RUNS AND TEAM INDIA GETS FIRST INNINGS LEAD SRD
IND vs ENG 5th Test : భారత బౌలర్ల జోరు.. ఇంగ్లండ్ బేజారు.. టీమిండియాకు భారీ ఆధిక్యం..
IND vs ENG 5th Test (PC : BCCI)
IND vs ENG 5th Test : ఇంగ్లండ్ తో జరుగుతున్న కీలకమైన ఐదో టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. ముందు బ్యాటర్లు అదరగొడితే.. ఆ తర్వాత బౌలర్లు దుమ్మురేపారు. ఫలితం.. ఫస్ట్ ఇన్నింగ్స్ లో టీమిండియాకు భారీ ఆధిక్యం లభించింది.
ఇంగ్లండ్ తో జరుగుతున్న కీలకమైన ఐదో టెస్టు (IND vs ENG 5th Test)లో బ్యాటర్లతో పాటు భారత బౌలర్లు కూడా దుమ్మురేపారు. భారత బౌలర్ల జోరుతో టీమిండియా (Team India)కు ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం లభించింది. ఐదో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు 284 పరుగులకు ఆలౌట్ అయింది. బెయిర్ స్టో (Jonny Bairstow) (106) సెంచరీతో ఇంగ్లండ్ ఫాలో ఆన్ ను తప్పించుకుంది. టీమిండియాకు 132 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో సిరాజ్4, బుమ్రా 3, షమీ 2 వికెట్లు తీయగా.. శార్దూల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. బెయిర్ స్టోతో పాటు బిల్లింగ్స్ (36), జో రూట్ (31), బెన్ స్టోక్స్ (25) పరుగులు ఫర్వాలేదన్పించారు. ఇక, రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. నాలుగు పరుగులు చేసిన గిల్ ను అండర్సన్ ఔట్ చేశాడు. దీంతో.. 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది భారత్.
ఇక, మూడో రోజు ఆరంభం నుంచే ఆకాశమే హద్దుగా చెలరేగాడు జానీ బెయిర్ స్టో. వన్డే తరహా ఆటను మొదలు పెట్టడంతో ఇంగ్లండ్ స్కోరు బోర్డు వేగంగా ముందుకు కదిలింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ (25) ఇచ్చిన సులభమైన క్యాచ్ ను శార్దుల్ ఠాకూర్ మిస్ చేశాడు. అనంతరం బెన్ స్టోక్స్ ఒకటి రెండు ఫోర్లు బాదాడు.
కానీ, శార్దుల్ బౌలింగ్ లో బుమ్రా పట్టిన సూపర్ క్యాచ్ కు పెవిలియన్ కు చేరుకున్నాడు. ఇక ఇక్కడి నుంచి బెయిర్ స్టో విధ్వంసం మొదలైంది. అప్పటి వరకు టెస్టు ఆట ఆడుతున్న అతడు.. ఒక్కసారిగా గేర్లు మార్చి బ్యాటింగ్ చేయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో అతడు కొన్ని చూడచక్కటి బౌండరీలను బాదాడు.
That's the end of England's first innings as they are bowled out for 284 runs.
ఈ క్రమంలో సెంచరీకి చేరువైన క్రమంలో వర్షం అంతరాయం కలిగించింది. దాంతో అరగంట ముందుగానే అంపైర్లు లంచ్ విరామాన్ని ప్రకటించారు. ఓవర్ నైట్ స్కోరు 5 వికెట్లకు 84 పరుగులతో ఆదివారం ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ లంచ్ విరామానికి 45.3 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు చేసింది.
వర్షం కాసేపు అంతరాయం ఆట ప్రారంభమైన తర్వాత బెయిర్ స్టో తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని కెరీర్ లో ఇది 11 వ సెంచరీ. అయితే.. బెయిర్ స్టో సెంచరీ తర్వాత షమీ బౌలింగ్ లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు బెయిర్ స్టో. ఆ తర్వాత కూడా వరుస విరామాల్లో భారత బౌలర్లు వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ 284 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకు ముందు రిషబ్ పంత్, రవీంద్ర జడేజాల సూపర్ సెంచరీలతో టీమిండియా 416 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. జేమ్స్ అండర్సన్ ఐదు వికెట్లు పడగొట్టాడు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.