హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs ENG : సూర్యకుమార్ సెంచరీ కొట్టినా.. ఇంగ్లండ్ చేతిలో తప్పని పరాభవం

IND vs ENG : సూర్యకుమార్ సెంచరీ కొట్టినా.. ఇంగ్లండ్ చేతిలో తప్పని పరాభవం

PC : BCCI

PC : BCCI

IND vs ENG : మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను భారత్ (India) వైట్ వాష్ చేయలేకపోయింది. ఇంగ్లండ్ (England)తో ఆదివారం జరిగిన మూడో టి20లో టీమిండియా (Team India) 17 పరుగులతో ఓడిపోయింది. సూర్యకుమార్ యాదవ్ (55 బంతుల్లో 117; 14 ఫోర్లు, 6 సిక్సర్లు) జట్టు విజయం కోసం ఒంటరి పోరాటం చేశాడు.

ఇంకా చదవండి ...

IND vs ENG : మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను భారత్ (India) వైట్ వాష్ చేయలేకపోయింది. ఇంగ్లండ్ (England)తో ఆదివారం జరిగిన మూడో టి20లో టీమిండియా (Team India) 17 పరుగులతో ఓడిపోయింది. సూర్యకుమార్ యాదవ్ (55 బంతుల్లో 117; 14 ఫోర్లు, 6 సిక్సర్లు) జట్టు విజయం కోసం ఒంటరి పోరాటం చేశాడు. 216 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 198 పరుగులు మాత్రమే చేయగలిగింది. సూర్యకుమార్ యాదవ్ మినహా మిగిలిన భారత బ్యాటర్లు రాణించలేదు. కనీసం సూర్యకుమార్ కు సహకారం కూడా అందించలేకపోయారు. దాంతో అద్భుత ఇన్నింగ్స్ వృధాగా మిగిలింది. ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టాప్లీ 3 వికెట్లు తీశాడు. క్రిస్ జోర్డాన్, డేవిడ్ విల్లీ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.

సూర్యకుమార్ వన్ మ్యాన్ షో

భారత ఇన్నింగ్స్ ను వన్ మ్యాన్ షోగా అభివర్ణించవచ్చు. ఓపెనర్లుగా వచ్చిన రిషభ్ పంత్ (1), రోహిత్ శర్మ (11) విఫలం అయ్యారు. ఫామ్ లో లేని విరాట్ కోహ్లీ (11) డేవిడ్ విల్లీ బౌలింగ్ లో వరుసగా ఫోర్, సిక్సర్ బాదినా ఆ తర్వాతి బంతికే పెవిలియన్ కు చేరుకున్నాడు. దాంతో భారత్ 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ (28; 2 సిక్సర్లు)తో కలిసి సూర్యకుమార్ యాదవ్ భారత్ ను ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 119 పరుగులు జోడించారు. అయితే అయ్యర్ అవుటైయ్యాక.. దినేశ్ కార్తీక్ (6), జడేజా (7) వెంటవెంటనే అవుటయ్యారు. దాంతో చివరి రెండు ఓవర్లలో భారత్ విజయం సాధించాలంటే 41 పరుగులు సాధించాల్సి వచ్చింది. ఈ క్రమంలో తొలి మూడు బంతులకు సూర్యకుమార్ యాదవ్ 16 పరుగులు సాధించాడు. అయితే భారీ షాట్ కు ప్రయత్నించి ఐదో బంతికి సూర్యకుమార్ అవుటయ్యాడు. అనంతరం భారీ షాట్లు ఆడే ప్లేయర్స్ లేకపోవడంతో భారత్ ఓడిపోయింది.

అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్  20 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్  (39 బంతుల్లో 77; 6 ఫోర్లు, 5 సిక్సర్లు)కు తోడుగా లియామ్ లివింగ్ స్టోన్ (29 బంతుల్లో 42 నాటౌట్; 4 సిక్సర్లు) రాణించాడు. చివర్లో హ్యారీ బ్రూక్ (9 బంతుల్లో 19; 3 ఫోర్లు) ధనాధన్ షాట్లు ఆడటంతో ఇంగ్లండ్ భారీ స్కోరును అందుకుంది. భారత బౌలర్లలో హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఉమ్రాన్ మాలిక్ ఒక వికెట్ తీసినా కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 4 ఓవర్లలో ఏకంగా 56 పరుగులు ఇచ్చాడు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, India vs england, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Shreyas Iyer, Team India, Virat kohli

ఉత్తమ కథలు