హోమ్ /వార్తలు /క్రీడలు /

Ind Vs Eng : " తగ్గేదే లే.. వివాదాల జోలికి పోం.. మా ఆటతోనే సరియైన సమాధానం చెబుతాం.."

Ind Vs Eng : " తగ్గేదే లే.. వివాదాల జోలికి పోం.. మా ఆటతోనే సరియైన సమాధానం చెబుతాం.."

Ind Vs Eng

Ind Vs Eng

Ind Vs Eng : లార్డ్స్ విక్టరీతో ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 1-0 తో ఆధిక్యంలో వెళ్లిన భారత్.. అదే జోరును కొనసాగించి సిరీస్‌పై మరింత పట్టు సాధించాలనుకుంటుంది. మరోవైపు అనవసర తప్పిదాలతో విజయం ముంగిట బోల్తా పడిన జోరూట్ సేన.. మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తోంది.

ఇంకా చదవండి ...

  లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో భారత్‌ (Team India)ను కవ్వించి మరీ ఆ జట్టు మూల్యం చెల్లించుకుంది ఇంగ్లండ్ జట్టు (England Team). ప్రశాంతంగా సాగిపోతున్న మ్యాచ్ లో అనవసరంగా టీమిండియా ఆటగాళ్లను రెచ్చగొట్టి అసలకే ఎసరు తెచ్చుకున్నారు . మాతో పెట్టుకుంటే మడతడిపోద్దే అన్న తరహాలో చెలరేగిన భారత్ ఆటగాళ్లు చారిత్రాత్మక విజయాన్నందుకున్నారు. అయితే, లార్డ్స్‌ మైదానంలో జరిగిన రెండో టెస్టు నుంచి చాలా విషయాలు నేర్చుకున్నామని, ఇకపై ఇతర విషయాల జోలికి వెళ్లమని ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌ (Joe Root) అన్నాడు. ఇక నుంచి సరైన ఆటతోనే సమాధానం చెప్పాలనుకుంటున్నట్లు తెలిపాడు జో రూట్. మూడో టెస్టుకు ముందు నిర్వహించిన వర్చువల్‌ మీడియా సమావేశంలో అతడు మాట్లాడుతూ ఈ విధంగా స్పందించాడు. టీమిండియాతో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ 151 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. డ్రా చేసుకునే మ్యాచును ఇంగ్లండ్ చేజేతులారా పోగొట్టుకుంది. ఇంగ్లీష్ ప్లేయర్స్ పంథాలకు పోయి మూల్యం చెల్లించుకున్నారు.

  ఐదో రోజు ఆటలో భారత బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ( 34 నాటౌట్), మహ్మద్ షమీ (Mohammed Shami) (56 నాటౌట్) చెలరేగిన విషయం తెలిసిందే. ఒకవైపు ఇంగ్లండ్ ఆటగాళ్లు దూషిస్తున్నా.. మరోవైపు పేసర్లు బౌన్సర్లతో బయపెడుతున్నా అద్భుతంగా ఆడారు. ఈ క్రమంలోనే రికార్డు స్థాయిలో 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

  ఇది కూడా చదవండి : Zainab Abbas : ఈ పాకిస్తాన్ యాంకర్ మహ్మద్ సిరాజ్ కు పెద్ద ఫ్యాన్.. ఆమె గురించి విషయాలు తెలుసా..?

  అయితే ఇంగ్లండ్ పేసర్లు బుమ్రా-షమీలను ఔట్‌ చేయడానికి చూడకుండా బౌన్సర్లతో ఇబ్బంది పెట్టాలని చూశారు. ఆ ప్రణాళిక కాస్త బెడిసికొట్టడంతో టీమిండియాకు భారీ ఆధిక్యం దక్కింది. ఇంత జరుగుతున్నా.. మిస్టర్ పర్ఫెక్ట్ జో రూట్‌ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయాడు. దీంతో అతడి కెప్టెన్సీపై విమర్శలు చెలరేగుతున్నాయి. లార్డ్స్‌లో ఐదో రోజు జస్ప్రీత్ బుమ్రా విషయంలో ఇంగ్లండ్ జట్టు చేసిన తప్పులను సొంత జట్టు మాజీలే తీవ్రంగా తప్పుపట్టారు. నాసర్‌ హుస్సేన్‌, మైకేల్ వాన్ లాంటి క్రికెటర్లు అయితే రూట్‌ కెప్టెన్సీని వేలెత్తిచూపారు. కెప్టెన్సీ అనేది పాపులారిటీ కాదని తీవ్రంగా మండిపడ్డారు. ఇక అభిమానుల సంగతి అయితే చెప్పక్కర్లేదు.

  ట్వీట్లు, కామెంట్లతో పాటు మీమ్స్ కూడా ట్రెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జో రూట్‌ ఇలా మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. మూడో టెస్టులో తాము సరైన ఆట ఆడాలనుకుంటున్నామని, ప్రత్యర్థి జట్టుతో ఎలాంటి వివాదాలకు పోదల్చుకోవడంలేదని రూట్ చెప్పుకొచ్చాడు.లీడ్స్‌ వేదికగా బుధవారం నుంచి ప్రారంభమయ్యే తర్వాతి మ్యాచ్‌లో తాము నిజాయతీగా ఉండాలనుకుంటున్నామని జో రూట్‌ తెలిపాడు. వ్యక్తిగతంగా ఎంత నిక్కచ్చిగా ఉంటామో.. ఒక బృందంలోనూ అలాగే అత్యుత్తమ ఆట ఆడాలనుకుంటున్నామన్నాడు.

  ఇక, ఇంగ్లండ్ జట్టు మూడో టెస్టులో మూడు కీలక మార్పులతో బరిలోకి దిగనుందని జో రూట్‌ స్పష్టం చేశాడు. డామ్‌ సిబ్లీ బదులు జట్టులోకి డేవిడ్‌ మలన్‌ వస్తున్నాడని, అలాగే హసీబ్ హమీద్‌ ఓపెనర్‌గా ఆడనున్నాడని చెప్పాడు. ఫస్ట్ డౌన్‌లో మలాన్ బ్యాటింగ్ చేయనున్నాడట.ఇక రెండో టెస్టులో ఐదు వికెట్లతో చెలరేగిన మార్క్‌ వుడ్‌ భుజం గాయం కారణంగా దూరమయ్యాడని రూట్ తెలిపాడు. అతడి స్థానంలో సాకిబ్‌ మహమూద్ అరంగేట్రం చేయనున్నట్లు చెప్పాడు. హసీబ్ హమీద్‌, సాకిబ్‌ మహమూద్ ఇద్దరూ ఇంగ్లండ్ జట్టుకు ఉపయోగపడతారని కెప్టెన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

  లార్డ్స్ విక్టరీతో ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 1-0 తో ఆధిక్యంలో వెళ్లిన భారత్.. అదే జోరును కొనసాగించి సిరీస్‌పై మరింత పట్టు సాధించాలనుకుంటుంది. మరోవైపు అనవసర తప్పిదాలతో విజయం ముంగిట బోల్తా పడిన జోరూట్ సేన.. మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తోంది. ఇప్పటికే తమ తప్పిదాలను సరిదిద్దుకునే పనిలో పడిన ఆతిథ్య జట్టు.. తుది జట్టులో మార్పులు చేసేందుకు కూడా సిద్దమవుతోంది. లీడ్స్‌లో లెక్కసరి చేసి లార్డ్స్ ఓటమికి బదులు తీర్చుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలో మూడో టెస్ట్ సైతం అభిమానులకు కావాల్సిన మాజా అందించనుంది.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, IND VS ENG, India vs england, Jasprit Bumrah, Sports, Virat kohli

  ఉత్తమ కథలు