కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రదర్శన అద్భుతంగా. సారధ్య బాధ్యతలు తీసుకున్న తర్వాత రోహిత్ ఇప్పటివరకు ఒక్క సిరీస్‌ను కోల్పోలేదు వరుసగా 6 సిరీస్‌లను కూడా గెలుచుకున్నాడు. భారత్-ఇంగ్లండ్ (India vs England) మధ్య 3 వన్డేల సిరీస్‌లో డూ ఆర్ డై ఫైట్ రేపు జరగనుంది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఇక, ఇంగ్లండ్ పర్యటనలో రెండు జట్ల మధ్య పోరు ఆద్యంతం హోరాహోరీగా సాగుతుంది. టెస్ట్ సిరీస్ సమం కాగా..టీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఇక వన్డే సిరీస్ హోరాహోరీగా జరుగుతోంది. తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించగా..రెండో వన్డేలో ఇంగ్లీష్ జట్టు ప్రతికారం తీర్చుకుంది. తొలి మ్యాచ్‌లో అన్నివిభాగాల్లో టీమిండియా రాణించి..విజయఢంకా మోగించింది. అయితే.. రెండో వన్డేలో చేతులేత్తేసింది. ఏకంగా 100 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఇక, మాంచెస్టర్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు డూ ఆర్ డై ఫైట్ లో రెండు జట్లు తలపడనున్నాయ్.అయితే ఈ డిసైడర్ మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టులో మార్పులు చేసే అవకాశం లేదు. ఒకవేళ ఎవరినైనా తీసేయాలనుకుంటే మాత్రం రెండో వన్డేలో దారుణంగా విఫలమైన ప్రసిద్ కృష్ణ (Prasidh Krishna)పై వేటు వేసే ఛాన్సుంది.
టీమిండియాకు బ్యాటింగ్ విభాగం కలవర పెడుతోంది. కోహ్లీ ఫామ్‌లో లేకపోవడంతో జట్టుకు ఇబ్బందిగా మారింది. ఐతే జట్టు యాజమాన్యం మాత్రం అతడిపైనే భరోసా ఉంచింది. కోహ్లీ అద్భుత ఆటగాడని..ఇందులో ఎలాంటి సందేహం లేదని ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. దీంతో.. కోహ్లీ ఈ వన్డేలో సత్తా చాటుతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇక, తొలి వన్డేలో అద్భుత ప్రదర్శన కనబర్చిన రోహిత్, శిఖర్ ధావన్ జోడీనే రెండో మ్యాచ్‌లో దారుణంగా విఫలమైంది. రోహిత్ డకౌటవ్వగా.. ధావన్ 9 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఇద్దరి వైఫల్యం టీమిండియా పతనాన్ని శాసించింది. దీంతో.. కీలక మ్యాచులో మరోసారి ఈ జోడి మంచి ఆరంభం అందిస్తేనే టీమిండియాకు విజయం దక్కే అవకాశం ఉంది. ఇక, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్, జడేజాలు మరింతగా రాణించాల్సి ఉంది.
మరోవైపు.. టీమిండియా బౌలింగ్ విభాగం అద్భుత ప్రదర్శన చేస్తుంది. జస్ప్రీత్ బుమ్రా, షమీ పేస్ బౌలింగ్ తో దడదడలాడిస్తుండగా.. స్పిన్నర్ చాహల్ తన మాయజాలంతో ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అయితే.. ప్రసిద్ధ్ కృష్ణ ఒక్కడే తడబడతున్నాడు. దీంతో.. అతని స్ధానంలో శార్దూల్ ఠాకూర్ కు చోటు దక్కే ఛాన్స్ ఉంది. లేకపోతే.. రెండో వన్డేలో బరిలోకి దిగిన జట్టే మూడో మ్యాచులో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి : అయ్యో.. లంక క్రికెటర్ కు ఎంత కష్టమొచ్చింది.. దేవుడా ఇలా ఎన్ని రోజులు..
మరోవైపు.. ఇంగ్లండ్ మంచి ఊపు మీద ఉంది. రెండో వన్డేలో ఆ జట్టు ఘన విజయం సాధించింది. అదే స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని యోచిస్తోంది. మొదటి, రెండో వన్డేలో బ్యాటింగ్ విభాగం ఘోరంగా విఫలమైంది. రెండో వన్డేలో బౌలర్లు అద్భుతంగా రాణించడంతో గెలుపు రుచి చూశారు. మొత్తంగా ఇంగ్లండ్ జట్టులోనూ ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. తమ బ్యాటింగ్‌పై ఎలాంటి గందరగోళం లేదని ఇప్పటికే ఆ జట్టు యజమాన్యం స్పష్టం చేసింది.
భారత తుది జట్టు అంచనా :
రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్(కీపర్), రవీంద్ర జడేజా, ప్రసిద్ద్ కృష్ణ/ శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, India vs england, Rohit sharma, Team India, Virat kohli