IND vs ENG 3rd ODI : భారత్ (India), ఇంగ్లండ్ (England) మధ్య జరుగుతోన్న మూడో వన్డే టీమిండియా (Team India) రాక్ స్టార్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఫీల్డింగ్ విన్యాసాలకు వేదికైంది. ఈ ఏడాది ఐపీఎల్ (IPL)లో సులభమైన క్యాచ్ లను జారవిడిచిన జడేజా.. చాలా రోజుల తర్వాత తన ఫీల్డింగ్ నైపుణ్యాలను మరోసారి ప్రదర్శించాడు. అంతేకాకుండా బౌలింగ్ లో కూడా మెరిశాడు. ప్రమాదకరంగా ఆడుతున్న ఇంగ్లండ్ ప్లేయర్లు లివింగ్ స్టోన్ (Livingstone), జాస్ బట్లర్ (Jos Buttler)లను తన అద్భుత క్యాచ్ లతో పెవిలియన్ కు చేర్చి భారత్ కు బ్రేక్ అందించాడు. టాస్ నెగ్గిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. మొహమ్మద్ సిరాజ్ ఆరంభంలో వెంట వెంటనే వికెట్లు తీశాడు. దాంతో ఇంగ్లండ్ 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.
ఈ క్రమంలో మొయిన్ అలీ (34)తో కలిసి కెప్టెన్ జాస్ బట్లర్ (60; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టును ఆదుకున్నాడు. వీరు ఐదో వికెట్ కు 75 పరుగులు జోడించారు. అలీని జడేజా అవుట్ చేశాడు. అనంతరం లివింగ్ స్టోన్ (27) కూడా ఫర్వాలేదనిపించాడు. అయితే 37వ ఓవర్ వేయడానికి వచ్చిన హార్దిక్ పాండ్యా జడేజా ఫీల్డింగ్ వల్ల మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఆ ఓవర్ మూడో బంతిని లివింగ్ స్టోన్ డీప్ బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ దిశలో భారీ షాట్ ఆడాడు. దాన్ని సిక్సర్ అని అంతా భావించారు. అయితే అక్కడే ఉన్న జడేజా గాల్లోకి ఎగురుతూ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. అనంతరం అదే ఓవర్ ఆఖరి బంతికి పాండ్యా బట్లర్ ను ఊరిస్తూ షార్ట్ పిచ్ బాల్ వేశాడు. బట్లర్ కూడా లివింగ్ స్టోన్ మాదిరే షాట్ ఆడాడు. అయితే ఈసారి బంతి డీప్ స్క్వేర్ లెగ్ దిశలో వెళ్లగా.. తన ఎడమ వైపుకు పరుగెత్తుతూ జడేజా డైవ్ చేస్తూ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు.
A fine catch from Jadeja removes Buttler.
Scorecard/clips: https://t.co/2efir2v7RD
???????????????????????????? #ENGvIND ???????? pic.twitter.com/5zIQnQ8Nh4
— England Cricket (@englandcricket) July 17, 2022
Two stunning catches in the deep by @imjadeja ????????
Definitely one of the best fielders in the world.#TeamIndia #ENGvIND pic.twitter.com/qs5bqdGPjc
— BCCI (@BCCI) July 17, 2022
Sir Ravindra Jadeja ???????? pic.twitter.com/R5m33GJwJp
— . (@CricCrazy0) July 17, 2022
హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీయడం విశేషం. ఇంకా 9 ఓవర్ల ఆట మిగిలి ఉంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 41 ఓవర్లలో 7 వికెట్లకు 226 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో డేవిడ్ విల్లీ (11 బ్యాటింగ్), ఓవర్టన్ (16) ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hardik Pandya, India vs england, Jasprit Bumrah, Mohammed Shami, Mohammed Siraj, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli