Home /News /sports /

IND VS ENG 2ND T20 INDIA BEAT ENGLAND BY 49 RUNS IN 2ND T20I AND CLINCHES SERIES SJN

IND vs ENG : ఇంగ్లండ్ టాప్ లేపిన భువనేశ్వర్.. రెండో టి20లో భారత్ ఘనవిజయం

PC : BCCI

PC : BCCI

IND vs ENG : ఇంగ్లండ్ (England)తో జరిగిన రెండో టి20 టీమిండియా (Team India) పేసర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) అదరగొట్టాడు. మూడు వికెట్లతో భువనేశ్వర్ కుమార్ చెలరేగడంతో రెండో టి20లో భారత్ 49 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

ఇంకా చదవండి ...
IND vs ENG : ఇంగ్లండ్ (England)తో జరిగిన రెండో టి20 టీమిండియా (Team India) పేసర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) అదరగొట్టాడు. మూడు వికెట్లతో భువనేశ్వర్ కుమార్ చెలరేగడంతో రెండో టి20లో భారత్ 49 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్ ల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్.. 2-0తో సొంతం చేసుకుంది. భువనేశ్వర్ కు తోడు జస్ ప్రీత్ బుమ్రా, యుజువేంద్ర చహల్ చెరో రెండు వికెట్లు తీశారు. దాంతో 171 పరుగలు లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 17 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ విజయం కోసం మొయిన్ అలీ (35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ విల్లీ (33 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టు విజయం కోసం పోరాడారు.

భువనేశ్వర్ అదరహో

గాయం నుంచి కోలుకున్నాక భువనేశ్వర్ కుమార్ చెలరేగిపోతున్నాడు. కొత్త బంతితో అద్భుతమైన స్వింగ్ ను రాబడుతోన్న భువీ.. ఆరంభ ఓవర్లో వికెట్లు తీస్తూ భారత్ కు శుభారంభం చేస్తున్నారు. సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ లో రాణించిన భువనేశ్వర్.. ఇంగ్లండ్ తో జరుగుతోన్న సిరీస్ లోనూ అదరగొడుతున్నాడు. తొలి టి20లో జాస్ బట్లర్ వికెట్ ను తీసిన భువీ.. ఈ మ్యాచ్ లోనూ తొలి బంతికే జేసన్ రాయ్ (0) ను అవుట్ చేశాడు. అనంతరం బట్లర్ (4), రిచర్డ్ గ్లీసన్ (2)లను కూడా పెవిలియన్ కు చేర్చాడు. కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చిన భువీ మూడు వికెట్లు తీసి భారత గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు.



టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (29 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్ గా వచ్చిన రిషభ్ పంత్ (15 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆరంభంలో మెరుపులు మెరిపించినా ఆ తర్వాత దానిని కొనసాగించుకోలేకపోయాడు. రోహిత్ శర్మ (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరు మినహా మిగిలిన వారు పెద్దగా రాణించలేకపోయాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 4 వికెట్లు తీశాడు. 34 ఏళ్ల వయసులో టి20ల్లో అరంగేట్రం చేసిన రిచర్డ్ గ్లీసన్ 3 వికెట్లతో చెలరేగాడు.

ఇది కూడా చదవండి : వామ్మో గంగూలీ.. నీలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా.. బర్త్ డే నైట్ కూతురుతో కలిసి ఏం చేశాడంటే?

టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రిషభ్ పంత్ ను ఓపెనర్ గా కోచ్ ద్రవిడ్ పంపాడు. ఒకరకంగా చెప్పాలంటే ఇది సక్సెస్ అయ్యింది. పవర్ ప్లేలో రోహిత్ శర్మ, రిషభ్ పంత్ చెలరేగిపోయారు. వీరిద్దరూ కూడా భారీ షాట్లతో బౌండరీలు సాధిస్తూ స్కోరు బోర్డును పరుగెత్తించారు. తొలి వికెట్ కు వీరు 4.5 ఓవర్లలో 49 పరుగులు జోడించారు. అయితే అరంగేట్రం హీరో రిచర్డ్ గ్లీసన్ అద్భుతమైన బౌన్సర్ తో రోహిత్ ను అవుట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ కేవలం మూడే బంతులు ఎదర్కొని 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు. వరుస బంతుల్లో పంత్, కోహ్లీలను గ్లీసన్ అవుట్ చేయడంతో భారత్ ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే సూర్యకుమార్ యాదవ్ (15), హార్దిక్ పాండ్యా (12) జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ, జోర్డాన్ వరుస బంతుల్లో వీరిని అవుట్ చేశాడు. సమన్వయ లోపంతో దినేశ్ కార్తీక్ (12) రనౌట్ అయ్యాడు. చివర్లో రవీంద్ర జడేజా దూకుడుగా ఆడటంతో భారత్ ఫైటింగ్ టోటల్ ను ప్రత్యర్థి ముందు ఉంచగలిగింది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Hardik Pandya, India vs england, Jasprit Bumrah, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు