Home /News /sports /

IND VS ENG 3RD T20 DAVID MALAN FIFTY HELPS ENGLAND TO PUT MASSIVE TARGET FOR TEAM INDIA IN 3RD AND FINAL T20I SJN

IND vs ENG : దంచి కొట్టిన డేవిడ్ మలాన్.. టీమిండియా ముందు భారీ లక్ష్యం.. ఎంతంటే?

PC : TWITTER

PC : TWITTER

IND vs ENG 3rd T20 : భారత్ (India)తో జరుగుతోన్న మూడో టి20లో ఇంగ్లండ్ (England) భారీ స్కోరు సాధించింది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిన ఇంగ్లండ్.. ఈ మ్యాచ్ లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఉంది. టాస్ గెలిచిన జాస్ బట్లర్ (Jos Buttler) బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఇంకా చదవండి ...
IND vs ENG 3rd T20 : భారత్ (India)తో జరుగుతోన్న మూడో టి20లో ఇంగ్లండ్ (England) భారీ స్కోరు సాధించింది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిన ఇంగ్లండ్.. ఈ మ్యాచ్ లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఉంది. టాస్ గెలిచిన జాస్ బట్లర్ (Jos Buttler) బ్యాటింగ్ ఎంచుకున్నాడు. డేవిడ్ మలాన్ (39 బంతుల్లో 77; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) భారత బౌలర్లను దంచి కొట్టాడు. దాంతో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్ కు తోడుగా లియామ్ లివింగ్ స్టోన్ (29 బంతుల్లో 42 నాటౌట్; 4 సిక్సర్లు) రాణించాడు. చివర్లో హ్యారీ బ్రూక్ (9 బంతుల్లో 19; 3 ఫోర్లు) ధనాధన్ షాట్లు ఆడటంతో ఇంగ్లండ్ భారీ స్కోరును అందుకుంది. భారత బౌలర్లలో హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఉమ్రాన్ మాలిక్ ఒక వికెట్ తీసినా కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 4 ఓవర్లలో ఏకంగా 56 పరుగులు ఇచ్చాడు.

టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ రెండో మ్యాచ్ లో లాగా ఫీల్డింగ్ ఎంచుకోలేదు. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా గత మ్యాచ్ ల్లో విఫలమైన బట్లర్ (18), జేసన్ రాయ్ (27) ఆరంభంలో భారీ షాట్లు ఆడారు. అయితే భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఫిల్ సాల్ట్ (8) విఫలమైయ్యాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన మలాన్, లివింగ్ స్టోన్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ 4 వికెట్ కు 84 పరుగులు జోడించారు. సెంచరీ చేసేలా కనిపించిన మలాన్.. బిష్ణోయ్ బౌలింగ్ లో పంత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. చివర్లో లివింగ్ స్టోన్ తో పాటు బ్రూక్, జోర్డాన్ (11 నాటౌట్) బౌండరీలు సాధించడంతో ఇంగ్లండ్ 200 మార్కును అందుకుంది.

తేలిపోయిన ఉమ్రాన్ మాలిక్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున రాణించిన ఉమ్రాన్ మాలిక్ ఈ మ్యాచ్ లో తేలిపోయాడు. 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసినా.. వైవిధ్యం లేకపోవడంతో బ్యాటర్లు దంచి కొట్టారు. ఓవర్ కు 14 పరుగుల చొప్పున ఉమ్రాన్ మాలిక్ పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. వేగం ఉన్నా అనుభవం వైవిధ్యమైన బంతులు లేకపోడంతో ఉమ్రాన్ పాచిక పారలేదు.

తుది జట్లు

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, ఉమ్రాన్ మాలిక్

ఇంగ్లండ్

జాస్ బట్లర్ (కెప్టెన్), జేసన్ రాయ్, డేవిడ్ మలాన్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్ స్టోన్, హ్యారీ బ్రూక్, క్రిస్ జోర్డాన్, డేవిడ్ విల్లీ, రిచర్డ్ గ్లెసన్, టాప్లీ, సాల్ట్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, India vs england, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Shreyas Iyer, Team India, Virat kohli

తదుపరి వార్తలు