Home /News /sports /

IND VS ENG 3RD T20 ENGLAND CAPTAIN JOS BUTTLER TAKES STUNNING CATCH OF ROHIT SHARMA IN 2ND T20I SJN

IND vs ENG : జాస్ బట్లర్ కేక పెట్టించే క్యాచ్.. వెనక్కి పరుగెడుతూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్న ఇంగ్లండ్ కెప్టెన్

PC : TWITTER

PC : TWITTER

IND vs ENG : ఇండియా (India), ఇంగ్లండ్ (England) జట్ల మధ్య జరుగుతోన్న మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యంలోని టీమిండియా (Team India) సొంతం చేసుకున్న సంగతి  తెలిసిందే. తొలి మ్యాచ్ లో 50 పరుగులతో నెగ్గిన భారత్.. రెండో టి20లో 49 పరుగులతో నెగ్గింది.

ఇంకా చదవండి ...
IND vs ENG : ఇండియా (India), ఇంగ్లండ్ (England) జట్ల మధ్య జరుగుతోన్న మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే రోహిత్ శర్మ (Rohit Sharma) సారథ్యంలోని టీమిండియా (Team India) సొంతం చేసుకున్న సంగతి  తెలిసిందే. తొలి మ్యాచ్ లో 50 పరుగులతో నెగ్గిన భారత్.. రెండో టి20లో 49 పరుగులతో నెగ్గింది. ఇక ఆదివారం జరిగే మూడో మ్యాచ్ లోనూ నెగ్గి ఇంగ్లండ్ ను 3-0తో వైట్ వాష్ చేయాలని భారత్ పట్టుదలగా ఉంది. ఈ సిరీస్ కు ముందు ఇయాన్ మోర్గాన్ తప్పుకోవడంతో పరిమిత ఓవర్లకు జాస్ బట్లర్ కెప్టెన్ అయ్యాడు. అయితే రెండు మ్యాచ్ ల్లోనూ దారుణంగా విఫలం అయ్యాడు. అయితే కీపర్ గా మాత్రం రెండో టి20లో బట్లర్ అదరగొట్టాడు.

ఇది కూడా చదవండి : హిట్ మ్యాన్ కే ధమ్కీ ఇచ్చిన హార్దిక్.. మైదానంలో సీరియస్ వార్నింగ్.. ఏం జరిగిందంటే?

అద్భుత క్యాచ్ తో ఊపు మీదున్న రోహిత్ శర్మ ను పెవలియన్ కు పంపాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ, రిషభ్ పంత్ లు శుభారంభం చేశారు. 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాదిన రోహిత్ సూపర్ టచ్ లో కనిపించాడు. అయితే 34 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన ఇంగ్లండ్ పేసర్ రిచర్డ్ గ్లీసన్ రోహిత్ ను అవుట్ చేశాడు. 5వ ఓవర్ వేయడానిక వచ్చిన గ్లీసన్ ఐదో బంతిని షార్ప్ బౌన్సర్ వేశాడు. రోహిత్ దానిని ఫుల్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి ఎడ్జ్ తీసుకుని కీపర్ వెనుక గాల్లోకి లేచింది. అయితే కీపర్ బట్లర్ వెనక్కి పరుగెడుతూ డైవ్ చేస్తూ క్యాచ్ ను అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



ఇక మ్యచ్ విషయానికి వస్తే మూడు వికెట్లతో భువనేశ్వర్ కుమార్ చెలరేగడంతో రెండో టి20లో భారత్ 49 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్ ల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్.. 2-0తో సొంతం చేసుకుంది. భువనేశ్వర్ కు తోడు జస్ ప్రీత్ బుమ్రా, యుజువేంద్ర చహల్ చెరో రెండు వికెట్లు తీశారు. దాంతో 171 పరుగలు లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 17 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ విజయం కోసం మొయిన్ అలీ (35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ విల్లీ (33 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టు విజయం కోసం పోరాడారు.



అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (29 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్ గా వచ్చిన రిషభ్ పంత్ (15 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆరంభంలో మెరుపులు మెరిపించినా ఆ తర్వాత దానిని కొనసాగించుకోలేకపోయాడు. రోహిత్ శర్మ (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరు మినహా మిగిలిన వారు పెద్దగా రాణించలేకపోయాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 4 వికెట్లు తీశాడు. 34 ఏళ్ల వయసులో టి20ల్లో అరంగేట్రం చేసిన రిచర్డ్ గ్లీసన్ 3 వికెట్లతో చెలరేగాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, India vs england, Jasprit Bumrah, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు