IND VS ENG 3RD TEST RAIN INTERRUPTION AND TEAM INDIA BATSMAN SUPER BATTING ONLY SAVE TEAM INDIA FOR HUGE DEFEAT SRD
Ind Vs Eng : మూడో టెస్ట్ లో టీమిండియా గట్టెక్కాలంటే కష్టమే..! ఇక కాపాడాల్సింది అతడే..!
Ind Vs Eng
Ind Vs Eng : ఇంగ్లండ్ జట్టు (England Team) తో లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా (Team India) పోరాడుతోంది. ఓటమిని తప్పించుకోవాడానికి టీమిండియా బ్యాట్స్ మెన్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో కలిసి.. ఛతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు.
ఇంగ్లండ్ జట్టు (England Team) తో లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా (Team India) పోరాడుతోంది. ఓటమిని తప్పించుకోవాడానికి టీమిండియా బ్యాట్స్ మెన్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో కలిసి.. ఛతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. అయితే, అంతకుముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) ఔట్ అయ్యాడు. ఇంగ్లండ్ పేసర్ క్రెయిగ్ ఓవర్టన్ వేసిన 19వ ఓవర్ చివరి బంతికి జానీ బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి రాహుల్ పెవిలియన్ చేరాడు. రాహుల్ 54 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. రాహుల్ అనంతరం అంపైర్లు లంచ్ బ్రేక్ ప్రకటించారు. మూడో రోజు భోజన విరామ సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 34 పరుగులు చేసిందిఅంతకుముందు 132.2 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ 432 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జస్ప్రీత్ బుమ్రా వేసిన 132.2వ బంతికి ఓలి రాబిన్సన్ (0; 15 బంతుల్లో) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అంతకుముందు ఓవర్లో క్రెయిగ్ ఓవర్టన్ (32)ను మొహ్మద్ షమీ పెవిలియన్ చేర్చాడు. దీంతో ఆంగ్లేయులకు 354 పరుగుల ఆధిక్యం దక్కింది. షమీ (Mohammed Shami) 4 వికెట్లు పడగొట్టాడు.
ఇక, భారత్ ఈ మ్యాచులో ఓటమి పాలవ్వకుండా ఉండాలంటే అద్భుతమే జరగాలి. ఇంతకన్నా ఎక్కువ స్కోరైనా చేయాలి. లేదంటే మూడు రోజుల పాటు ఆలౌట్ అవ్వకుండా ఆడాలి. టీమిండియా విదేశాల్లో 131 ఓవర్లకు పైగా ఒక ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేయడం 2015 తర్వాత ఇదే తొలిసారి. అప్పుడు సిడ్నీ టెస్టులో ఏకంగా 152.3 ఓవర్లు ఫీల్డింగ్ చేయడం గమనార్హం. తొలి ఇన్నింగ్స్‌లో ఇబ్బంది పడినట్టు భారత బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడకపోయినా, రెండో ఇన్నింగ్స్‌లో ఈ స్కోరును దాటించి పరుగులు చేసి... మ్యాచ్‌ను కాపాడుకోవాలంటే అసాధారణంగా రాణించాల్సి ఉంటుంది. ఈ స్కోరును దాటించి మన బ్యాట్స్ మెన్ పరుగులు చేయడం అంటే కష్టమే.
ఇటీవల మన ఆటగాళ్లు ఫామ్ ను చూస్తే ఈ విషయం ఇట్టే అర్ధమవుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమి నుంచి గట్టెక్కాలంటే 650 ప్లస్ పరుగులు చేయాలి. ఇక, ఈ ఓటమి నుంచి తప్పించాలంటే, తొలి టెస్టులో భారత జట్టుకి విజయాన్ని దూరం చేసిన వరుణుడు, మ్యాచ్‌కి అడ్డంకి కలిగించాలని కోరుకోవాల్సిందే. ఇప్పుడున్న ఫామ్‌లో టీమిండియాను ఆలౌట్ చేసేందుకు ఇంగ్లాండ్‌కి మహా అయితే మూడు సెషన్లు సరిపోతాయి. అంటే మ్యాచ్ సజావుగా సాగితే నాలుగో రోజు ముగిసిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే క్రీడాస్ఫూర్తికి విరుద్ధమై అయినా వర్షం కారణంగా మరోసారి రోజు లేదా రోజున్నర ఆట రద్దు కావాలని గట్టిగా కోరుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.