Home /News /sports /

IND VS ENG 3RD T20 RISHABH PANT ROHIT SHARMA ENGAGE IN HILARIOUS CHAT DURING 2ND T20I AGAINST ENGLAND SJN

Rohit Sharma : అడ్డొస్తే గుద్దిపాడేయ్.. ఏం ఆలోచించకు‘ పంత్ కు రోహిత్ సలహా.. అసలేం జరిగిందంటే?

PC : TWITTER

PC : TWITTER

Rohit Sharma : ఇంగ్లండ్ (England)తో జరిగిన రెండో టి20లోనూ భారత్ (India) 49 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. దాంతో సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో భారత్ సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో భారత్ రిషభ్ పంత్ (Rishabh Pant)ను ఓపెనర్ గా పంపి ప్రయోగం చేసింది.

ఇంకా చదవండి ...
Rohit Sharma : ఇంగ్లండ్ (England)తో జరిగిన రెండో టి20లోనూ భారత్ (India) 49 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. దాంతో సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో భారత్ సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో భారత్ రిషభ్ పంత్ (Rishabh Pant)ను ఓపెనర్ గా పంపి ప్రయోగం చేసింది. ఉన్నంత సేపు పంత్ ధనాధన్ షాట్లతో రెచ్చిపోయాడు. ఇక ఈ మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. భారత్ బ్యాటింగ్ చేస్తోండగా తొలి ఓవర్ ను డేవిడ్ విల్లీ వేయడానికి వచ్చాడు. మూడో బంతిని మిడాన్ దిశలో ఆడిన పంత్ సింగిల్ తీశాడు. అయితే సింగిల్ తీసే క్రమంలో అతడికి బౌలర్ విల్లీ అడ్డుగా వచ్చాడు.

ఇది కూడా చదవండి : ధోని అంటే జడేజాకు పడటం లేదా? అందుకే ఈసారి కూల్ కెప్టెన్ ను పట్టించుకోలేదా? 

దాంతో రన్ తీస్తుంటే డేవిడ్ విల్లీ అడ్డుగా వచ్చాడంటూ పంత్ రోహిత్ కు చెబుతాడు. ’సామ్మే ఆ గయా థా.. టక్కర్ మార్ దు క్యా‘ (అడ్డుగా వచ్చాడు.. ఢీ కొట్టనా) అని రోహిత్ ను అడుగుతాడు. దానికి రోహిత్ ’మార్ దే.. ఔర్ క్యా ‘(ఢీ కొట్టేయ్ ఇంకేం చేస్తాం) అంటూ బదులిస్తాడు. ఈ సంభాషన్ స్టంప్ మైక్ లో రికార్డు అయ్యింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టగా ఇప్పుడు అది కాస్తా వైరల్ గా మారింది.


ఇక మ్యచ్ విషయానికి వస్తే  మూడు వికెట్లతో భువనేశ్వర్ కుమార్ చెలరేగడంతో రెండో టి20లో భారత్ 49 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్ ల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్.. 2-0తో సొంతం చేసుకుంది. భువనేశ్వర్ కు తోడు జస్ ప్రీత్ బుమ్రా, యుజువేంద్ర చహల్ చెరో రెండు వికెట్లు తీశారు. దాంతో 171 పరుగలు లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 17 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ విజయం కోసం మొయిన్ అలీ (35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ విల్లీ (33 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టు విజయం కోసం పోరాడారు.



అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (29 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్ గా వచ్చిన రిషభ్ పంత్ (15 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆరంభంలో మెరుపులు మెరిపించినా ఆ తర్వాత దానిని కొనసాగించుకోలేకపోయాడు. రోహిత్ శర్మ (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరు మినహా మిగిలిన వారు పెద్దగా రాణించలేకపోయాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 4 వికెట్లు తీశాడు. 34 ఏళ్ల వయసులో టి20ల్లో అరంగేట్రం చేసిన రిచర్డ్ గ్లీసన్ 3 వికెట్లతో చెలరేగాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Hardik Pandya, India vs england, Jasprit Bumrah, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు