Home /News /sports /

IND VS ENG 2ND T20 INDIA PUT FIGHTING TOTAL FOR ENGLAND IN 2ND T20I SJN

IND vs ENG 2nd T20 : కోహ్లీ మళ్లీ విఫలం.. చివర్లో జడేజా ధనాధన్ ఇన్నింగ్స్.. ఇంగ్లండ్ ముందు ఫైటింగ్ టోటల్.. ఎంతంటే?

PC : BCCI

PC : BCCI

IND vs ENG 2nd T20 : ఇంగ్లండ్ (England)తో జరుగుతోన్న రెండో టి20లో భారత్ (India) ప్రత్యర్థి ముందు ఫైటింగ్ టార్గెట్ ను పెట్టగలిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (29 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ఇంకా చదవండి ...
IND vs ENG 2nd T20 : ఇంగ్లండ్ (England)తో జరుగుతోన్న రెండో టి20లో భారత్ (India) ప్రత్యర్థి ముందు ఫైటింగ్ టార్గెట్ ను పెట్టగలిగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (29 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్ గా వచ్చిన రిషభ్ పంత్ (15 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆరంభంలో మెరుపులు మెరిపించినా ఆ తర్వాత దానిని కొనసాగించుకోలేకపోయాడు. రోహిత్ శర్మ (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరు మినహా మిగిలిన వారు పెద్దగా రాణించలేకపోయాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 4 వికెట్లు తీశాడు. 34 ఏళ్ల వయసులో టి20ల్లో అరంగేట్రం చేసిన రిచర్డ్ గ్లీసన్ 3 వికెట్లతో చెలరేగాడు.

కోహ్లీ మళ్లీ విఫలం

టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రిషభ్ పంత్ ను ఓపెనర్ గా కోచ్ ద్రవిడ్ పంపాడు. ఒకరకంగా చెప్పాలంటే ఇది సక్సెస్ అయ్యింది. పవర్ ప్లేలో రోహిత్ శర్మ, రిషభ్ పంత్ చెలరేగిపోయారు. వీరిద్దరూ కూడా భారీ షాట్లతో బౌండరీలు సాధిస్తూ స్కోరు బోర్డును పరుగెత్తించారు. తొలి వికెట్ కు వీరు 4.5 ఓవర్లలో 49 పరుగులు జోడించారు. అయితే అరంగేట్రం హీరో రిచర్డ్ గ్లీసన్ అద్భుతమైన బౌన్సర్ తో రోహిత్ ను అవుట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ కేవలం మూడే బంతులు ఎదర్కొని 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు. వరుస బంతుల్లో పంత్, కోహ్లీలను గ్లీసన్ అవుట్ చేయడంతో భారత్ ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే సూర్యకుమార్ యాదవ్ (15), హార్దిక్ పాండ్యా (12) జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ, జోర్డాన్ వరుస బంతుల్లో వీరిని అవుట్ చేశాడు. సమన్వయ లోపంతో దినేశ్ కార్తీక్ (12) రనౌట్ అయ్యాడు. చివర్లో రవీంద్ర జడేజా దూకుడుగా ఆడటంతో భారత్ ఫైటింగ్ టోటల్ ను ప్రత్యర్థి ముందు ఉంచగలిగింది.



తుది జట్లు

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, దినేశ్ కార్తీక్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, బుమ్రా, యుజువేంద్ర చహల్

ఇంగ్లండ్

జాస్ బట్లర్ (కెప్టెన్), జేసన్ రాయ్, డేవిడ్ మలాన్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్ స్టోన్, హ్యారీ బ్రూక్, స్యామ్ కరణ్, క్రిస్ జోర్డాన్, డేవిడ్ విల్లీ, రిచర్డ్ గ్లీసన్, మ్యాట్ పార్కిన్సన్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, India vs england, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు