హోమ్ /వార్తలు /క్రీడలు /

IND vs ENG : రేపే రెండో టి20.. తుది జట్టుపై టీమిండియా తర్జనభర్జన.. కార్తీక్ కాకాపై వేటు తప్పదా?

IND vs ENG : రేపే రెండో టి20.. తుది జట్టుపై టీమిండియా తర్జనభర్జన.. కార్తీక్ కాకాపై వేటు తప్పదా?

Team India ( PC : BCCI)

Team India ( PC : BCCI)

IND vs ENG : మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా శనివారం భారత్ (India), ఇంగ్లండ్ (England) జట్ల మధ్య రెండో టి20 జరగనుంది. తొలి టి20లో భారత్ 50 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకొని సిరీస్ లో శుభారంభం చేసిన సంగతి తెలిసిందే.

IND vs ENG : మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా శనివారం భారత్ (India), ఇంగ్లండ్ (England) జట్ల మధ్య రెండో టి20 జరగనుంది. తొలి టి20లో భారత్ 50 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకొని సిరీస్ లో శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇక రేపు జరిగే రెండో టి20లోనూ విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఇక మరోవైపు సొంత గడ్డపై భారత్ చేతిలో ఎదురైన ఓటమి నుంచి తేరుకుని రెండో టి20లో గెలిచి సిరీస్ లో నిలవాలని కొత్త కెప్టెన్ జాస్ బట్లర్ నాయకత్వంలోని ఇంగ్లండ్ పట్టుదలగా ఉంది.

తుది జట్టుపై టీమిండియా తర్జన భర్జన

ఇంగ్లండ్ తో ఐదో టెస్టు మ్యాచ్ ముగిసిన రోజు తర్వాతే తొలి టి20 జరగడంతో.. టెస్టు మ్యాచ్ లో ఆడిన ప్లేయర్లకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. ఫలితంగా దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్ లాంటి యువ ప్లేయర్లకు తొలి టి20లో ఆడే అవకాశం వచ్చింది. అయితే రెండో టి20కి సీనియర్లు అయిన కోహ్లీ, పంత్, జస్ ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు తిరిగి రావడంతో జట్టు కూర్పు ఎలా ఉంటుందనేది అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది. ఇంగ్లండ్ తో జరిగే టి20 కోసం విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, జడేజా, జస్ ప్రీత్ బుమ్రాలు తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో అర్ష్ దీప్ సింగ్, దీపక్ హుడా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్ లపై వేటు వేసే ప్రమాదం ఉంది. ఒకవేళ విరాట్ ను రోహిత్ తో పాటు ఓపెనర్ గా ఆడించాలని అనుకుంటే మాత్రం ఇషాన్ కిషన్ తప్పుకోవాల్సి రావచ్చు. అప్పుడు దీపక్ హుడా వన్ డౌన్ లో ఆడే అవకాశం ఉంది. దీపక్ హుడా ఐపీఎల్ నుంచి కూడా సూపర్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. తొలి టి20లో కూడా అతడు అద్భుతంగా ఆడాడు.

సూపర్ ఫామ్ లో హార్దిక్

హార్దిక్ పాండ్యా సూపర్ ఫామ్ లో ఉండటం భారత్ కు సానుకూలాంశం. తొలి టి20లో 51 పరుగులు చేయడంతో పాటు 4 వికెట్లు తీసి జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. ఇంగ్లండ్ తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్ లో అదరగొట్టిన రిషభ్ పంత్.. టి20ల్లో కూడా అదే రీతిలో ఆడతాడో లేదో చూడాలి. ఒకరకంగా చెప్పాలంటే అందరి కళ్లు కూడా అతడిపైనే ఉన్నాయి. పంత్ పొట్టి ఫార్మాట్ లో రాణిస్తేనే టి20 ప్రపంచకప్ లో అతడికి తుది జట్టులో స్థానం దక్కే అవకాశం ఉంది. లేదంటే అతడు టెస్టులకే పరిమితం అయ్యే అవకాశం ఉంది.

టీమిండియా తుది జట్టు (అంచనా)

రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్/దీపక్ హుడా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, బుమ్రా, యుజువేంద్ర చహల్

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Hardik Pandya, India vs england, Jasprit Bumrah, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు