హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs ENG 3rd Odi : సిరీస్ డిసైడర్ లో టాస్ నెగ్గిన రోహిత్.. భారత్ కు భారీ షాక్.. గాయంతో తప్పుకున్న స్టార్ బౌలర్

IND vs ENG 3rd Odi : సిరీస్ డిసైడర్ లో టాస్ నెగ్గిన రోహిత్.. భారత్ కు భారీ షాక్.. గాయంతో తప్పుకున్న స్టార్ బౌలర్

PC :

PC :

IND vs ENG 3rd Odi : మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో విజేతను తేల్చే చివరిదైన మూడో మ్యాచ్ లో భారత (India) కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టాస్ నెగ్గాడు. అయితే ఈసారి కూడా బ్యాటింగ్ కాకుండా మరోసారి ఫీల్డింగ్ నే ఎంచుకున్నాడు.

IND vs ENG 3rd Odi : మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో విజేతను తేల్చే చివరిదైన మూడో మ్యాచ్ లో భారత (India) కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టాస్ నెగ్గాడు. అయితే ఈసారి కూడా బ్యాటింగ్ కాకుండా మరోసారి ఫీల్డింగ్ నే ఎంచుకున్నాడు. మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రఫోర్డ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు భారత్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా ఈ  మ్యాచ్ లో ఆడటం లేదు. దాంతో అతడి స్థానంలో మొహమ్మద్ సిరాజ్ భారత తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక మరోవైపు ఇంగ్లండ్ మాత్రం గత రెండు మ్యాచ్ ల్లో కొనసాగించిన టీంనే ఈ మ్యాచ్ లోనూ కొనసాగించనుంది.

భారత్ కు ఎదురుదెబ్బ

ఇంగ్లండ్ తో జరిగిన తొలి వన్డేలో 6 వికెట్లు.. రెండో వన్డేలో రెండు వికెట్లు.. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఉన్నాడు బుమ్రా. అయితే అనూహ్యంగా అతడు మూడో వన్డే నుంచి గాయంతో తప్పుకున్నాడు. ముందు జాగ్రతలో భాగంగా అతడికి మూడో వన్డేలో చోటు ఇవ్వలేదని రోహిత్ పేర్కొన్నాడు. అతడి స్థానంలో హైదరాబాద్ స్టార్ మొహమ్మద్ సిరాజ్ కు అవకాశం ఇచ్చారు. ఇక గత రెండు మ్యాచ్ ల్లోనూ దారుణంగా విఫలమైన ప్రసిద్ద్ కృష్ణకు మరోసారి అవకాశం ఇవ్వడం విశేషం. అతడి స్థానంలో యువ ప్లేయర్ అర్ష్ దీప్ సింగ్ ను తీసుకుంటే బాగుండేదేమో.

అందరి కళ్లూ కోహ్లీ, ధావన్ లపైనే

ఈ మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ కొన్ని రోజుల పాటు క్రికెట్ కు దూరం కానున్నాడు. గత కొంతకాలంగా పూర్ ఫామ్ లో ఉన్న కోహ్లీ ఆటకు విరామం కావాలని బీసీసీఐని కోరినట్లు వార్తలు కూడా వచ్చాయి. దాంతో అతడిని వెస్టిండీస్ తో జరిగే ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ కు ఎంపిక చేయకపోవడం తెలిసిందే. అతడు ఈ మ్యాచ్ లో ఎలా ఆడతాడో అని క్రికెట్ లవర్స్ ఉత్కంఠగా ఉన్నారు. ఇక వెస్టిండీస్ తో జరిగే మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కోసం ధావన్ కెప్టెన్ గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. అయితే అతడు ఈ సిరీస్ లో మరీ నెమ్మదిగా ఆడుతున్నాడు. తొలి వన్డేలో 58 బంతుల్లో 31 పరుగులు చేసిన అతడు.. రెండో వన్డేలో విఫలం అయ్యాడు. అయితే ఈ మ్యాచ్ లో ఫామ్ అందుకోవాలని ధావన్ పట్టుదలగా ఉన్నాడు.

భారత తుది జట్టు  

రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్(కీపర్), రవీంద్ర జడేజా, ప్రసిద్ద్ కృష్ణ, మహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

ఇంగ్లండ్ తుది జట్టు

జాస్ బట్లర్ (కెప్టెన్), జేసన్ రాయ్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, లివింగ్ స్టోన్, డేవిడ్ విల్లీ, ఓవర్టన్, కర్సే, రీస్ టొప్లే

First published:

Tags: Hardik Pandya, India vs england, Jasprit Bumrah, Mohammed Shami, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు