Home /News /sports /

IND VS ENG 2ND T20 ENGLAND WON THE TOSS AND ELECTED TO BOWL FIRST SJN

IND vs ENG 2nd T20 : టాస్ గెలిచిన ఇంగ్లండ్.. నాలుగు మార్పులు చేసిన టీమిండియా.. ఓపెనర్ గా పంత్

PC : BCCI

PC : BCCI

IND vs ENG 2nd T20 : IND vs ENG 2nd T20 : మరికాసేపట్లో ఇంగ్లండ్ ()తో ఆరంభమయ్యే రెండో టి20లో భారత (India) కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టాస్ ఓడిపోయాడు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ (Jos buttler) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ ఏకంగా నాలుగు మార్పులు చేసింది.

ఇంకా చదవండి ...
IND vs ENG 2nd T20 : మరికాసేపట్లో ఇంగ్లండ్ ()తో ఆరంభమయ్యే రెండో టి20లో భారత (India) కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టాస్ ఓడిపోయాడు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ (Jos buttler) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ ఏకంగా నాలుగు మార్పులు చేసింది. విరాట్ కోహ్లీ (Virat kohli), రవీంద్ర జడేజా (Ravindra Jadeja), జస్ ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), రిషభ్ పంత్ (Rishabh Pant)లను తుది జట్టులోకి తీసుకుంది. గత మ్యాచ్ లో ఆడిన ఇషాన్ కిషన్, దీపక్ హుడా, అర్ష్ దీప్, అక్షర్ పటేల్ లను పక్కన పెట్టింది. మరో వైపు తొలి టి20లో ఓడిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్ కోసం రెండు మార్పులు చేసింది. ఈ మ్యాచ్ కోసం డేవిడ్ విల్లీ, రిచర్డ్ గ్లెసన్ లను తుది జట్టులోకి తీసుకుంది.

ఇంగ్లండ్ తో ఐదో టెస్టు మ్యాచ్ ముగిసిన రోజు తర్వాతే తొలి టి20 జరగడంతో.. టెస్టు మ్యాచ్ లో ఆడిన ప్లేయర్లకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. ఫలితంగా దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్ లాంటి యువ ప్లేయర్లకు తొలి టి20లో ఆడే అవకాశం వచ్చింది. అయితే రెండో టి20కి సీనియర్లు అయిన కోహ్లీ, పంత్, జస్ ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు తిరిగి రావడంతో జట్టు కూర్పు మారిపోయింది. ఇక దినేశ్ కార్తీక్ పై కూడా వేటు పడటం ఖాయం అని అంతా అనుకున్నారు. అయితే పంత్ ను ఓపెనర్ గా పంపడం ద్వారా దినేశ్ కార్తీక్ కు చోటు దొరికింది.

అందరి కళ్లూ కోహ్లీపైనే

గత కొంత కాలంగా ఫామ్ తో విరాట్ కోహ్లీ తంటాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కోహ్లీ మరీ దారుణంగా ఆడుతున్నాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా ప్రతి చోటా దారుణంగా విఫలమవుతూ పరుగులు సాధించలేకపోతున్నాడు. దాంతో ఆడకున్నా కూడా అతడికి తుది జట్టులో చోటు ఏంటంటూ విమర్శలు చేసే వారు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. తాజాగా కపిల్ దేవ్ సైతం కోహ్లీ విషయంలో బీసీసీఐ తీరును తప్పుబట్టాడు. ఫామ్ లో ఉన్న అశ్విన్ ను టెస్టుల నుంచి తప్పించినపుడు.. ఫామ్ లో లేని కోహ్లీని ఎందుకు తప్పించకూడదు అంటూ బీసీసీఐని సూటిగా ప్రశ్నించాడు. దాంతో ఈ సిరీస్ లో కోహ్లీ పరుగులు సాధించడం చాలా ముఖ్యం. ఒకరకంగా చెప్పాలంటే ఇదే ఆఖరి అవకాశం.

తుది జట్లు

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, దినేశ్ కార్తీక్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, బుమ్రా, యుజువేంద్ర చహల్

ఇంగ్లండ్

జాస్ బట్లర్ (కెప్టెన్), జేసన్ రాయ్, డేవిడ్ మలాన్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్ స్టోన్, హ్యారీ బ్రూక్, స్యామ్ కరణ్, క్రిస్ జోర్డాన్, డేవిడ్ విల్లీ, రిచర్డ్ గ్లెసన్, మ్యాట్ పార్కిన్సన్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Hardik Pandya, India vs england, Jasprit Bumrah, Ravindra Jadeja, Rohit sharma, Team India, Virat kohli

తదుపరి వార్తలు