IND vs ENG 3rd ODI : టీమిండియా (Team india) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli), మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj)ల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత కొన్ని సీజన్లుగా సిరాజ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal challengers Bangalore) తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే. ఒకరకంగా చెప్పాలంటే సిరాజ్ లోని ప్రతిభను ప్రపంచానికి చాటడంలో కోహ్లీ ప్రముఖ పాత్ర పోషించాడు. తాజాగా మరోసారి సిరాజ్ సక్సెస్ లో విరాట్ కోహ్లీ భాగం అయ్యాడు. గాయంతో జస్ ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ తో జరుగుతోన్న మూడో వన్డే నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అతడి స్థానంలో సిరాజ్ తుది జట్టులోకి వచ్చాడు. టాస్ ఓడి ఇంగ్లండ్ కు బ్యాటింగ్ కు దిగగా షమీ వేసిన తొలి ఓవర్ లో జేసన్ రాయ్ ధాటిగా ఆడి బౌండరీలు రాబట్టాడు. అనంతరం రోహిత్ బంతిని సిరాజ్ కు ఇచ్చాడు.
రోహిత్ కెప్టెన్ అయినప్పటికీ బెయిర్ స్టోకు ఎటువంటి బంతులను వేయాలో సిరాజ్ కు కోహ్లీ సూచించాడు. కోహ్లీ ఆదేశాలతో బంతులు వేసిన సిరాజ్.. బెయిర్ స్టో (0)ను తక్కువ పేస్ తో బోల్తా కొట్టించి పెవిలియన్ కు చేర్చాడు. ఆ తర్వాత జో రూట్ (0) క్రీజులోకి రాగా.. అతడికి కూడా ఎలా బంతులు వేయాలో సిరాజ్ కు సూచించాడు కోహ్లీ. కోహ్లీ చెప్పినట్లే చేసిన సిరాజ్ రూట్ ను కూడా అవుట్ చేశాడు. ఇలా తన తొలి ఓవర్లోనే రెండు కీలక వికెట్లు తీసి టీమిండియాకు అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధిన వీడియో ట్విట్టర్ లో వైరల్ అవుతోంది.
. https://t.co/AfzhNBDJrL pic.twitter.com/lEwjKscSWl
— Arav Mishra (@The_hitwicket18) July 17, 2022
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 45.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది. జాస్ బట్లర్ (80 బంతుల్లో 60; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు ఓపెనర్ జేసన్ రాయ్ (41), మొయిన్ అలీ (34), ఓవర్టన్ (32) పోరాడటంతో ఇంగ్లండ్ 250 మార్కును దాటగలిగింది. హార్దిక్ పాండ్యా 4 వికెట్లు తీశాడు. యుజువేంద్ర చహల్ 3 వికెట్లు తీయగా.. మొహమ్మద్ సిరాజ్ 2 వికెట్లతో రాణించాడు.
సూపర్ జడేజా
ఈ క్రమంలో మొయిన్ అలీ (34)తో కలిసి కెప్టెన్ జాస్ బట్లర్ (60; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టును ఆదుకున్నాడు. వీరు ఐదో వికెట్ కు 75 పరుగులు జోడించారు. అలీని జడేజా అవుట్ చేశాడు. అనంతరం లివింగ్ స్టోన్ (27) కూడా ఫర్వాలేదనిపించాడు. అయితే 37వ ఓవర్ వేయడానికి వచ్చిన హార్దిక్ పాండ్యా జడేజా ఫీల్డింగ్ వల్ల మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఆ ఓవర్ మూడో బంతిని లివింగ్ స్టోన్ డీప్ బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ దిశలో భారీ షాట్ ఆడాడు. దాన్ని సిక్సర్ అని అంతా భావించారు. అయితే అక్కడే ఉన్న జడేజా గాల్లోకి ఎగురుతూ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. అనంతరం అదే ఓవర్ ఆఖరి బంతికి పాండ్యా బట్లర్ ను ఊరిస్తూ షార్ట్ పిచ్ బాల్ వేశాడు. బట్లర్ కూడా లివింగ్ స్టోన్ మాదిరే షాట్ ఆడాడు. అయితే ఈసారి బంతి డీప్ స్క్వేర్ లెగ్ దిశలో వెళ్లగా.. తన ఎడమ వైపుకు పరుగెత్తుతూ జడేజా డైవ్ చేస్తూ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hardik Pandya, India vs england, Mohammed Siraj, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli