Home /News /sports /

IND VS ENG 3RD T20 HARDIK PANDYA STRONG REPLY TO ROHIT SHARMA ON HIS FIELDING POSITION CHANGE SJN

IND vs ENG : హిట్ మ్యాన్ కే ధమ్కీ ఇచ్చిన హార్దిక్.. మైదానంలో సీరియస్ వార్నింగ్.. ఏం జరిగిందంటే?

Hardik Pandya

Hardik Pandya

IND vs ENG : భారత్ (India) ఇంగ్లండ్ (England) జట్ల మధ్య జరిగిన రెండో టి20లో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. భారత్ బ్యాటింగ్ చేసే సమయంలో రోహిత్ శర్మ (Rohit Sharma), రిషభ్ పంత్ (Rishabh Pant) కలిసి రన్ తీసేప్పుడు అడ్డుగా వస్తోన్న డేవిడ్ విల్లీని ఢీకొట్టు అంటూ మాట్లాడుకున్నారు.

ఇంకా చదవండి ...
IND vs ENG : భారత్ (India) ఇంగ్లండ్ (England) జట్ల మధ్య జరిగిన రెండో టి20లో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. భారత్ బ్యాటింగ్ చేసే సమయంలో రోహిత్ శర్మ (Rohit Sharma), రిషభ్ పంత్ (Rishabh Pant) కలిసి రన్ తీసేప్పుడు అడ్డుగా వస్తోన్న డేవిడ్ విల్లీని ఢీకొట్టు అంటూ మాట్లాడుకున్నారు. ఇక ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఇద్దరు భారత  ఆటగాళ్ల మధ్య చిన్నపాటి యుద్ధమే నడిచింది. ఫీల్డింగ్ సెట్ చేసే సమయంలో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మకే సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన సంభాషణ స్టంప్ మైక్ లో రికార్డయింది. ఆ వీడియోను ట్విట్టర్ లో పెట్టగా అది కాస్తా వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి : కెప్టెన్సీ అంటూ ఆశ చూపించి మొత్తంగా ఆ ప్లేయర్ ను టీం నుంచే వెళ్లిపోయేలా చేస్తివి కదా ధోని..

ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో హార్దిక్ ను ఫీల్డ్ పొజిషన్ చేంజ్ కావాలంటూ రోహిత్ ఆదేశించాడు. దాంతో హార్దిక్ పాండ్యా ’నాతో మాట్లాడేటప్పుడు నన్ను చూసి మాట్లాడు. వేరే వాళ్లను చూసి కాదు‘ అంటూ ఘాటుగా బదులు ఇచ్చాడు. వాస్తవానికి రోహిత్ హార్దిక్ ఫీల్డింగ్ పొజిషన్ ను చేంజ్ కావాలని సూచించగా.. హార్దిక్ తనను కాదేమో అని తొలుత భావించి అలానే ఉండిపోయాడు. అనంతరం కోపంతో హార్దిక్ ను ఫీల్డింగ్ పొజిషన్ ను మారాలంటూ కాస్త గట్టిగా చెప్పాడు. దాంతో తనకు చెప్పేటప్పుడు తనను చూసి చెబితే బాగుంటుందని లేదంటే వేరే వాళ్లకు చెబుతున్నావేమో అని తాను అనుకున్నానంటూ రోహిత్ కు సుతిమెత్తగా చురకలు అంటించాడు. ఇక రోహిత్ ఫ్యాన్స్ అయితే హార్దిక్ ప్రవర్తనను తప్పుబడుతున్నారు. ఒక ఐపీఎల్ ట్రోఫీ.. పసికూనపై సిరీస్ నెగ్గగానే నెత్తిన కొమ్ములు వచ్చాాయా? అంటూ విమర్శలు చేస్తున్నారు.



ఇక మ్యచ్ విషయానికి వస్తే  మూడు వికెట్లతో భువనేశ్వర్ కుమార్ చెలరేగడంతో రెండో టి20లో భారత్ 49 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్ ల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్.. 2-0తో సొంతం చేసుకుంది. భువనేశ్వర్ కు తోడు జస్ ప్రీత్ బుమ్రా, యుజువేంద్ర చహల్ చెరో రెండు వికెట్లు తీశారు. దాంతో 171 పరుగలు లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 17 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ విజయం కోసం మొయిన్ అలీ (35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ విల్లీ (33 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టు విజయం కోసం పోరాడారు.



అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (29 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్ గా వచ్చిన రిషభ్ పంత్ (15 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆరంభంలో మెరుపులు మెరిపించినా ఆ తర్వాత దానిని కొనసాగించుకోలేకపోయాడు. రోహిత్ శర్మ (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరు మినహా మిగిలిన వారు పెద్దగా రాణించలేకపోయాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 4 వికెట్లు తీశాడు. 34 ఏళ్ల వయసులో టి20ల్లో అరంగేట్రం చేసిన రిచర్డ్ గ్లీసన్ 3 వికెట్లతో చెలరేగాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Hardik Pandya, India vs england, Jasprit Bumrah, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు