IND vs ENG 2nd ODI : భారత్ (India)తో క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా జరుగుతోన్న రెండో వన్డేలోనూ ఇంగ్లండ్ (England) జట్టు తడబడుతోంది. తొలి వన్డేలో 25.2 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌటైన ఇంగ్లండ్.. రెండో వన్డేలోనూ పరుగులు చేయడానికి నానా తంటాలు పడుతోంది. తొలి వన్డేలో జస్ ప్రీత్ బుమ్రా 6 వికెట్లతో చెలరేగితే షమీ మూడు వికెట్లు తీశాడు. అయితే రెండో వన్డేలో యుజువేంద్ర చహల్ తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించడంతో 25 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 5 వికెట్లకు 117 పరుగులు చేసింది. మొహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం క్రీజులో లియామ్ లివింగ్ స్టోన్ (12 నాటౌట్), మొయిన్ అలీ (5 నాటౌట్) క్రీజులో ఉన్నారు. టాస్ ఓడి బ్యాటింగ్ ఇంగ్లండ్ బ్యాటింగ్ కు దిగగా.. జేసన్ రాయ్ (23), జానీ బెయిర్ స్టో (38) ఫర్వాలేదనిపించారు. వీరిద్దరూ అవుటయ్యాక జో రూట్ (11), బెన్ స్టోక్స్ (21), జాస్ బట్లర్ (4) వెంట వెంటనే అవుటయ్యారు.
కోహ్లీ కమ్ బ్యాక్
ఈ మ్యాచ్ ఆరంభానికి కొన్ని గంటలు ముందుగా వెస్టిండీస్ తో జరిగే ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ కోసం బీసీసీఐ సెలెక్టర్లు 18 మందితో టీమిండియా జట్టును ప్రకటించింది. అయితే ఇందులో విరాట్ కోహ్లీని ఎంపికచేయలేదు. దాంతో రెండో వన్డేలో కూడా కోహ్లీ ఆడడేమో అని అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా కోహ్లీ తుది జట్టులోకి వచ్చాడు. ఇది ఒక రకంగా అతడి అభిమానులకు ఊరటనిచ్చే అంశం. ఈ మ్యాచ్ లో అయినా కోహ్లీ రాణించాలని వారు ఆక్షాంక్షిస్తున్నారు.
తొలి వన్డేలో 30 ఓవర్లు కూడా ఆడలేకపోయిన ఇంగ్లండ్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. టాస్ ఓడటంతో మరోసారి ఆ జట్టు తొలుత బ్యాటింగ్ కు రావాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో జస్ ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ ద్వయాన్ని ఇంగ్లండ్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. తొలి వన్డేలో స్టార్ బ్యాటర్స్ అయిన జో రూట్, బెన్ స్టోక్స్, జేసన్ రాయ్, లివింగ్ స్టోన్ లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో భారత్ పేస్ ద్వయాన్ని ఇంగ్లండ్ ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి.
తుది జట్టు
టీమిండియా
రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా , సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజువేంద్ర చహల్
ఇంగ్లండ్
జాస్ బట్లర్ (కెప్టెన్), జేసన్ రాయ్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, లివింగ్ స్టోన్, డేవిడ్ విల్లీ, ఓవర్టన్, కర్సే, రీస్ టొప్లే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hardik Pandya, India vs england, Jasprit Bumrah, Mohammed Shami, Ravindra Jadeja, Rishabh Pant, Rohit sharma, Team India, Virat kohli