Home /News /sports /

IND VS ENG 3RD T20 ENGLAND CAPTAIN JOS BUTTLER WON THE TOSS AND ELECTED TO BAT FIRST SJN

IND vs ENG : టాస్ నెగ్గిన ఇంగ్లండ్.. భారీ మార్పులు చేసిన భారత్.. స్పీడ్ కా బాప్ కు ఛాన్స్..

PC : BCCI

PC : BCCI

IND vs ENG 3rd T20 : ఇంగ్లండ్ (England)తో మరికొద్ది సేపట్లో ఆరంభం కానున్న చివరిదైన మూడో టి20లో భారత్ టాస్ ఓడిపోయింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ (Jos Buttler) బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం  ఇంగ్లండ్ మూడు మార్పులు చేయగా.. భారత్ మూడు మార్పులు చేసింది.

ఇంకా చదవండి ...
IND vs ENG 3rd T20 : ఇంగ్లండ్ (England)తో మరికొద్ది సేపట్లో ఆరంభం కానున్న చివరిదైన మూడో టి20లో భారత్ టాస్ ఓడిపోయింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ (Jos Buttler) బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం  ఇంగ్లండ్ మూడు మార్పులు చేయగా.. భారత్ నాలుగు మార్పులు చేసింది. హార్దిక్ పాండ్యా, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, యుజువేంద్ర చహల్ లకు విశ్రాంతి ఇచ్చిన టీమిండియా.. శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, ఉమ్రాన్ మాలిక్, అవేశ్ ఖాన్ లకు తుది జట్టులో చోటు ఇచ్చింది. ఓపెనర్ గా రిషభ్ పంత్ మరోసారి వచ్చే అవకాశం ఉంది.

ప్రయోగాల బాట

ఇప్పటికే సిరీస్ ను 2-0తో సొంతం చేసుకోవడంతో భారత్ ఈ మ్యాచ్ లో ప్రయోగాల బాట పట్టింది. హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యుజువేంద్ర చహల్, బుమ్రాలకు విశ్రాంతి ఇచ్చి వారి స్థానాల్లో శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్ లకు చోటు ఇచ్చింది. ఇక ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీకి చావో రేవో లాంటిది. గత కొంతకాలంగా ఫామ్ లో లేని అతడికి మరో అవకాశం ఇచ్చింది. రెండో టి20లో కోహ్లీ కేవలం 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరుకున్నాడు. కోహ్లీ కోసం ఫామ్ లో ఉన్న దీపక్ హుడాను బెంచ్ కే పరిమితం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదే సమయంలో శ్రేయస్ అయ్యర్ కు కూడా ఈ  మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. అతడు కూడా గత కొంత కాలంగా ఫామ్ లో లేడు. ఇంగ్లండ్ తో ముగిసిన టెస్టు మ్యాచ్ లో రాణించలేకపోయాడు. అదే సమయంలో రెండో టిి20లో అతడికి తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు.



తుది జట్లు

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, ఉమ్రాన్ మాలిక్

ఇంగ్లండ్

జాస్ బట్లర్ (కెప్టెన్), జేసన్ రాయ్, డేవిడ్ మలాన్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్ స్టోన్, హ్యారీ బ్రూక్, క్రిస్ జోర్డాన్, డేవిడ్ విల్లీ, రిచర్డ్ గ్లెసన్, టాప్లీ, సాల్ట్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Hardik Pandya, India vs england, Jasprit Bumrah, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు