IND VS ENG 3RD TEST VIRAT KOHLI HAS NEVER LOST THE 3RD MATCH OF TEST SERIES IN HIS ENTIRE CAREER AS CAPTAIN SRD
Ind Vs Eng : " విరాట్ కోహ్లీకి ఉన్న ఆ రికార్డే ఇక టీమిండియాకు శ్రీరామ రక్ష "
Virat Kohli
Ind Vs Eng : లీడ్స్ టెస్టులో భారత్ అనూహ్యంగా కుప్పకూలింది. దీంతో భారత్ దాదాపు రేసులో వెనకపడినట్టే. మరోవైపు లార్డ్స్‌లో ఆట కంటే ఎక్కువ తమ వ్యవహార శైలితోనే వార్తల్లో నిలిచిన ఇంగ్లండ్.. ఆ పరాజయాన్ని పక్కనపెట్టి సిరీస్ సమం చేయాలని కృతనిశ్చయంతో బరిలోకి దిగింది. అందుకు తగ్గట్టే టీమిండియాను తక్కువ పరుగులకు ఆలౌట్ చేసింది. మూడో టెస్టుపై రూట్ (Joe Root) సేన ఇప్పటికే పైచేయి సాధించింది.
ఇంగ్లాండ్ (England) పర్యటనలో తొలి మ్యాచ్‌లో వర్షం కారణంగా వెనుకబడి, లార్డ్స్‌లో విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచిన టీమిండియా (Team India).. అదే జోరులో ఆధిక్యాన్ని పెంచుకోవాలని చూసింది. కానీ లీడ్స్ టెస్టులో భారత్ అనూహ్యంగా కుప్పకూలింది. దీంతో భారత్ దాదాపు రేసులో వెనకపడినట్టే. మరోవైపు లార్డ్స్‌లో ఆట కంటే ఎక్కువ తమ వ్యవహార శైలితోనే వార్తల్లో నిలిచిన ఇంగ్లండ్.. ఆ పరాజయాన్ని పక్కనపెట్టి సిరీస్ సమం చేయాలని కృతనిశ్చయంతో బరిలోకి దిగింది. అందుకు తగ్గట్టే టీమిండియాను తక్కువ పరుగులకు ఆలౌట్ చేసింది. మూడో టెస్టుపై రూట్ (Joe Root) సేన ఇప్పటికే పైచేయి సాధించింది. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు భారత్ 40.4 ఓవర్లలో 78 పరుగులకు ఆలౌట్ అయింది. సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) చేసిన 19 పరుగులే అత్యధికం. అజింక్య రహానే 18 పరుగులు చేయగా.. ఒక్క భారత బ్యాట్స్‌మన్ కూడా డబుల్ డిజిట్ అందుకోలేకపోయారు. కేఎల్ రాహుల్ (0), చతేశ్వర్ పుజారా (1), విరాట్ కోహ్లీ (Virat Kohli) (7), రిషబ్ పంత్ (2), రవీంద్ర జడేజా (4) పరుగులు చేసి తీవ్రంగా నిరాశపర్చారు. తొలి సెషన్లో నాలుగు వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసిన భారత్.. రెండో సెషన్లో 22 పరుగులు చేసి కూప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ 3, క్రెయిగ్ ఓవర్టన్ 3, ఓలి రాబిన్సన్ 2, సామ్ కరన్ 2 వికెట్లు పడగొట్టారు.
ఇక, ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడింది. రెండోటెస్టు ఓటమి కసి.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను అత్యల్ప స్కోర్‌కు అవుట్ చేసిన ఉత్సాహంతో అసలు ఏ మాత్రం తప్పులు చేయకుండా ఓపెనర్లు ధాటిగా ఆడారు. గత మ్యాచ్‌లో డకౌట్ అయిన ఓపెన్ హసీబ్ హమీద్ ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. రోరీ బర్న్స్ కూడా గత మ్యాచ్ వైఫల్యం నుంచి కోలుకున్నాడు. వీరిద్దరూ భారత బౌలర్లుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు. ఓపెనర్లు రోరీ బర్న్స్ (52 బ్యాటింగ్), హసీబ్ హమీద్ (60 బ్యాటింగ్) ఇద్దరూ కలసి తొలి వికెట్‌కు అజేయంగా 120 పరుగులు జోడించారు. ఇంగ్లాండ్ జట్టు 42 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగుల ఆధిక్యత సాధించింది. దాదాపు ఇప్పటికే టీమిండియా మ్యాచ్ పై పట్టు కోల్పోయింది. అయితే, ఒక ఆశ మాత్రం ఫ్యాన్స్ కు ఊరట కలిగిస్తోంది. ఆ ఆశ ఏంటంటే.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న రికార్డే.
టీమిండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఇంత వరకు తన కెరీర్ లో ఓ సిరీస్ లో మూడో టెస్ట్ ని ఓడిపోయింది లేదు. దీన్ని బట్టి చూస్తే ఈ సిరీస్ లో జరిగే మూడో టెస్ట్ లో కూడా టీమిండియా ఓడిపోయే ఛాన్స్ లు లేవని ఫ్యాన్స్ ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ కి ఉన్న ఈ రికార్డే టీమిండియాకు ఇప్పుడు శ్రీరామరక్ష అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు.. " విరాట్ కెప్టెన్‌గా చేసిన మూడో టెస్టులో భారత్ ఎప్పుడూ ఓడిపోలేదు. కానీ అది ఇప్పుడు బ్రేక్ అయ్యేలా ఉంది. " అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Virat Kohli has never lost the 3rd match of Test series in his entire career as captain.
This time he will. Worst team selection. These backing up concept s destroying team moral now. It's been 2 years now they r backing pujara n rahane. In two years hardly 4-5 matches they performed that too not exceptional.
మరోవైపు, కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) వరుస బ్యాటింగ్ వైఫల్యాలు మాత్రం అటు టీమ్ మేనేజ్మెంట్ సహా అభిమానులను కూడా ఆందోళనకు గురి చేస్తోంది. మూడో టెస్టులో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో చేతులెత్తేసింది. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదుకునే విషయంలో కోహ్లీకి మంచి రికార్డు ఉంది. ఎన్నో సార్లు ఒంటి చేత్తే ఇన్నింగ్స్‌లను చక్కదిద్దాడు. కానీ మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 7 పరుగులకే అవుటయ్యాడు. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ ప్రదర్శన అత్యంత పేలవంగా ఉంది. తొలి టెస్టులో డకౌట్ అయిన కోహ్లీ, రెండో టెస్టులో 42, 20 పరుగులు చేశాడు. కోహ్లీ అంతర్జాతీయ ఫార్మాట్లో సెంచరీ చేయక ఇప్పటికి 641 రోజులు అవుతుంది. చివరి సెంచరీ చేసిన తర్వాత కోహ్లీ సగటు కేవలం 23.00 మాత్రమే.
అంతే కాకుండా అన్ని ఫార్మాట్లు కలిపి 50 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ చేసింది మూడు అర్దసెంచరీలు మాత్రమే. పరుగుల యంత్రం అని పేరు తెచ్చుకున్న కోహ్లీ వైఫల్యాలు భారత జట్టుకు కూడా భారంగా మారుతున్నాయి. కీలక సమయంలో వికెట్ పారేసుకోవడం అభిమానులను చికాకు పెడుతున్నది. రాబోయే టీ20 వరల్డ్ కప్ ముందు కోహ్లీ ఇలాంటి పేలవ ఫామ్‌లో ఉండటం జట్టుకు మంచిది కాదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.