రెండో టెస్టులో టీమిండియాపై ఇంగ్లండ్ (Ind Vs Eng ) ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో రోజు ఆటలో జో రూట్ సేన భారీ ఆధిక్యాన్ని సాధించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్.. 8 వికెట్ల నష్టానికి పరుగులు 423 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 345 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. దాదాపు ఈ మ్యాచ్ పై టీమిండియా పట్టు కోల్పోయింది. ఐదు టెస్ట్ ల ఇంగ్లాండ్ (England) పర్యటనలో తొలి మ్యాచ్‌లో వర్షం కారణంగా వెనుకబడి, లార్డ్స్‌లో విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచిన టీమిండియా (Team India).. అదే జోరులో ఆధిక్యాన్ని పెంచుకోవాలని చూసింది. కానీ లీడ్స్ టెస్టులో భారత్ అనూహ్యంగా కుప్పకూలింది. దీంతో భారత్ దాదాపు రేసులో వెనకపడినట్టే. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ (Joe Root) మరోసారి తన ప్రతాపాన్ని చూపించాడు. సెంచరీతో కదం తొక్కాడు. అతని దెబ్బకి టీమిండియా బౌలర్లు తేలిపోయారు. ఈ సిరీస్ లో ముచ్చటగా మూడో సెంచరీ చేశాడు ఇంగ్లండ్ కెప్టెన్. జో రూట్ 165 బంతుల్లో 121 పరుగులు చేశాడు. మంచి ఫామ్ లో ఉన్న జో రూట్ ని అద్భుతమైన డెలివరీతో బుమ్రా బౌల్డ్ చేశాడు. మలన్ 70 పరుగులు, రోరి బర్న్స్ 61 పరుగులు, హాసీబ్ హామీద్ 68 పరుగులతో రాణించారు. టీమిండియా బౌలర్లలో షమీ మూడు వికెట్లతో సత్తా చాటాడు.
120/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో గురువారం ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు నిలకడగా ఆడింది. తొలి రోజే హాఫ్ సెంచరీలు చేసిన ఓపెనర్లు రోరీ బర్న్స్, హసీబ్ హమీద్‌లు వికెట్ కాపాడుకున్నారు. ఆచితూచి ఆడుతూ స్కోర్ వేగం పెంచే ప్రయత్నం చేశారు. మొదటగా మొహ్మద్ షమీ.. బర్న్‌ను బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 135 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోర్‌కు ఇంగ్లండ్ ఓపెనర్లు మరో 15 పరుగులు మాత్రమే జోడించారు. అనంతరం హమీద్‌కు డేవిడ్ మలాన్ జత కలిశాడు. మరో 24 పరుగుల అనంతరం జడేజా.. హమీద్‌ను బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 159 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
ఇది కూడా చదవండి : " అంపైర్ మాట వినడం వల్లే ఔట్ అయ్యాను " .. రిషబ్ పంత్ సంచలన కామెంట్స్..
ఓపెనర్ల అనంతరం జోడీ కట్టిన డేవిడ్ మలన్, జో రూట్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ పరుగులు చేశారు. చెత్త షాట్లకు పోకుండా వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ జోడీని విడదీసేందుకు ఎంత ప్రయత్నించినా.. కుదరలేదు. ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఇక టీ బ్రేక్ సమయానికి ముందు మలన్ (70) మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. దాంతో మలన్, రూట్ మధ్య 139 పరుగుల కీలక భాగస్వామ్యంకు తెరపడింది. రెండో సెషన్‌లో రూట్ సేన మొత్తం 26 ఓవర్లు బ్యాటింగ్ చేసి 116 పరుగులు సాధించి ఒక వికెట్ నష్టపోయింది.ఇక, ఆఖరి సెషల్ లో జానీ బెయిర్ స్టోతో కలిసి 52 పరుగుల పార్టనర్ షిప్ ని నెలకొల్పాడు జో రూట్. అయితే.. బెయిర్ స్టో ఔటైన తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది ఇంగ్లండ్. ఆఖర్లో క్రెగ్ ఓవర్టన్, శామ్ కర్రన్ మెరుపులు మెరిపించారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో క్రెయిగ్ ఓవర్టన్, ఓలీ రాబిన్సన్ క్రీజులో ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, India vs england, Sports, Team India, Virat kohli