హోమ్ /వార్తలు /క్రీడలు /

Ind Vs Eng : నాలుగో టెస్ట్ కు వర్షం ముప్పు తప్పదా..? మ్యాచ్ జరిగే ఓవల్ వెదర్ రిపోర్ట్ ఇదే..!

Ind Vs Eng : నాలుగో టెస్ట్ కు వర్షం ముప్పు తప్పదా..? మ్యాచ్ జరిగే ఓవల్ వెదర్ రిపోర్ట్ ఇదే..!

Ind Vs Eng

Ind Vs Eng

Ind Vs Eng : లార్డ్స్‌లో అద్భుతమైన విజయం సాధించిన కోహ్లీసేన.. మూడో టెస్టులో ఘోర పరాజయాన్ని చూసిన సంగతి తెలిసిందే. లీడ్స్‌ టెస్టులో గెలుపుతో ఇంగ్లండ్‌ (England) జట్టులో ఆత్మవిశ్వాసం పెరగ్గా.. గత మ్యాచ్‌ ఫలితాన్ని మరచి కొత్త ఆరంభంపై భారత్‌ దృష్టి పెట్టింది.

ఇంకా చదవండి ...

టీమిండియా (Team India) మరో రసవత్తర పోరుకు రెడీ అయింది. ఓవల్ వేదికంగా ఇంగ్లాండ్‌తో భారత్ (India Vs England) నాలుగో టెస్టు గురువారం నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమానంగా ఉంది. దీంతో ఇరు జట్లు నాలుగో టెస్టులో పైచేయి సాధించాలని ఆరాటపడుతున్నాయి. లార్డ్స్‌లో అద్భుతమైన విజయం సాధించిన కోహ్లీసేన.. మూడో టెస్టులో ఘోర పరాజయాన్ని చూసిన సంగతి తెలిసిందే. లీడ్స్‌ టెస్టులో గెలుపుతో ఇంగ్లండ్‌ (England) జట్టులో ఆత్మవిశ్వాసం పెరగ్గా.. గత మ్యాచ్‌ ఫలితాన్ని మరచి కొత్త ఆరంభంపై భారత్‌ దృష్టి పెట్టింది. ఇక ఓవల్ లోని ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ 2018లో చివరిగా జరిగిన మ్యాచ్‌లో నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. దీంతో ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లీడ్స్‌లో ఎదురైన దారుణ ఓటమి నుంచి తేరుకుని.. నాలుగో టెస్టులో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో భారత్ ఉంది. మిడిల్‌ ఆర్డర్‌ వైఫల్యంతో భారత్‌ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ రాణించడం.. మూడో మ్యాచ్ ద్వారా టెస్ట్ స్పెసలిస్ట్ చేతేశ్వర్ పుజారా ఫామ్ అందుకోవడం కాస్త సానుకూలాంశం.

కోహ్లీ (Virat Kohli News) నుంచి తన స్థాయి ఇన్నింగ్స్‌ను అభిమానులు ఆశిస్తున్నారు. పుజారా పుంజుకున్నప్పటికీ, అజింక్య రహానే ఫామ్ లేమి ఆందోళన కలిగిస్తుంది. ఆరో స్థానంలో రిషభ్ పంత్ అయోమయానికి లోనవుతున్నట్లు కనిపిస్తోంది. ఇక, జడేజా కూడా పెద్దగా రాణించింది లేదు. మొదటి మూడు టెస్టుల్లో రవీంద్ర జడేజా (Ravindra Jadeja)ను తీసుకున్నారు. అయితే ఈ ఎడం చేతివాటం బ్యాట్స్‌మన్ బ్యాటింగ్ ఆల్ రౌండర్‌గా జట్టులోకి వచ్చాడు.

ఫలితంగా సమకాలీన క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్నర్‌గా పరిగణించే రవిచంద్రన్ అశ్విన్‌ (Ravichandran Ashwin) కు కూడా జట్టులో చోటు దక్కలేదు. అడపాదడపా పరుగులు చేసే సామర్థ్యం ఉన్న అశ్విన్‌ కంటే.. ఆల్‌రౌండర్ అయిన జడేజా బెస్ట్ ఆప్షన్ అని టీం మేనేజ్‌మెంట్, కెప్లెన్ కోహ్లీ భావించారు. ట్రెంట్ బిడ్జ్, లార్డ్స్, హెడింగ్లీలో సీమర్లకు అనుకూలమైన వాతావరణం కారణంగా యాజమాన్యం నలుగురు పేసర్లతో ఆడటానికే టీమిండియా మొగ్గు చూపింది.

