Ind vs Eng 2nd ODI : లార్డ్స్ వేదికగా మరికొద్ది సేపట్లో ఆరంభం కానున్న రెండో వన్డేలో భారత సారథి రోహిత శర్మ (Rohit Sharma) టాస్ నెగ్గాడు. మొదటి వన్డేలో లాగే ఈ మ్యాచ్ లోనూ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ (Virat Kohli) అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపాడు. గజ్జల్లో గాయంతో గత మ్యాచ్ కు దూరమైన విరాట్ కోహ్లీ కోలుకున్నాడు. దాంతో ఈ మ్యాచ్ లో బరిలోకి దిగనున్నాడు. అతడు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) స్థానంలో తుది జట్టులోకి వచ్చాడు. ఈ మార్పు మినహా భారత్ ఎటువంటి మార్పులు చేయలేదు. అదే సమయంలో తొలి వన్డేలో ఊహించని రీతిలో ఓడిపోయిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్ కోసం ఎటువంటి మార్పులు చేయకపోవడం విశేషం. తొలి వన్డేలో ఆడిన జట్టునే కొనసాగించేందుకు బట్లర్ మొగ్గు చూపాడు.
కోహ్లీ కమ్ బ్యాక్
ఈ మ్యాచ్ ఆరంభానికి కొన్ని గంటలు ముందుగా వెస్టిండీస్ తో జరిగే ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ కోసం బీసీసీఐ సెలెక్టర్లు 18 మందితో టీమిండియా జట్టును ప్రకటించింది. అయితే ఇందులో విరాట్ కోహ్లీని ఎంపికచేయలేదు. దాంతో రెండో వన్డేలో కూడా కోహ్లీ ఆడడేమో అని అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా కోహ్లీ తుది జట్టులోకి వచ్చాడు. ఇది ఒక రకంగా అతడి అభిమానులకు ఊరటనిచ్చే అంశం. ఈ మ్యాచ్ లో అయినా కోహ్లీ రాణించాలని వారు ఆక్షాంక్షిస్తున్నారు.
తొలి వన్డేలో 30 ఓవర్లు కూడా ఆడలేకపోయిన ఇంగ్లండ్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. టాస్ ఓడటంతో మరోసారి ఆ జట్టు తొలుత బ్యాటింగ్ కు రావాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో జస్ ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ ద్వయాన్ని ఇంగ్లండ్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. తొలి వన్డేలో స్టార్ బ్యాటర్స్ అయిన జో రూట్, బెన్ స్టోక్స్, జేసన్ రాయ్, లివింగ్ స్టోన్ లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో భారత్ పేస్ ద్వయాన్ని ఇంగ్లండ్ ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి.
తుది జట్టు
టీమిండియా
రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా , సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజువేంద్ర చహల్
ఇంగ్లండ్
జాస్ బట్లర్ (కెప్టెన్), జేసన్ రాయ్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, లివింగ్ స్టోన్, డేవిడ్ విల్లీ, ఓవర్టన్, కర్సే, రీస్ టొప్లే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hardik Pandya, India vs england, Jasprit Bumrah, Mohammed Shami, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Shikhar Dhawan, Shreyas Iyer, Team India, Virat kohli