IND VS ENG 5TH TEST DAY 3 STUMPS TEAM INDIA LEAD BY 257 RUNS AND PUJARA PANT PARTNERSHIP MAKES TEAM INDIA IN STRONG POSITION SRD
IND vs ENG 5th Test : పట్టు బిగిస్తోన్న టీమిండియా.. 3 వికెట్లు పడ్డ మూడో రోజు మనదే పై చేయి..
Pujara (PC : BCCI)
IND vs ENG 5th Test : ఇంగ్లండ్ తో జరుగుతున్న కీలకమైన ఐదో టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. భారీ టార్గెట్ సెట్ చేసే దిశగా టీమిండియా ఇన్నింగ్స్ సాగుతోంది.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రీషెడ్యూల్ ఐదో టెస్ట్ (IND vs ENG 5th Test)లో టీమిండియా (Team India) పట్టు సాధిస్తోంది. ఆతిథ్య ఇంగ్లండ్ కు భారీ టార్గెట్ సెట్ చేసే దిశగా టీమిండియా ఇన్నింగ్స్ సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యం కలిపి ప్రస్తుతం 257 పరుగుల ఆధిక్యంలో ఉంది టీమిండియా. ప్రస్తుతం క్రీజులో పుజారా (50 నాటౌట్ ), రిషబ్ పంత్ (30 నాటౌట్) ఉన్నారు. గిల్ (4), విహారీ(11), కోహ్లీ (20) మరోసారి నిరాశపర్చారు. జేమ్స్ అండర్సన్, బ్రాడ్, స్టోక్స్ తలా ఓ వికెట్ తీశారు. ఇదే జోరు రేపు కూడా టీమిండియా కొనసాగిస్తే.. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్ సెట్ చేసే అవకాశం ఉంది. 75 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా టీమిండియా ఇన్నింగ్స్ ను పుజారా, పంత్ ఆదుకున్నారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఈ క్రమంలో పుజారా తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఇక, అంతకుముందు..భారత బౌలర్ల జోరుతో టీమిండియా (Team India)కు ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం లభించింది. ఐదో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు 284 పరుగులకు ఆలౌట్ అయింది. బెయిర్ స్టో (Jonny Bairstow) (106) సెంచరీతో ఇంగ్లండ్ ఫాలో ఆన్ ను తప్పించుకుంది.
టీమిండియాకు 132 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో సిరాజ్4, బుమ్రా 3, షమీ 2 వికెట్లు తీయగా.. శార్దూల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. బెయిర్ స్టోతో పాటు బిల్లింగ్స్ (36), జో రూట్ (31), బెన్ స్టోక్స్ (25) పరుగులు ఫర్వాలేదన్పించారు.
ఇక, మూడో రోజు ఆటలో ఇంగ్లండ్‌కు బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ శుభారంభం అందించారు. స్టోక్స్ ఇచ్చిన సునాయస క్యాచ్‌లను భారత ఆటగాళ్లు నేలపాలు చేశారు. అయినా అతను ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదు.
శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత సామ్ బిల్లింగ్స్ క్రీజులోకి రాగా.. బెయిర్ స్టో ధాటిగా ఆడాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన బెయిర్ స్టో.. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఫోర్ బాది 119 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
మొదటి 64 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేసిన బెయిర్‌స్టో, ఆ తర్వాత 54 బంతుల్లో 84 పరుగులు చేయడం విశేషం. ఈ ఏడాదిలో జానీ బెయిర్‌స్టోకి ఇది ఐదో సెంచరీ కాగా.. వరుసగా మూడోది. ఇక సూపర్ డెలివరీతో బెయిర్ స్టోను షమీ ఔట్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.
క్రీజులో సెట్ అయిన సామ్ బిల్లింగ్స్‌ను సిరాజ్ ఔట్ చేయగా.. ఆ తర్వాత వచ్చిన స్టువర్ట్ బ్రాడ్(1), మాథ్యూ పోట్స్లను కూడా అతనే పెవిలియన్ చేర్చాడు. అంతకు ముందు రిషబ్ పంత్, రవీంద్ర జడేజాల సూపర్ సెంచరీలతో టీమిండియా 416 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. జేమ్స్ అండర్సన్ ఐదు వికెట్లు పడగొట్టాడు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.