మొదటి టెస్టు ఆడిన శార్దుల్ బ్యాట్ తోనూ మెప్పించగలడు. శార్దుల్ వల్ల లోయర్, మిడిలార్డర్ బలంగా మారుతుంది. 8,9,10,11 స్థానాల్లో షమీ, ఇషాంత్, బుమ్రా, సిరాజ్ ఆడుతున్నారు. లార్డ్స్ రెండో ఇన్నింగ్స్ మినహా వీరి నుంచి అధికంగా పరుగులు ఆశించలేం. ఇలాంటి పరిస్థితుల్లో వెంట వెంటనే వికెట్లు పడే అవకాశం ఉంది. అందువల్ల మిడిల్ ఆర్డర్‌లో మంచి భాగస్వామ్యాల అవసరముంది.

సిరీస్‌లో ఆధిక్యం సాధించాలంటే ఒవల్‌లో గురువారం నుంచి ప్రారంభం కాబోయే నాలుగో టెస్టులో కచ్చితంగా గెలవాల్సిందే. అయితే ఓవల్‌ మైదానంలో 1971 తర్వాత ఇంగ్లండ్‌పై భారత్‌ మళ్లీ విజయం సాధించలేదు. ఆ తర్వాత ఐదు టెస్టులు డ్రా కాగా.. మూడింటిలో భారత్ ఓటమిపాలైంది. అయితే టెస్టుల్లో హర్భజన్‌ సింగ్‌ (417) ఫీట్‌కు రవిచంద్రన్‌ అశ్విన్‌ (413) ఇంకా నాలుగు వికెట్ల దూరంలో ఉన్నాడు. ఈ మ్యాచులో ఆ ఘనత యాష్ అందుకోనున్నాడు.

ఇది కూడా చదవండి :  వామ్మో.. సురేష్ రైనా ఏంటి.. WWE జాన్ సీనా లా మారిపోయాడు.. ఆ స్టంట్లు ఏంటి సామీ..!

వర్ష ప్రభావం :

నాలుగో టెస్ట్ మ్యాచ్ జరిగే కెన్సింగ్టన్‌ ఓవల్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు బాగా అనుకూలించే అవకాశముంది. మిగతా వేదికలతో పోలిస్తే పేస్‌కు కాకుండా స్పిన్‌కు సహకరించవచ్చు. మ్యాచ్ సాగేకొద్ది స్పిన్నర్లు పండగ చేసుకునే అవకాశం ఉంది. దీంతో ఇరు జట్లలోని స్పిన్నర్లు కీలక పాత్ర పోషించనున్నారు. అయితే గురువారం ఉదయం వాతావరణం బాగానే ఉన్నా.. ప్రస్తుతం ఓవల్‌ మైదానంలో మబ్బులు పట్టాయి. ఆకాశం మేఘావృతం అయి ఉంది. పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. మ్యాచ్ సమయానికల్లా వర్షం పడే అవకాశం ఉంది.

తుది జట్ల అంచనా:

టీమిండియా : కేఎల్ రాహుల్‌, రోహిత్‌ శర్మ, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్‌), అజింక్య రహానే, రిషబ్ పంత్‌, రవీంద్ర జడేజా/శార్దుల్‌ ఠాకూర్‌, ఆర్ అశ్విన్‌, మొహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్‌.

ఇంగ్లండ్‌:  రోరీ బర్న్స్‌, హసీద్ హమీద్‌, డేవిడ్ మలన్‌, జో రూట్‌ (కెప్టెన్‌), ఓలి పోప్‌, జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్‌, క్రెయిగ్ ఓవర్టన్‌, ఓలి రాబిన్సన్‌, మార్క్‌ వుడ్‌.

First published:

Tags: Cricket, India vs england, Rohit sharma, Sports, Virat kohli, Weather report

ఉత్తమ కథలు