హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs ENG 3rd ODI : సిరాజ్ అదిరిపోయే ఆరంభం ఇచ్చినా.. హార్దిక్, జడేజా మెరిసినా.. టీమిండియా ముందు టఫ్ టార్గెట్.. ఎంతంటే?

IND vs ENG 3rd ODI : సిరాజ్ అదిరిపోయే ఆరంభం ఇచ్చినా.. హార్దిక్, జడేజా మెరిసినా.. టీమిండియా ముందు టఫ్ టార్గెట్.. ఎంతంటే?

PC : TWITTER

PC : TWITTER

IND vs ENG 3rd ODI : భారత్ (India), ఇంగ్లండ్ (England) జట్ల మధ్య జరుగుతోన్న డిసైడర్ మ్యాచ్ లో ఇంగ్లండ్  జట్టు మంచి స్కోరును సాధించింది. ఆరంభంలో హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj).. హార్దిక్ పాండ్యా (Hardik Pandya).. రవీంద్ర జడేజా (Ravindra Jadeja)లు మెరిసినా ఇంగ్లండ్ భారీ స్కోరును సాధించింది.

ఇంకా చదవండి ...

IND vs ENG 3rd ODI : భారత్ (India), ఇంగ్లండ్ (England) జట్ల మధ్య జరుగుతోన్న డిసైడర్ మ్యాచ్ లో ఇంగ్లండ్  జట్టు మంచి స్కోరును సాధించింది. ఆరంభంలో హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj).. హార్దిక్ పాండ్యా (Hardik Pandya).. రవీంద్ర జడేజా (Ravindra Jadeja)లు మెరిసినా ఇంగ్లండ్ భారీ స్కోరును సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 45.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది. జాస్ బట్లర్ (80 బంతుల్లో 60; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు ఓపెనర్ జేసన్ రాయ్ (41), మొయిన్ అలీ (34), ఓవర్టన్ (32) పోరాడటంతో ఇంగ్లండ్ 250 మార్కును దాటగలిగింది. హార్దిక్ పాండ్యా 4 వికెట్లు తీశాడు. యుజువేంద్ర చహల్ 3 వికెట్లు తీయగా.. మొహమ్మద్ సిరాజ్ 2 వికెట్లతో రాణించాడు.

టాస్ గెలిచిన రోహిత్ శర్మ మరోసారి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గాయంతో జస్ ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ కు దూరం కావడంతో అతడి స్థానంలో మొహమ్మద్ సిరాజ్ తుది జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్ తో టెస్టు మ్యాచ్ లో అదరగొట్టిన సిరాజ్.. ఈ మ్యాచ్ లోనూ సత్తా చాటాడు. తన తొలి ఓవర్ లోనే జానీ బెయిర్ స్టో (0), జో రూట్ (0)లను పెవిలియన్ కు పంపాడు. ఈ దశలో జేసన్ రాయ్, బెన్ స్టోక్స్ (27) కాసేపు భారత బౌలర్లను ప్రతిఘటించారు. అయితే బౌలింగ్ కు వచ్చిన హార్దిక్ పాండ్యా వీరిద్దరినీ పెవలియన్ కు పంపాడు. ఫలితంగా ఇంగ్లండ్ 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

సూపర్ జడేజా

ఈ క్రమంలో మొయిన్ అలీ (34)తో కలిసి కెప్టెన్ జాస్ బట్లర్ (60; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టును ఆదుకున్నాడు. వీరు ఐదో వికెట్ కు 75 పరుగులు జోడించారు. అలీని జడేజా అవుట్ చేశాడు. అనంతరం లివింగ్ స్టోన్ (27) కూడా ఫర్వాలేదనిపించాడు. అయితే 37వ ఓవర్ వేయడానికి వచ్చిన హార్దిక్ పాండ్యా జడేజా ఫీల్డింగ్ వల్ల మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఆ ఓవర్ మూడో బంతిని లివింగ్ స్టోన్ డీప్ బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ దిశలో భారీ షాట్ ఆడాడు. దాన్ని సిక్సర్ అని అంతా భావించారు. అయితే అక్కడే ఉన్న జడేజా గాల్లోకి ఎగురుతూ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. అనంతరం అదే ఓవర్ ఆఖరి బంతికి పాండ్యా బట్లర్ ను ఊరిస్తూ షార్ట్ పిచ్ బాల్ వేశాడు. బట్లర్ కూడా లివింగ్ స్టోన్ మాదిరే షాట్ ఆడాడు. అయితే ఈసారి బంతి డీప్ స్క్వేర్ లెగ్ దిశలో వెళ్లగా.. తన ఎడమ వైపుకు పరుగెత్తుతూ జడేజా డైవ్ చేస్తూ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు.

First published:

Tags: Hardik Pandya, India vs england, Mohammed Shami, Mohammed Siraj, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Shikhar Dhawan, Team India, Virat kohli

ఉత్తమ కథలు